S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

01/18/2020 - 23:05

శివ కందుకూరి, వర్ష, మాళవిక ప్రధాన తారాగణంగా శేష సింధూరావు దర్శకత్వంలో రాజ్ కందుకూరి రూపొందించిన చిత్రం చూసీ చూడంగానే. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 31న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

01/18/2020 - 23:03

అశోక్‌రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘మిస్టర్ అండ్ మిస్’. జ్ఞానేశ్వరి కాండ్రేగుల, శైలేష్ సన్ని జంటగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ హైదరాబాద్‌లో విడుదల చేశారు.

01/18/2020 - 23:01

పాటలతోనే సినిమాను సక్సెస్‌వైపు నడిపించగల సత్తా -దేవీశ్రీ ప్రసాద్‌ది. గతంలో ఎన్నో సినిమాలకు -్ఫల్ ఆల్బమ్ హిట్టు రిక్డార్డునిచ్చి ప్రాజెక్టులను సక్సెస్‌వైపు నడిపించాడు. అలాంటి దేవిశ్రీ నుంచి ఇటీవలి కాలంలో చర్చించుకోతగినంత గొప్ప ఆల్బమ్స్ ఏమీ రాలేదు. ఎలాంటి మ్యాజిక్‌లేని రొటీన్ మ్యూజిక్ ఇస్తున్నాడన్న అపవాదు ఎదుర్కొంటున్నాడు దేవిశ్రీ.

01/18/2020 - 22:58

ఒకప్పుడు రజనీ సినిమా గురించి -విడుదలకు రెండునెలలు ముందు, రెండు నెలలు తరువాత మాట్లాడుకునే పరిస్థితి ఉండేది. కాని వరుస ఫ్లాపుల కారణంగా రజనీ ఇమేజ్ దెబ్బతినడంతో ఆయన్నుంచి వస్తోన్న చిత్రాలను మరుసటి రోజుకే మర్చిపోతున్న వైనం కనిపిస్తోంది. కాలా, పేటలాంటి చిత్రాలు విడుదలకు ముందు ఎంత బజ్ క్రియేట్ చేశాయో, తరువాత అంతే వేగంగా మాయమైపోయాయి. స్టార్ డైరెక్టర్లు సైతం రజనీకి ఒక్క హిట్టూ ఇవ్వలేకపోతున్నారు.

01/18/2020 - 22:52

తెలుగులో తొలి సోషియో ఫాంటసీ చిత్రం ‘దేవాంతకుడు’ (1960). ‘జుమాలయే జీచంతో మానుష్’ అనే బెంగాలీ కథ ఆధారంగా ఈ సినిమా నిర్మించారు. భార్గవి బ్యానర్ మీద సి పుల్లయ్య స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించిన చిత్రమిది. పురాణ పురుషులు భూమిమీద సంచరించడం తెరపై చూసి తెలుగు ప్రేక్షకులు ఒక కొత్త అనుభూతికి లోనయ్యారు.

01/18/2020 - 22:52

హాస్య రసాధిదేవతకు హారతి పళ్లెం పట్టిన హాస్య నట చక్రవర్తి -రేలంగి. వెకిలి చేష్టలు, వికృత సంభాషణలకు తావివ్వకుండా ఆరోగ్యకరమైన హాస్యాన్ని చక్కని టైమింగ్‌తో విందు భోజనంలా ప్రేక్షకులకు అందించిన నవ్వులరేడు. రేలంగి లేకపోతే తెలుగు సినిమా లేదన్నంత స్థాయికి చేరి పద్మశ్రీ అందుకున్న తొలి తెలుగు హాస్యనటుడు.

01/18/2020 - 22:41

వి మధుసూధన రావు గొప్ప నిర్మాత. అంతకుమించి మంచి దర్శకుడు. చేపట్టిన ఏ ప్రాజెక్టునైనా -సూపర్ హిట్ మార్గంలో నడిపించిన ఘనుడు. అందుకే ‘విక్టరీ’ ఇంటిపేరైంది. ఆయన దర్శకత్వం వహించిన గొప్ప చిత్రాల్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది -కల్యాణ మంటపం. సంఘంలో వేళ్లూనుకున్న దురాచారాలను ఎత్తిచూపే కథకు తనే దర్శకత్వం వహించాలన్న ఆలోచనతో -కన్నడ అవార్డు చిత్రం ‘గజ్జెపూజ’ను ఎంచుకున్నారు.

01/18/2020 - 22:38

నీల గగన ఘనశ్యామా/ ఘన శ్యామా దేవా/ నీల గగన ఘన శ్యామా.. హాని కలిగితే అవతారాలను పూని బ్రోచునదీ నీవేకావా.. చదువులు హరించి అసురండేగిన జలచరమైతివి ఆగమ రూపా/ వేద నిధులనే విధాత కొసగిన ఆదిదేవుడవు నీవేకావా.. కడలి మదించగ కదిలే నగమును వెడలి కూర్మమై వీపున మోసి/ అతివ రూపమున అమృతము గాచిన ఆదిదేవుడవు నీవేకావా.. సుజనుల కోసము ఎపుడే వేషము ధరియించెదవో తెలియగ నేరము/ పెండ్లికొడుకువై వెడలినాడవు ఎందులకొరకో హే జగదీశా..

,
01/11/2020 - 23:30

నిర్వహణ: రాణీప్రసాద్
*
డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...

01/11/2020 - 23:05

*ఆధునిక యుగానికి ఆదికవి అనిపించుకున్న ‘గురజాడ అప్పారావు’ వ్రాసిన ‘కన్యాశుల్కం’ నాటకం తెలుగు సాహితీ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

Pages