S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/25/2019 - 23:27

న్యూఢిల్లీ, ఆగస్టు 25: మావో ప్రభావిత రాష్ట్రాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సోమవారం జరిగే ఒక కీలక సమావేశంలో హోం మంత్రి అమిత్ షా సమీక్షించబోతున్నారు. అదేవిధంగా నక్సల్స్‌కు వ్యతిరేకంగా చేపడుతున్న చర్యల సాఫల్యతపై కూడా ఆయన ఈ సందర్భంగా చర్చిస్తారు. ఈ సమావేశానికి 10 నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేదా వారి ప్రతినిధులు, పోలీస్ ఉన్నతాధికారులు, పౌర అధికారులు హాజరవుతారు.

08/25/2019 - 23:26

కోల్‌కతా, ఆగస్టు 25: పాఠకులపై ప్రింట్ మీడియా ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేసేటపుడు గరిష్ఠస్థాయిలో అప్రమత్తత పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. వాస్తవాలు నిర్ధారించుకోకుండా సామాజిక మాధ్యమాల్లో కథనాలను ప్రచురించడం వల్ల ఎన్నో విపత్కర పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంటుందని ఆయన అన్నారు.

08/25/2019 - 23:21

కృష్ణాష్టమి సందర్భంగా జైపూర్‌లోని హవామహల్ వద్ద ఆదివారం కనువిందుగా సాగిన శోభాయాత్ర. భారీ సంఖ్యలో ప్రజలు ఈ యాత్రలో పాల్గొన్నారు.

08/25/2019 - 23:18

న్యూఢిల్లీ, ఆగస్టు 25: జమ్మూకాశ్మీర్ ప్రజలపై ఎంతగా అధికార దుర్వినియోగం జరుగుతోందో అక్కడి పాలనా వ్యవస్థ ఎంత కఠినంగా వ్యవహరిస్తోందో ప్రతిపక్ష పార్టీలకు, మీడియాకు స్పష్టమైందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. శ్రీనగర్‌లో పర్యటించాలన్న ఈ బృందాన్ని వెనక్కి పంపించాలన్న విషయాన్ని చూస్తే ఎంత రాక్షసంగా అధికారం అమలవుతోందో తమ కళ్లకు కట్టిందని ఆయన అన్నారు.

08/25/2019 - 04:28

ఢిల్లీ : బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మరణం జాతీయ రాజకీయాలకు తీరని లోటని, జాతికి పూడ్చలేని నష్టమని రాష్టప్రతి కోవింద్ మొదలుకుని ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ సహా యావత్ భారతం స్పష్టం చేసింది. జాతి నిర్మాణంలో వివిధ హోదాల్లో జైట్లీ చేసిన కృషిని ఈ సందర్భంగా ప్రతిఒక్కరూ గుర్తు చేసుకున్నారు.

08/25/2019 - 04:13

జైట్లీ..దశాబ్దాలుగా జాతీయ రాజకీయాల్లో మార్మోగిన మేరు. మేథస్సు, దక్షత, పాలనా పటిమ,వాగ్దాటి..ఈ నాలుగు నిరుపమాన లక్షణాలు ఒకే వ్యక్తిలో ఉండటం అత్యంత అరుదే..వీటిని పుణికి పుచ్చుకున్న జైట్లీ భిన్నరంగాల్లో విశేషంగా రాణించారు. అశేషమైన ఖ్యాతినార్జించారు. న్యాయవాదిగా, ఆర్థిక మంత్రిగా, రక్షణ మంత్రిగా జైట్లీకి ఏ పదవైనా సంస్కరణలకు వేదక అయింది. జనధన్ ద్వారా బ్యాంకులను గ్రామాల బాట పట్టించారు.

08/25/2019 - 03:57

న్యూఢిల్లీ, ఆగస్టు 24: నాలుగు దశాబ్దాల అరుణ్‌జైట్లీ రాజకీయ జీవితం ఓ అద్భుతమే. అధికారంలో ఉన్నవారికి తలలో నాలుకలా వ్యవహరించడంలోనూ వ్యూహరచనా సామర్థ్యంతో ఎలాంటి జటిల సమస్యనైనా చిటికెలో అధిగమించడంలోనూ జైట్లీ సామర్థ్యం అనితర సాధ్యమే.

08/25/2019 - 03:13

న్యూఢిల్లీ, ఆగస్టు 24: దేశ రాజధాని ఢిల్లీలోని టీటీడీ శ్రీవారి ఆలయంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై విచారణ తీరును తప్పుపడుతూ టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ పదవికి సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమిషనర్‌ను టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్‌గా నియమించడం తెలిసిందే.

08/25/2019 - 02:56

న్యూఢిల్లీ, ఆగస్టు 24: ప్రతిపక్షాన్ని, ప్రతిపక్షాల నేతలను దోషులుగా నిలబెట్టవద్దని ప్రధాని నరేంద్ర మోదీకి బీజేపీ నాయకులు ఎవరైనా బహిరంగంగా సలహా ఇచ్చారా? అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ ప్రశ్నించారు. ప్రతిపక్షాలను దోషులుగా చూపించడం సమంజసం కాదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ చెప్పడాన్ని ఆ పార్టీ నాయకులు అభిషేక్ సింఘ్వి, శశిథరూర్ సమర్థించారు.

08/25/2019 - 01:52

హైదరాబాద్, ఆగస్టు 24: దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్, డెంటల్, ఆయుష్ కాలేజీల్లో యూజీ ప్రోగ్రాంలో అడ్మిషన్లకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్టు(నీట్-2020)ని ఆఫ్‌లైన్‌లోనే నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ నిర్ణయించింది. గత ఏడాది ఈ పరీక్షకు 15,19,375 మంది దరఖాస్తు చేయగా, 14,10,755 మంది పరీక్షకు హాజరయ్యారు. 1884 మంది ఎన్‌ఆర్‌ఐలు, 675 మంది ఒసీఐలు, 63 మంది పీఐఓలు కూడా హాజరయ్యారు.

Pages