S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/19/2019 - 20:28

మజిలీ చిత్రంతో దర్శకుడు శివ నిర్వాణ ఇచ్చిన విజయం చైతూలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. చైతూ కెరియర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా మజిలీ నిలచింది. అంతేకాదు, వసూళ్లపరంగా ఓవర్సీస్‌లోనూ ఇంకా ఈ సినిమా తన హవా చూపిస్తుండటంతో -నాగచైతన్య కొత్త కథలపై మరింత ఫోకస్ పెంచాడు. ఆర్‌ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతితో చైతూ ఓ సినిమా చేసే చాన్స్ ఉందన్న టాక్ ఫిల్మ్‌నగర్‌లో బలంగా వినిపిస్తోంది.

04/19/2019 - 20:27

‘అందాల రాక్షసి’గా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి మొదటి సినిమాతోనే కావలసినంత గుర్తింపు తెచ్చుకుంది. ‘్భలే భలే మగాడివోయ్’, ‘సోగ్గాడే చిన్నినాయనా’ లాంటి సూపర్‌హిట్ సినిమాలు తన ఖాతాలో ఉండటంతో ఆఫర్లూ ఫుల్లుగానే వచ్చాయి. కానీ 2016లో ‘శ్రీరస్తుశుభమస్తు’ తర్వాత లావణ్యకు హిట్ అన్నదే లేదు.

04/19/2019 - 20:25

మహేష్‌బాబు తాజా చిత్రంగా ‘మహర్షి’ మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో తరువాత చేయాల్సిన అనిల్ రావిపూడి ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాడు మహేష్. ఆ ప్రాజెక్టు సన్నాహాలు చకచకా సాగుతున్నాయి. ప్రతినాయకుడి పాత్రను అనిల్ పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశాడట. సో, శ్రీమంతుడిలో నాన్నగా మెప్పించిన జగపతిబాబునే, ఈ ప్రాజెక్టులో విలన్‌గా చూపించేందుకు సిద్ధపడుతున్నాడట.

04/19/2019 - 20:22

వరుణ్‌తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వాల్మీకి. సినిమా నుంచి తాజాగా విడుదలైన వరుణ్‌తేజ్ మేకోవర్ స్టిల్ ఆకట్టుకుంటోంది. వాల్మీకి చిత్రానికి సంబంధించి వరుణ్‌తేజ్‌పై కొన్ని సన్నివేశాలను ఇప్పటికే హరీశ్‌శంకర్ చిత్రీకరించాడు. కాగా ఆ సన్నివేశాల్లోని తన గెటప్‌కు సంబంధించిన స్టిల్‌ను వరుణ్‌తేజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

04/19/2019 - 20:20

అటుతిరిగి ఇటుతిరిగి ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టులోకి వచ్చిన శ్రద్ధాకఫూర్ కోసం -ఏకంగా కథలోనే మార్పులు చేయబోతున్నాడట జక్కన్న. బాహుబలి తరువాత ఎస్‌ఎస్ రాజవౌళి అంతే శ్రద్ధగా తెరకెక్కిస్తున్న చిత్రం -ఆర్‌ఆర్‌ఆర్. రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ల మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోన్న చిత్రంలో ఆలియాభట్, శ్రద్ధకఫూర్‌లు హీరోలతో జోడీ కట్టనున్నారు. శ్రద్ధను తీసుకుంటున్న విషయాన్ని యూనిట్ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

04/19/2019 - 20:19

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం -సైరా నరసింహారెడ్డి. కథలో భాగంగా కీలకమైన చివరి షెడ్యూల్ కేరళలోని దట్టమైన అడవుల్లో నిర్వహించారు. అక్కడి షెడ్యూల్ పూర్తి కావడంతో చిరుతో కలిసి చరణ్‌దీప్ దిగిన ఫొటోలు బయటికొచ్చాయి. చిరుతో పనిచేస్తూ ప్రయాణించటం అద్భుతమైన అనుభూతి’ అంటూ వ్యాఖ్యానించాడు చరణ్ దీప్. ఆయననుంచి ఎంతో నేర్చుకోవచ్చనీ చెప్పుకొచ్చాడు.

04/19/2019 - 20:18

శ్రీవిష్ణు హీరోగా నివేదా థామస్, నివేత పేతురాజ్ హీరోయిన్లుగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం -బ్రోచే వారెవరురా. పోస్ట్‌ప్రొడక్షన్స్‌లోవున్న సినిమా నుంచి శనివారం టీజర్ విడుదల చేయబోతున్నారు. సినిమాలో నివేదాథామస్‌ను క్లాసికల్ డ్యాన్సర్‌గా ఇప్పటికే పోస్టర్లో చూపించారు. ఫస్ట్ సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్నీ జాగ్రత్తగానే తెరకెక్కిస్తున్నాడట.

04/19/2019 - 20:16

ఎస్‌ఎస్ చెరుకూరి క్రియేషన్స్ పతాకంపై సుదీప్, సుస్మిత, సందీప్, రాజ్‌సింగ్ హీరో హీరోయిన్లుగా ఆర్‌ఎస్ సురేష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం -ఆగ్రహం. మోషన్ పోస్టర్‌ని పూరీ జగన్నాథ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో చిత్ర దర్శకుడు సురేష్, నిర్మాత సందీప్ చెరుకూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మూర్తి ఆడారి తదితరులు పాల్గొన్నారు.

04/19/2019 - 20:15

గత ఏడాది బాలీవుడ్ టాప్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచిన ‘అందాదున్’ సౌత్ రీమేక్ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. క్రైమ్‌థ్రిల్లర్ నేపథ్యంలో శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది. తాజా అప్‌డేట్ ప్రకారం దీన్ని తెలుగు తమిళ్‌లో సిద్ధార్థ్ హీరోగా రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. దీనిపట్ల తాను ఆసక్తిగా ఉన్నానంటూ సిద్ధార్థ్ కొద్దిరోజుల క్రితమే ప్రకటించాడు.

04/19/2019 - 20:14

వినూత్న పాయింట్‌తో రూపొందించిన ‘కార్తికేయ’ సినిమాతో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమయ్యాడు చందు మొండేటి. ఇక చందు మొండేటి చివరిగా చేసిన ‘సవ్యసాచి’ సినిమా నవంబర్ 2న ప్రేక్షకుల ముందుకొచ్చినా బాక్సాఫీస్‌వద్ద అపజయాన్ని మూటకట్టుకుంది. దాంతో చందు మొండేటి నాగార్జునతో చేయాల్సిన ప్రాజెక్ట్ వెనక్కిపోవడం తెలిసిందే. అలాగే ‘శర్వానంద్’తోనూ ఓ ప్రాజెక్టు చేతుల్లోకి వచ్చి చేజారిపోయింది.

Pages