S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/10/2019 - 23:02

సాహో రిజల్ట్ ప్రభాస్ టీంకి చాలా పాఠాలే నేర్పించింది. అందుకే -తదుపరి ప్రాజెక్టుల విషయంలో బడ్జెట్ పరుగులకు బలమైన బ్రేకులే వేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతి సినిమానూ భారీగా తీసుకుంటూపోతే, తరువాత వెనక్కి తగ్గే అవకాశాలే లేకుండా పోతాయన్న ఆలోచన చేస్తున్నట్టు చర్చ నడుస్తోంది.

11/10/2019 - 23:01

అర్జునకపూర్, సంజయ్‌దత్, పద్మిని కొల్హాపురి, కృతిసనన్ ప్రధాన తారాగణంగా అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న పీరియాడికల్ చిత్రం -పానిపట్. భారతదేశ చరిత్రలో పానిపట్టు యుద్ధానికున్న ప్రత్యేకతను సినిమాలో చర్చిస్తున్నారట.

11/10/2019 - 23:00

సీనియర్ నరేష్ హీరోగా ఎల్లో లైన్ పిక్చర్స్ పతాకంపై దర్శకుడు బాబ్జి తెరకెక్కించిన చిత్రం -రఘుపతి వెంకయ్యనాయుడు. మండవ సతీష్‌బాబు నిర్మాత. చాలాకాలం క్రితమే సిద్ధమైన ఈ ఉదాత్తమైన సినిమా -ఇప్పుడు విడుదలవైపు అడుగులేస్తోంది. తాజాగా సినిమా ట్రైలర్ హీరో మహేష్‌బాబు చేతులమీదుగా విడుదలైంది. తెలుగు సినిమా వేగుచుక్కగా మన్ననలందుకున్న రఘుపతి వెంకయ్యనాయుడు చిత్ర పరిశ్రమకి తొలినాళ్లలో విశేషమైన సేవలు అందించారు.

11/10/2019 - 23:00

హీరోలంతా సొంత నిర్మాణ సంస్థల్లో సినిమాలు తీస్తూ బిజీ అవుతున్నారు. హీరోగా షూటింగ్‌లు, నిర్మాతగా ప్రొడక్షన్స్ చూసుకుంటూ ముందుకెళ్తున్నారు. సొంత బ్యానర్లపైనే సినిమాలు చేస్తూ, సరికొత్త స్టామినా చూపిస్తోన్న కుర్ర దర్శకులకూ అనేక విధాల అవకాశాలిస్తున్నారు. ఈ విషయంలో కాస్త నిదానంగావున్న నేచురల్ స్టార్ నాని సైతం -నిర్మాతగా బిజీ అయ్యే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడట.

11/10/2019 - 22:59

మనసు పెడితే పూరి- రామ్‌ల మాస్ ఏ స్థాయిలో ఉంటుందో రుచి చూపించింది ఇస్మార్ట్ శంకర్. ఇదే కాంబినేషన్‌లో మరో ప్రాజెక్టు తెరకెక్కనుందంటూ హిట్ టాక్ టైంనుంచీ వినిపిస్తున్నా -ఇద్దరూ ఎవరి ప్రాజెక్టులు వాళ్లు ప్రకటించారు. ఇక ఈ కాంబినేషన్‌లో మరో సినిమా వెంటనే ఉండకపోవచ్చన్న కథనాలు వినిపిస్తోన్న తరుణంలో -తాజా అప్‌డేట్ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

11/10/2019 - 22:59

బాలీవుడ్ ఇండస్ట్రీలో పరిచయం అవసరంలేని దర్శక నిర్మాత కెసి బొకాడియా. ఎన్నో సినిమాలు రూపొందించిన బొకాడియా తాజాగా తెలుగులో ‘తేరి మెహర్బానియా’ చిత్రానికి సీక్వెల్‌గా నమస్తే నేస్తమా చిత్రాన్ని అందిస్తున్నారు. శ్రీరామ్ అతిథి పాత్రలో నటిస్తున్న చిత్రంలో రెండు కుక్కలు ప్రధాన పాత్రలు పోషిస్తాయట. ఈ చిత్రానికి సంబంధించిన మీడియా సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించారు.

11/10/2019 - 22:58

ప్రస్తుతం పూజా హెగ్డే విదేశాల్లో విహరిస్తోంది. ఐరెన్ లెగ్ మాటలను అధిగమించి పడిలేచిన కెరంటంలా ఎదిగిన పూజ -వచ్చే రెండేళ్లలో చాలా ప్రాజెక్టులకే సైన్ చేసేసింది. వరుస షూటింగ్‌లకు కాస్త విరామం దొరకడంతో -ప్రస్తుతం విదేశాల్లో సేదదీరుతోంది. షూటింగ్‌ల బిజీ నుంచి టైం దొరకడంతో రీఫ్రెష్ కోసం ఫారిన్‌కు వెళ్లానంటూ ఇన్‌స్టాలో ఫొటోలను అభిమానులకు షేర్ చేస్తోంది.

11/10/2019 - 22:58

సిక్స్‌టీస్ దాటిన హీరోలు సరికొత్తగా పవర్ ఫ్యాక్డ్ బాడీ షేప్‌పై దృష్టి పెడుతున్నారు. టాలీవుడ్ సీనియర్ హీరోలైన నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవి.. వెటరన్ ఏజ్‌లోనూ పూర్తి ఫిట్‌నెస్‌తో కుర్ర హీరోలతో పోటీపడే ప్రయత్నం చేస్తున్నారు. మేనమామ పాత్రతో ‘వెంకీ మామ’ చేస్తోన్న వెంకటేష్.. మేనల్లుడు చైతూ ఫిట్‌నెస్‌కి సమంగా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు.

11/08/2019 - 20:24

తొలి సినిమాతో తళుక్కుమని.. తరువాత సినిమా కోసం నానా అగచాట్లుపడిన హీరోయన్లు తెలుగు ఇండస్ట్రీలో కోకొల్లలు. కానీ కొంతమంది మొండిగా నిలబడి ధైర్యంగా ముందుకెళ్లి.. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుని టాప్ పొజిషన్‌కు చేరినవాళ్లూ లెక్కలేనంత మంది. బెంగళూరు బ్యూటీ నభానటేష్ -నన్నుదోచుకుందువటే చిత్రంతో టాలీవుడ్ మనసు దోచుకుంది.

11/08/2019 - 20:21

అల్లు అర్జున్ -త్రివిక్రమ్ కాంబో ప్యాక్ -అల వైకుంఠపురములో. అరవింద్, రాధాకృష్ణ నిర్మాతలు. సినిమా నుంచి తొలి సింగిల్‌గా బయటికొచ్చిన -సామజవరగమన క్రియేట్ చేసిన సెనే్సషన్ అంతా ఇంతా కాదు. ఆ పాటను ఇప్పుడు పారిస్‌లో స్క్రీన్‌కు ఎక్కిస్తున్నారు. పారిస్‌లోని సరికొత్త లొకేషన్లలో అల్లు అర్జున్, పూజా హెగ్డేలపై పాట చిత్రీకరిస్తున్నట్టు చిత్రబృందం వెల్లడించింది.

Pages