S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/17/2019 - 22:07

క్రికెటర్‌గా త్వరలో నాని ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ‘జెర్సీ’ పేరుతో రూపొందుతున్న చిత్రంలో నాని క్రికెటర్ పాత్రని పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత నాని నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించారు. విక్రమ్ కె.కుమార్ ‘మనం ఫేమ్’ దర్శకుడు. ఈ సినిమా తర్వాత మరో సినిమా నాని కమిటయ్యారు.

03/17/2019 - 22:05

తెలుగులో ఎన్టీఆర్ చేసిన ‘టెంపర్’కి రీమేక్‌గా తమిళంలో అయోగ్య పేరుతో చిత్రం రూపొందుతుంది. వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో విశాల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఆయన జోడీగా రాశీఖన్నా అలరించనుంది. ఏప్రిల్ 19వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా ముందుగా ప్రకటించారు. కానీ ఆరోజున ఈ సినిమా థియేటర్లకు రావడం లేదనేది తాజా సమాచారం. ఇటీవల ఒక పాటను చిత్రీకరిస్తుండగా విశాల్ కాలికి గాయమైంది.

03/17/2019 - 22:02

చేతన్ మద్దినేని హీరోగా డాల్ఫిన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నరేష్‌కుమార్ దర్శకత్వంలో మంజునాథ్ వి కందుకూర్ నిర్మిస్తున్న చిత్రం ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’. విద్య 100% ఉప శీర్షిక. ఈ సినిమా ఫస్ట్‌లుక్, లోగో, టీజర్‌ను ‘మా’అధ్యక్షుడు నరేష్, డైరెక్టర్ మారుతి విడుదల చేశారు.

03/17/2019 - 22:00

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు అంతటి దిగ్గజడం నా సినిమా వీక్షించి చక్కని ఎమోషన్స్ పండించావని కితాబిచ్చారు. ఆ అరుదైన ప్రశంస నాలో ఎంతో ఉత్సాహం నింపిందని అంటున్నారు యువ హీరో రామ్ కార్తీక్. ఈ యంగ్ హీరో నటించిన రెండు సినిమాలు వేర్ ఈజ్ వెంకటలక్ష్మి, వౌనమే ఇష్టం ఒకేసారి థియేటర్‌లో రిలీజ్ అయ్యాయి.

03/17/2019 - 21:58

అనుష్క, మాధవన్ కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ఇంటర్నేషనల్ చిత్రం సైలెన్స్. దాదాపు 100కిపైగా సినిమాల్లో నటించిన కిల్‌బిల్ ఫేమ్ మైఖేల్ మ్యాడ్‌సన్ తొలిసారి ఇండియన్ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు.

03/17/2019 - 21:56

ముని, కాంచన, కాంచన 2తో హారర్ కామెడీ చిత్రాల్లో సౌత్ ఇండియాలోనే భారీ సక్సెస్‌తోపాటు ఒక ట్రెండ్ సృష్టించిన రాఘవ లారెన్స్ హీరోగా స్వీయ దర్శకత్వంలో ముని సిరీస్ నుంచి వస్తున్న హారర్ కామెడీ కాంచన 3. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఇటీవల కాంచన 3 విడుదల చేసిన మొదటి లుక్ మోషన్ పోస్టర్ ఒక మాసివ్ వేవ్‌ను తీసుకొచ్చింది.

03/17/2019 - 21:54

సుధాకర్ కోమాకుల హీరోగా బేబి జాహ్నవి సమర్పణలో యునైటెడ్ ఫిలింస్ బ్యానర్‌పై ఎస్.జె.కె.ప్రొడక్షన్స్(యుఎస్‌ఎ) వారి సహకారంతో హరినాధ్‌బాబు.బి దర్శకత్వంలో డి.శ్రీకాంత్ నిర్మిస్తున్న చిత్రం ‘నువ్వు తోపురా’. ఈ చిత్రం ఏప్రిల్ 26న గీతా ఫిలిమ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత శ్రీకాంత్ మాట్లాడుతూ- ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న గీతా ఆర్ట్స్ ద్వారా విడుదల కావడం ఆనందంగా ఉంది.

03/17/2019 - 21:51

లవ్ యు బంగారం చిత్రంలో హీరోయిన్‌గా నటించి మెప్పించిన శ్రావ్య చెల్లెలు గ్రీష్మకి ఇప్పుడు టాలీవుడ్‌లో ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయ. వందేమాతరం శ్రీనివాస్ నటించిన అమ్ములు చిత్రంలో బాలనటిగా కనిపించిన గ్రీష్మ రీసెంట్‌గా మహానాయకుడులో యుక్త వయస్సు బసవతారకంగా నటించి నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ ప్రశంసలు అందుకుంది. ప్రేక్షకుల అభిమానం పొందిన గ్రీష్మకి వరుసగా ఆఫర్స్ రావటం విశేషం.

03/17/2019 - 21:49

పెళ్లి తర్వాత నాగచైతన్య, సమంత అక్కినేని జంటగా నటిస్తున్న చిత్రం ‘మజిలీ’. షైన్ స్క్రీన్స్ పతకాంపై హాహు

03/17/2019 - 21:44

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ విజయగాథను ‘సైనా’గా దర్శకుడు అమోల్‌సేన్ గుప్తా తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ కొంతభాగం పూరె్తైంది. అయితే, షూటింగ్ టైంలో లీడ్‌రోల్ పోషిస్తున్న శ్రద్ధాకఫూర్‌కు డెంగ్యూ సోకడంతో ఆమెను సినిమా నుంచి తప్పించినట్టు కథనాలు వెలువడుతున్నాయి. సైనా బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న నిర్మాత, టి.సిరీస్ అధినేత భూషణకుమార్ స్వయంగా ఈ ప్రకటన చేయటం గమనార్హం.

Pages