నవ్వించే.. బుజ్జిగాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌తరుణ్, మాళవికనాయర్ జోడీగా దర్శకుడు కొండా విజయ్‌కుమార్ తెరకెక్కించిన చిత్రం -ఒరేయ్ బుజ్జిగా. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కెకె రాధామోహన్ నిర్మిస్తోన్న యూత్ ఎంటర్‌టైనర్ ఇది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో రాజ్‌తరుణ్ మాట్లాడుతూ -ఒరేయ్ బుజ్జిగా కంప్లీట్ ఎంటర్‌టైనర్. టీంమొత్తం ఫ్యాషన్‌తో సినిమా చేసింది. సినిమా చూస్తున్నంతసేపూ ఆడియన్స్ నవ్వుతూనే ఉంటారు. మార్చి 25న సినిమా వస్తోంది. అప్పటికి ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ వస్తాయి. ఫ్యామిలీలు రిలాక్స్‌డ్‌గా సినిమా చూడొచ్చు అన్నాడు. హీరోయిన్ మాళవిక నాయర్ మాట్లాడుతూ -సినిమా ఒక టీమ్ క్రాఫ్ట్ అన్నది ఈ సినిమాతో నిరూపితమైంది. తెలుగురాకున్నా ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి, మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి హెల్స్ చేశారు. దర్శకుడు విజయ్‌కుమార్ మొదటినుంచీ గైడింగ్ స్పిరిట్‌గా ఉండటం హ్యాపీ. టీంనుంచి మంచి అవుట్‌పుట్ తీసుకున్నాడు దర్శకుడు. ఆయనలోని సెల్ప్ కాన్ఫిడెన్స్ మా అందరికీ హ్యూజ్ ఇన్‌స్పిరేషన్. నిర్మాత రాధామోహన్ మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. రాజ్‌తరుణ్ మంచి ఈజ్‌తో చేశాడు. సినిమాలో మంచి హ్యూమర్ ఉంది. ఎంజాయ్ చేయండి అన్నారు. దర్శకుడు కొండా విజయ్‌కుమార్ మాట్లాడుతూ -నిర్మాత రాధామోహన్‌తో చాలాకాలంగా అనుబంధముంది. మంచి నిర్మాత. కథకు ఏం కావాలో అన్నీ ఇచ్చి సపోర్ట్ చేశారు. సినిమాలో హ్యూజ్ పాడింగ్ ఉంది. ముఖ్యంగా రాజ్‌తరుణ్ పక్కింటి కుర్రాడిలా ఉంటాడు. హండ్రెడ్‌పర్సెంట్ ఆయనకు తగిన సినిమా. మాళవిక నాయర్ నేచురల్ ఆర్టిస్ట్. ప్రతి ఒక్కరూ ఇది నా సినిమా అని ఓన్ చేసుకుని చేయడం నా పని సులువైంది. మంచి టెక్నీషియన్లతో కలిసి సినిమా చేశానన్న సంతృప్తి ఉంది. ఆడియన్స్ పడిపడి నవ్వుకునే సినిమా -ఒరేయ్ బుజ్జిగా అన్నారు. నిర్మాత కెకె రాధామోహన్ మాట్లాడుతూ -దర్శకుడు విజయ్‌కుమార్‌తో సరదాగా కాఫీ తాగుతున్న ఓ సందర్భంలో ఈ స్టోరీ లైన్ చెప్పాడు. అలా మొదలైన ప్రయత్నం -ఇప్పుడు ఉగాది పచ్చడిలాంటి సినిమాగా రూపుదిద్దుకుంది. ఒరేయ్ బుజ్జిగా టైటిల్ బాగా పాపులరైంది. యూత్, ఫ్యామిలీకి నచ్చే అన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉన్నాయి. సినిమాను ఎంజాయ్ చేసి మాకు విజయం చేకూర్చాలని కోరుతున్నా అన్నారు.