S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/06/2019 - 20:35

ప్రాజెక్టు చిన్నదైనా పెద్దదైనా నయనతారను ఒప్పించాలంటే -కొన్ని కండిషన్స్‌కు ఓకే చెప్పాలి. ఈ విషయంలో ఎవరెన్ని రకాలుగా అనుకున్న ‘డోన్ట్‌కేర్’ తన స్టైల్ తనదే అంటోంది నయన్. ఏస్ డైరెక్టర్ మురుగదాస్‌కూ ఈ పరిస్థితి తప్పలేదు. రజనీకాంత్‌తో తెరకెక్కిస్తోన్న దర్బార్ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు మురగదాస్. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న చిత్రాన్ని సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

11/06/2019 - 20:34

వెంకటేష్, నాగచైతన్యల మల్టీస్టారర్‌గా వస్తున్న సినిమా -వెంకీమామ. కెఎస్ రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో వుంది. అధికారికంగా ప్రకటించకున్నా -సినిమాను క్రిస్మస్ రోజు డిసెంబర్ 25న రిలీజ్ చేయడానికి ఓ నిర్ణయానికి రావడంతో -ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్రబృందం. ఫ్యాన్స్‌కి ఓ అప్‌డేట్ ఇస్తున్నట్టుగా గురువారం ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేశారు.

11/06/2019 - 20:33

పాత్రకు తగిన ప్రిపరేషన్స్ విషయంలో తెలుగు హీరోలు కాస్త ఎక్కువగానే ఉంటారు. పాత్రను సరిగ్గా ప్రజెంట్ చేయడానికి -ప్రీ వర్కౌట్స్ గట్టిగానే ఉపయోగపడతాయన్నది వాళ్ల ఫీలింగ్. ‘గద్దలకొండ గణేష్’తో మాస్ ఎంటర్‌టైనర్ ఇచ్చిన వరుణ్ తేజ్ -తరువాతి ప్రాజెక్టులో బాక్సర్ అవతారం ఎత్తనున్నాడు. దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించనున్న స్పోర్ట్స్ డ్రామాలో బాక్సర్‌గా కనిపిస్తాడట వరుణ్.

11/06/2019 - 20:31

అనుష్కతో ఐదు భాషల్లో హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తోన్న చిత్రం -నిశ్శబ్దం. గురువారం స్వీటీ బర్త్‌డే సందర్భంగా తెలుగు సహా ఐదు భాషల్లో బుధవారం టీజర్ వదిలారు. విహారం పీడకలైందంటూ అనుష్క సంకేతంగా చెప్పడం సినిమాపై ఆసక్తి పెంచుతోంది. తెలుగు టీజర్‌ను రిలీజ్ చేసిన సెలబ్రేషన్స్‌లో భాగంగా సైలెన్స్ సినిమా సింబల్‌ను చూపిస్తోన్న దర్శకుడు పూరి జగన్నాథ్.

11/06/2019 - 20:30

ఒక పాత్రలో ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారని, అలాంటి పాత్రలే చేయాలన్న ఆలోచనలకు నేను దూరం. నానుంచి వైవిధ్యాన్ని కోరుతున్నారు కనుక -సాధ్యమైనంత వరకూ ప్రయోగాత్మక పాత్రలే చేయాలనుకుంటున్నా
అంటున్నాడు హీరో శ్రీవిష్ణు.

11/06/2019 - 20:28

కణితన్‌కు ఏమాత్రం తీసిపోని ఫీల్ ఇస్తుంది -అర్జున్ సురవరం సినిమా అంటున్నాడు నిఖిల్ సిద్ధార్థ్. తమిళ హిట్టు సినిమా కణితన్‌కు రీమేక్‌గా వస్తున్న అ.సు -నవంబర్ 29న విడుదలకు సిద్ధమవుతోంది. అనేక కారణాలతో వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన సినిమాకు -రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో చిత్రబృందం హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో నిఖిల్ పాత్రికేయుడి పాత్ర పోషిస్తున్నాడు. నిఖిల్‌తో లావణ్య త్రిపాఠీ జోడీకట్టింది.

11/06/2019 - 20:27

కమల్ -శంకర్ కాంబో తాజా ప్రాజెక్టు -్భరతీయుడు 2. ఇండియన్‌కు ఇది సీక్వెల్. గత కొద్దిరోజులుగా మధ్యప్రదేశ్, గ్వాలియర్ ప్రాంతాల్లో జరుగుతున్న షూటింగ్‌కు సడెన్‌గా బ్రేక్ ఇచ్చారు. 64వ పడిలో పడుతున్న కమల్ పరిశ్రమకు వచ్చి 60ఏళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా చెన్నై భారీ కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. దీనికోసం కమల్ అండ్ టీమ్ షూటింగ్‌కు బ్రేక్ తీసుకుని చెన్నైకు వచ్చారట.

11/06/2019 - 20:26

అనూషా సినిమా పతాకంపై కె.బి.కృష్ణ దర్శకత్వంలో అనిల్ మొగిలి, రేయాన్ రాహుల్, సునీత ప్రధాన తారాగణంగా రూపొందించిన చిత్రం కోనాపురంలో జరిగిన కథ. ఈ నెల 8న అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. నిర్మాతలు మచ్చ వెంకటరెడ్డి, బట్టు అంజిరెడ్డి, పల్లె వినయ్‌కుమార్ సినిమాకు సంబంధించిన పాత్రికేయుల సమావేశం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో నిర్మాతలు దామోదర ప్రసాద్, ప్రసన్నకుమార్ అతిథులుగా నిర్వహించారు.

11/05/2019 - 20:08

మన్మథుడు 2 తరువాత అప్‌డేట్స్‌లో లేకుండా పోయిన రకుల్‌ప్రీత్ సింగ్ -ఇక వరుస సినిమాలతో బిజీ కానుందట. తెలుగు, తమిళం, హిందీ పరిశ్రమల మీద ఒకేస్థాయి ఫోకస్ పెడుతున్న రకుల్, ఫైనలైన ప్రాజెక్టుల్ని బట్టి వచ్చే ఏడాది తీరికలేని షెడ్యూల్స్ గడపనుందని తెలుస్తోంది. మన్మథుడు 2 తరువాత -హిందీలో ఆమె చేసిన ‘మార్జావన్’ సినిమా నవంబర్ 8న థియేటర్లకు రానుంది.

11/05/2019 - 20:06

సంక్రాంతి రేసులో ఉండాలా? వద్దా అన్న సందిగ్ధం నుంచి ‘వెంకీమామ’ టీం బయటికొచ్చేసింది. డిసెంబర్ 20న తెలుగు సినిమాలు డిస్కోరాజా, ప్రతిరోజూ పండగే, హిందీ సినిమా దబాంగ్ 3 థియేటర్లకు వస్తున్నాయి. బాలకృష్ణ రూలర్ సైతం అదే రోజు థియేటర్లకు వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 13నే ‘వెంకీమామ’ థియేటర్లకు రావొచ్చంటూ సాగిన ప్రచారాలనూ టీం పక్కనపెట్టేసింది.

Pages