S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/05/2019 - 20:02

సాహో ఫీస్ట్ ఎంత రుచిగా ఉండబోతుందో ఫస్ట్‌సాంగ్ టీజర్‌తో రుచి చూపించింది చిత్రబృందం. బాహుబలి కంక్లూజన్ తరువాత హీరోప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ -సాహో. ప్రారంభం నుంచే ఓ రేంజ్ ప్రమోషన్స్ చేసుకుంటూ వస్తున్న చిత్రబృందం -రకరకాల విన్యాసాల అనంతరం ఫస్ట్‌సాంగ్ టీజర్‌నూ బటయకు వదిలింది. సాహో ఫీస్ట్‌లోని అట్రాక్షన్ ఎలిమెంట్స్‌ను కొద్దికొద్దిగా రుచి చూపిస్తుండటంతో -చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

07/05/2019 - 20:01

బ్యూటీ శృతిహాసన్ మళ్లీ సినిమాలపై దృష్టిపెట్టింది. గత ఏడాది ఒక్క సినిమాలోనూ నటించకుండా, ప్రేమాయణంలో మునిగితేలింది శృతిహాసన్. అలా కెరీర్‌ని పక్కన పెట్టేయడంతో -దర్శక నిర్మాతలు ఆమెను అప్రోచ్ కావడం మానేశారు. బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ కోర్సెల్‌తో బ్రేక్‌అప్ చెప్పాక కొన్నిరోజులు ఎక్కడా కనిపించని శృతి, తమిళంలో ఓ టీవీ షో చేసి షాకిచ్చింది.

07/05/2019 - 20:00

స్టార్ హీరోల సినిమాలే కాదు మంచి కథాబలమున్న సినిమాలకూ ప్రాధాన్యమిచ్చే నిర్మాతల్లో దిల్‌రాజు ఒకరు. చిన్న సినిమాలకు, కొత్త దర్శకులకు, యంగ్ టాలెంట్‌కు ఆయన అందించే సపోర్టే ఆయన్ను టేస్ట్ఫుల్ ప్రొడ్యూసర్‌గా ఇండస్ట్రీలో నిలబెట్టింది. ఇపుడు మరో లవ్‌స్టోరీని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నాడు దిల్‌రాజు.

07/05/2019 - 19:59

తెలుగు కథలపై బాలీవుడ్ ఫోకస్ పెట్టడంతో, బాలీవుడ్‌పైనా తెలుగు నిర్మాతల ఫోకస్ పెరిగింది. తెలుగులో సక్సెస్‌ఫుల్ నిర్మాతగా ఎదిగిన దిల్‌రాజు, ఇటీవలి కాలంలో బాలీవుడ్ నిర్మాణరంగంపై ఫోకస్ పెడుతున్నట్టే కనిపిస్తోంది.తెలుగులో సూపర్ సక్సెస్ అందుకున్న ఎఫ్-2 చిత్రాన్ని బోనీకఫూర్‌తో కలిసి రీమేక్‌కు సెట్ చేశాడు.

07/05/2019 - 19:58

యాంకర్‌గా, సింగర్‌గా, సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రఘు కుంచె తనలోని మరో కోణాన్ని చూపించబోతున్నాడు. ఫస్ట్‌లుక్‌తో క్యూరియాసిటీ క్రియేట్ చేసిన పలాస 1978 చిత్రంలో రఘు కరుడుగట్టిన విలన్‌గా కనిపించబోతున్నాడు. సాదా సీదా విలన్ పాత్ర కాదు నాలుగు డిఫరెంట్ షేడ్స్‌లో ఛాలెంజింగ్ పాత్ర ఇదని చిత్రబృందం చెబుతోంది. ఆయన ఈ చిత్రానికి సంగీతం సైతం సమకూర్చారు.

07/05/2019 - 19:56

ఇస్మార్ట్ శంకర్ -షూటింగ్ ముగించేశాడు. అదే ఈ ఫొటో. హీరో రామ్‌ను పక్కా పాతబస్తీ కుర్రాడిలా చూపిస్తూ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సినిమా -ఇస్మార్ట్ శంకర్. రామ్ మేకోవర్‌ను ఎప్పుడో చూపించిన పూరి, డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో నిన్ననే ట్రైలర్ వదిలాడు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మి సంయుక్తంగా నిర్మించిన చిత్రం 18న ప్రేక్షకుల ముందుకురానుంది.

07/05/2019 - 19:55

జంతువులు మాట్లాడుకంటాయి. ప్రేమని ప్రదర్శించుకుంటాయి. స్నేహం చేస్తాయి. ఇదంతా డిస్నీ ప్రపంచంలో. ఈనెల 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రత్యక్షం కాబోతోంది -ది లయన్ కింగ్. డిస్నీ కథలకి పిల్లల్లోనే కాదు, పెద్దల్లోనూ క్రేజ్ ఉంటుంది. ఈ క్రేజ్‌ను మరింత పెంచడానికి పాత్రలకి సూపర్‌స్టార్స్ చేత డబ్బింగ్ చెప్పించి కథకు కొత్త హంగులద్దారు.

07/05/2019 - 19:53

నందమూరి కళ్యాణ్‌రామ్ తాజా ప్రాజెక్టు టైటిల్ -ఎంత మంచివాడవురా. టైటిల్‌తోనే కంటెంట్ ఫ్లేవర్‌ను చెప్పకనే చెప్తున్నాడు దర్శకుడు వేగేశ్న సతీష్. ఎమోషనల్ మూడ్‌తో కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించటంలో తన ప్రతిభను చూపిస్తోన్న సతీష్ -చిత్రమైన టైటిల్‌ను ఎంపిక చేసుకుని ప్రాజెక్టుపై ఆసక్తి పెంచాడు. ఈ ప్రాజెక్టులో కళ్యాణ్ సరసన మెహరీన్ కనిపించనుంది. ఇటీవలే షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే.

07/05/2019 - 19:52

అందం, అభినయం, చిలిపితనంతో ఆకట్టుకున్న త్రిష -తరువాత ఆడియన్స్‌ను భయపెట్టడానికి హారర్ చిత్రాలతో గట్టిగానే ప్రయత్నించింది. తాజాగా యాక్షన్ రాణి అవతారం ఎత్తబోతోందట. ఇటీవలి కాలంలో కథానాయిక ప్రాధాన్యతా చిత్రాల్లోనే త్రిష కనిపిస్తోది. తాజాగా తమిళంలో ఈ బ్యూటీ చేస్తోన్న ప్రాజెక్టు -‘గర్జనై’. దర్శకుడు సుందర్ బాలు తెరకెక్కిస్తున్నాడు.

07/05/2019 - 19:50

సైరా కోసం మెగా ఫ్యాన్స్ ఎదురు చూపులు మొదలయ్యాయి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. చిరంజీవి ప్రధాన పాత్రలో రామ్‌చరణ్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న చిత్రం కూడా. సుదీర్ఘ షూటింగ్‌ను పూర్తి చేసిన దర్శకుడు సురేందర్‌రెడ్డి, నిర్మాణానంతర కార్యక్రమాలనూ వేగం చేశాడు.

Pages