S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/16/2019 - 22:26

రామదూత ఆర్ట్స్ పతాకంపై గురు చిందేపల్లి దర్శకత్వంలో జి సీతారెడ్డి నిర్మించిన రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ -ఎంతవారలైనా. ఇప్పటికే విడుదలైన ఆడియో, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో పాజిటివ్ బజ్ ఏర్పడింది. తెలుగు, కన్నడలో రూపొందిన చిత్రంలో అద్వైత్, జహీదా శ్యామ్, అలోక్ జైన్, జి సీతారెడ్డి ముఖ్యపాత్రలు పోషించారు.

05/16/2019 - 22:24

రకుల్‌ప్రీత్‌సింగ్ తాజా బాలీవుడ్ సినిమా ‘దే దే ప్యార్‌దే’. అజయ్ దేవగన్ హీరో. సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్ర పోషించింది. కథ విషయానికి వస్తే ఆశీష్ అనే 50ఏళ్ల అజయ్ భార్య టబునుంచి విడిపోయి సింగిల్‌గా ఉంటాడు. ఆ క్రమంలో అందమైన అయేషా (రకుల్) ప్రేమలో పడతాడు. అయితే రకుల్ పాత్రకు తగ్గట్టు ఆయేషాను కాస్త బోల్డ్‌గా డిజైన్ చేశాడు దర్శకుడు. ఇదే సెన్సార్‌కు మండించింది.

05/16/2019 - 22:21

ఎన్టీఆర్ బయోపిక్ తరువాత -బాలకృష్ణ తదుపరి ప్రాజెక్టు సన్నాహాలు పూర్తయ్యాయి. తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్‌కు బాలయ్య గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో -ప్రాజెక్టు పూజా కార్యక్రమాలు నేడు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నుంచే రెగ్యులర్ షూటింగూ మొదలవుతుందట. తొలి షెడ్యూల్‌ని హైదరాబాద్‌లోనే ప్లాన్ చేశారని టాక్. సి కళ్యాణ్ నిర్మిస్తున్న సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడన్న కథనాలు లేకపోలేదు.

05/16/2019 - 22:19

జెర్సీ హిట్టుతో మంచి ఊపుమీదున్నాడు నాని. తదుపరి ప్రాజెక్టుగా దర్శకుడు విక్రమ్‌కుమార్ తెరకెక్కించనున్న ‘గ్యాంగ్‌లీడర్’లో చెలరేగిపోయేందుకు సిద్ధమవుతున్నాడు. కొత్త ప్రాజెక్టులో ఐదుగురు చార్మింగ్ బ్యూటీలతో నాని జోడీ కడుతున్నాడన్న వార్తలు ఇప్పటికే ఆసక్తిని రేకెత్తించాయి. అంతమంది గాళ్స్‌తో ఆటాడుకునే పాత్ర ఏమై ఉంటుందోనన్న ఆసక్తిని మరింత రేకెత్తిస్తూ -తాజా సమాచారం బయటకు పొక్కింది.

05/16/2019 - 22:17

దర్శక ధీరుడు రాజవౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్న సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలుకానుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న సినిమా, మూడో షెడ్యూల్‌ని హైదరాబాద్ పరిసరాల్లో ప్లాన్ చేశారు. 21నుంచి షెడ్యూల్ మొదలుకావొచ్చని చిత్రబృందం అంటోంది. ఈ షెడ్యూల్‌లో రామ్‌చరణ్, ఎన్టీఆర్, అలియాభట్..

05/16/2019 - 22:15

ఒక రొమాంటిక్ క్రైమ్‌కథ, ఒక క్రిమినల్ ప్రేమకథలాంటి మెసేజ్ ఓరియంటెండ్ కమర్షియల్ చిత్రాలతో టాలీవుడ్‌లో న్యూట్రెండ్‌ని క్రియేట్ చేసిన దర్శకుడు పి సునీల్‌కుమార్‌రెడ్డి. తాజాగా ఆయన తెరకెక్కించిన చిత్రం -రొమాంటిక్ క్రిమినల్స్. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఒక రొమాంటిక్ క్రైమ్‌కథ, ఒక క్రిమినల్ ప్రేమకథ చిత్రాలకు సీక్వెల్.

05/15/2019 - 22:03

సీత చిత్రంతో ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్
మొదలవుతుందని అంటున్నాడు
సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్.
బెల్లంకొండ శ్రీనివాస్, గ్లామర్ గాళ్ కాజల్
జంటగా సీనియర్ దర్శకుడు తేజ తెరకెక్కించిన
చిత్రం -సీత. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్
బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం
నిర్మించారు. సినిమా విడుదలకు సిద్ధమైన
సందర్భంగా అనూప్ రూబెన్స్
మీడియాతో ముచ్చటించాడు.

05/15/2019 - 22:02

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లుశిరీష్, సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ తనదైన మార్క్ క్రియేట్ చేస్తున్నాడు. శిరీష్ తాజా ప్రాజెక్టు -ఏబీసీడీ. అమెరికన్ బాయ్ కన్‌ఫ్యూజ్డ్ దేశి టాగ్‌లైన్‌తో వస్తున్న సినిమాకు సంజీవ్ రెడ్డి దర్శకుడు. మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన సినిమా శుక్రవారం విడుదలవుతున్న సందర్భంలో హీరో అల్లు శిరీష్‌తో ఇంటర్వ్యూ..
ఎబిసిడి కథ గురించి?

05/15/2019 - 22:00

72వ అంతర్జాతీయ కేన్స్ చలన చిత్రోత్సవం ప్రపంచ సెలబ్రిటీల అందాల మధ్య వెలుగులు విరజిమ్ముతూ మొదలైంది. ఫ్రెండ్ రివేరా నదీ తీరాన సాగనున్న కేన్స్ ఉత్సవాలకు ఈ ఏడాది ప్రముఖ మెక్సికన్ దర్శకుడు అలెజాండ్రో అధ్యక్షత వహించనున్నాడు. ఆరంభ, ముగింపు వేడుకకు ఫ్రెంట్ నటుడు ఎడ్వర్డ్ బాయర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తాడు. వేడుకలు మే 25వరకూ అంటే పది రోజులపాటు అట్టహాసంగా జరగనున్నాయి.

05/15/2019 - 21:58

నాతో కిరికిరి అంటే పోచమ్మ గుడిముంగిట పొట్టేల్ని కట్టేసినట్టే.. -అంటూ యాక్షన్ ఎపిసోడ్ ఫినిషింగ్ డైలాగ్‌తో రెచ్చిపోయాడు డబుల్ దిమాక్ శంకర్. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం -ఇస్మార్ట్ శంకర్. రామ్ బర్త్‌డే సందర్భంగా బుధవారం టీజర్ విడుదల చేశారు. ‘పతా హై మై కౌనూ.. శంకర్..

Pages