S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/11/2020 - 22:29

ఏ ప్రేమకైనా వయసుకు తగ్గ లెక్కుంటుంది. ఒక్కో వయసుపై ఒక్కోలా ప్రేమ చూపించే ఇంపాక్ట్‌ని ఇతివృత్తం చేసుకుని దర్శకుడు మాడుపూరి కిరణ్‌కుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రం -15-18-24 లవ్ స్టోరీ. మాజేటి మూవీ మేకర్స్, కిరణ్ టాకీస్ బ్యానర్లపై నిర్మితమవుతున్న సినిమాకు స్రవంతి ప్రసాద్, కిరణ్‌కుమార్ నిర్మాతలు.

03/11/2020 - 22:27

యాంకర్ ప్రదీప్, అమృత అయ్యర్ జోడీగా మున్నా దర్శకత్వంలో యస్‌వి బాబు నిర్మించిన చిత్రం -ముఫ్పై రోజుల్లో ప్రేమించడమెలా? మార్చి 25న సినిమా విడుదలవుతోన్న నేపథ్యంలో చిత్రబృందం మీడియా మీట్ నిర్వహించింది. కార్యక్రమంలో దర్శకుడు మున్నా మాట్లాడుతూ -2020లో ఆడియన్స్‌కి గుర్తుండిపోయే సినిమా ఇది. కథను అల్లు అర్జున్, బన్నీవాస్‌కి వినిపించినపుడు ఎంజాయ్ చేస్తూనే కొన్ని సజెషన్స్ ఇచ్చారు. అవి చాలా ప్లస్సయ్యాయి.

03/11/2020 - 22:26

పివియం జ్యోతి ఆర్ట్స్ బ్యానర్‌పై మహి రాథోడ్ హీరోగా నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం -1992. సినిమా టైటిల్ లోగో, ఫస్ట్ సింగిల్‌ను నిర్మాత రాజ్ కందుకూరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ -1992 టైటిల్, ఫస్ట్‌సింగిల్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. కొత్తవాళ్లు చేస్తున్న ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుంటున్నా అన్నారు. దర్శకుడు శివ పాలమూరి మాట్లాడుతూ -ఇది నా తొలి చిత్రం.

03/11/2020 - 22:24

కన్నడ హీరో శశికుమార్ తనయుడు అక్షిత్, అనహిత భూషణ్ జోడీగా తెలుగు, కన్నడ భాషల్లో దర్శకుడు ప్రభాకర్ ఆరిపాట తెరెకక్కిస్తోన్న చిత్రం -సీతాయణం. కలర్ క్లౌడ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రోహన్ భరద్వాజ్ సమర్పణలో లలిత రాజ్యలక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్స్‌లో సినిమా నుంచి బుధవారం ఫస్ట్‌లుక్ విడుదల చేశారు.

03/10/2020 - 22:26

ఇచ్చిన మాట ప్రకారం వివేక్ ఆత్రేయకు -నాని ఓ చాన్స్ ఇస్తున్నాడట. కొత్తవాళ్లను తనదైన స్టయిల్‌లో ప్రోత్సహిస్తున్న నాని -మొన్నటి హిట్ దర్శకుడు శైలేష్ కొలనుకూ అలాగే చాన్స్ ఇచ్చాడు. ‘మెంటల్ మదిలో..’ సినిమా తెరకెక్కిస్తోన్న టైంలో కొత్త దర్శకుడు వివేక్ ఆత్రేయ -నానిని కలిసి ఓ లైన్ చెప్పాడట. నానికి కంటెంట్ నచ్చినా -సినిమాను తీయగల స్టామినా వివేక్‌కు ఉందో లేదోనన్న చిన్న సందేహం వెలిబుచ్చాడట.

03/10/2020 - 22:23

బన్నీకి బంపర్ హిట్టివ్వడానికి సుక్కూ ఎంత తొందర పడుతున్నాడో -పరిస్థితులు అంత వెనక్కి లాగుతున్నాయి. నిజానికి బన్నీ -సుక్కూ కాంబోలో రావాల్సిన హ్యాట్రిక్ ప్రాజెక్టు ఏఏ20 షూట్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుని రెడీగా ఉన్నారు. కీలక సన్నివేశాల షూట్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నా -అడుగుమాత్రం ముందుకు పడటం లేదు.

03/10/2020 - 22:22

టాలీవుడ్‌కి కొత్త దర్శకుల పోటెక్కువైంది. వచ్చేవాళ్లొస్తున్నారు. ఒకటో సినిమాతోనే మాయమైపోతున్నారు. ప్రతి సీజన్‌కూ వచ్చే పదిమందిలో ఏ ఒక్కడో మాత్రమే -ఓకే, ఫరవాలేదు, నిలబడతాడు అనిపించుకునేది. ఈ సీజన్‌లో ఆ కోవలో సానా బుచ్చిబాబు పేరు వినిపిస్తోంది. తీసిన సినిమా థియేటర్లకు రాకముందే -ఏం తీశాడో చూపిస్తోన్న ప్రమోషనల్ బిట్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

03/10/2020 - 22:19

కరోనా దెబ్బకు విదేశీ షూటింగ్‌లు నిలిచిపోతున్న తరుణంలో -ప్రభాస్ చేస్తున్న జాన్ షెడ్యూల్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయంటూ కథనాలు చక్కర్లుకొట్టాయి. యూరోప్ షెడ్యూల్‌ను క్యాన్సిల్ చేసుకున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదంటూ దర్శకుడు రాధాకృష్ణ స్పష్టం చేస్తున్నాడు. సోషల్ మీడియా వేదికగా చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తూ -ప్రభాస్ 20వ ప్రాజెక్టు యూరోప్‌లో అవాంతరం లేకుండా సాగుతోంది.

03/10/2020 - 22:16

ఒరేయ్ బుజ్జిగా.. అని ఎంత గట్టిగా పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. విడుదల తేదీ దగ్గర పడుతున్నా -ప్రమోషన్స్ బజ్ లేకపోవడంతో ఒరేయ్ బుజ్జిగాపై మొదట్లో ఉన్న ఆసక్తి ఇప్పుడు కనిపించటం లేదు. ఎంత గొప్ప సినిమాకైనా -విడుదలకు ముందు తెచ్చే హైపే ప్రాణమవుతోన్న పరిస్థితి ఇప్పటి సినిమాలది. రాజ్‌తరుణ్, మాళవికా నాయర్ జోడీగా కొండా విజయ్‌కుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రం -ఒరేయ్ బుజ్జిగా.

03/10/2020 - 22:14

నాగచైతన్య, సాయిపల్లవి జోడీగా శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న చిత్రం -లవ్‌స్టోరీ. ఇప్పటికే ప్రివ్యూతో ఆసక్తి రేకెత్తించిన -ఏయ్ పిల్లా సాంగ్ పూర్తి లిరికల్‌ను బుధవారం విడుదల చేస్తున్నారు. ఎమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి పతాకంపై నారాయణదాస్ కె నారంగ్, పి రాంమోహన్‌రావు సంయుక్తంగా రూపొందిస్తోన్న చిత్రమిది.

Pages