తెలంగాణ
విద్యుత్ బిల్లులు ఆన్‌లైన్‌లో చెల్లించాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, ఏప్రిల్ 13: కరోనా ఎఫెక్ట్ నేపథ్యంతో లాక్‌డౌన్ అమలు జరుగుతున్నందున గత సంవత్సరం మార్చి నెల బిల్లులనే ఈ ఏప్రిల్‌లో చెల్లించాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్ బిల్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నందున వాటికి సంబంధించిన బిల్లులు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి వినియోగదారులకు సూచించారు. సోమవారం హైదరాబాద్‌లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ బిల్లుల చెల్లాంచే అంశంలో వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆయన హితవు పలికారు. గత మార్చి నెలలో విద్యుత్ బిల్లు ఎంత చెల్లించారో ఏప్రిల్ నెలలో కూడా అంతే విద్యుత్ బిల్లు చెల్లిస్తే సరిపోతుందని మంత్రి స్పష్టం చేశారు. విద్యుత్ రీడింగ్ తీసుకోలేదు కనుక వచ్చే నేలలో రీడింగ్ పెరిగిపోయి భారీగా బిల్లులు వస్తాయని వినియోగదారులు పరేశాన్ కావద్దన్నారు. బిల్లుల గురించి బెంగ పడవద్దని ఆయన సూచించారు. విద్యుత్ బిల్లులు తీసుకోవడానికి ఇళ్లలేకి విద్యుత్ సిబ్బంది వెళ్లలేరు కనుక మార్చి, ఏప్రిల్ నెలల విద్యుత్ బిల్లులు మే నెలలో ఇస్తామన్నారు. అయితే రెండు నెలల బిల్లులో ఎక్కువ విద్యుత్ బిల్లు వస్తుందని వినియోగదారులు అపోహ పడవద్దన్నారు. 60 రోజుల రీడింగ్‌లో 30,30 రోజులకు ఎంత బిల్లు వస్తుందో వాటిని పరిగణలో తీసుకుంటామన్నారు. గతంలో వచ్చిన బిల్లుల కంటే మార్చి, ఏప్రిల్ నెలలో విద్యుత్ బిల్లులు అధికంగా 15-20 శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇంటి వద్దనే ఉండడంతో 24 గంటలు విద్యుత్ వాడకంతో బిల్లులు పెరిగే అవకాశం ఉండవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు.
సోషలిజమే శరణ్యం
*-సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
హైదరాబాద్, ఏప్రిల్ 13: ప్రపంచ మానవాళికి సోషలిజమే మార్గమని, ప్రస్తుతం ప్రపంచం అనుసరిస్తున్న లాక్‌డౌన్, క్వారంటైన్, భౌతిక దూరం, ఇంటికే పరిమితం కావడం, ఐసోలేషన్ వంటి ప్రక్రియలన్నీ చైనా అనుసరించినవేనని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఆ వ్యూహాలను ఇపుడు అన్ని దేశాలూ అనుసరిస్తున్నాయని, అమెరికా వంటి దేశాలు అహంభావంతో వ్యవహరించి , కరోనా తీవ్రతకు మూల్యం చెల్లించుకున్నాయని పేర్కొన్నారు. పకడ్బందీ విధానాలతో వియత్నాంలో కరోనా సోకలేదని గుర్తుచేశారు. క్యూబాలో ప్రభుత్వ వైద్యరంగం పటిష్టంగా ఉండటంతో కరోనా నామమాత్రంగా ఉందని, ఇంకోవైపు క్యూబా వైద్యులు తమ సేవలు అందించేందుకు ఇతర దేశాలకు వెళ్తున్నారని అన్నారు. ప్రజారోగ్యం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న చోట కరోనా కట్టడి అవుతోందని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయని వీరభద్రం పేర్కొన్నారు. సోషలిస్టు భావజాలం ఉన్న కేరళ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కరోనా కేసులు , మరణాలు పెరగకుండా ఆపగలిగారని వివరించారు. ఆపదలో ఉన్న ప్రజలు, కార్మికులకు వామపక్ష ప్రభుత్వం అండగా నిలిచిందని చెప్పారు. కరోనా కట్టడి, ప్రజలను ఆదుకోవడంలో కేరళ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలించిందని అన్నారు. సోషలిస్టు వ్యవస్థ ప్రత్యేకత, పెట్టుబడిదారీ విధానం వైఫల్యం కనిపిస్తోందని పేర్కొన్నారు.
చురుకుగా సీపీఎం సేవలు
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించడంతో సీపీఎం, ప్రజా సంఘాలు ప్రజలకు అండగా నిలిచాయని తమ్మినేని చెప్పారు. రాష్ట్రంలోని 34 జిల్లాల్లో వివిధ రూపాల్లో ప్రజలకు సహాయ పడడానికి సీపీఎం వర్గాలు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. బియ్యం,కూరగాయలు, నిత్యావసరాలు, మాస్కులు, శాటిటైజర్లు లక్షలాది రూపాయిలు విలువైనవి పంపిణీ చేశామని ఆయన పేర్కొన్నారు.