తెలంగాణ
ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, ఏప్రిల్ 13: జాతీయ , రాష్ట్ర స్థాయి ప్రవేశపరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అన్ని ప్రవేశపరీక్షలను వాయిదా వేశాయి. తెలంగాణలో ప్రవేశపరీక్షలకు ఎలాంటి అదనపు రుసుం లేకుండానే గడువును మే 5వ తేదీ వరకూ పొడిగించగా, ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపరీక్షల దరఖాస్తు గడువును ఏప్రిల్ 17వ తేదీ వరకూ పొడిగించారు. మరో పక్క నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ నిర్వహించే జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్, నీట్ యూజీ పరీక్షలు వాయిదా పడే అవకాశం కనిపిస్తున్నాయి. తెలంగాణలో, ఆంధ్రాలో టెన్త్ పరీక్షలు జరగాల్సి ఉంది, వాటికి ఇంకా షెడ్యూలు ఖరారు కాలేదు. తెలంగాణలో అధికారికంగా ఏప్రిల్ 30 వరకూ లాక్‌డౌన్ పొడిగించడంతో మే నెలలోనే టెన్త్ పరీక్షలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. పరీక్షల నిర్వహణలో జరిగిన జాప్యంతో 2021-22 విద్యాసంవత్సరం ప్రవేశాలు అనివార్యంగా జాప్యం జరిగే వీలుందని చెబుతున్నారు. జాతీయ స్థాయి ప్రవేశపరీక్షల వ్యవహారం తేలితే తప్ప రాష్ట్రాల ప్రవేశపరీక్షల తేదీలను ఖరారు చేసే అవకాశం లేదు. జాతీయ స్థాయిలో ఎక్కువ మంది హాజరయ్యే ఐఐటీ జేఈఈ మెయిన్స్, ఐఐటీ జేఈఈ అడ్వాన్స్, నీట్ యూజీ, ఐసీఎఆర్ అగ్రికల్చర్ ఎంట్రన్స్ యూజీ పరీక్షల తేదీలు ఖరారు కావల్సి ఉంది. మరో పక్క దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం ఉండటంతో ఆయా రాష్ట్రాల్లోని ప్లస్ టు ఫలితాలు విడుదలలో తీవ్ర జాప్యం జరిగే అవకాశం ఉంది. నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ ఒక వేళ ర్యాంకులను ప్రకటించినా, అడ్మిషన్లలో తీవ్ర జాప్యం జరగనుంది. గతంలో సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం ఆగస్టు 31లోగా అన్ని రకాల అడ్మిషన్లు పూర్తికావాలి. అయితే ఈ ఏడాది అందుకు అవకాశం కనిపించడం లేదు. నీట్‌కు దరఖాస్తు చేసుకునే గడువు ఇప్పటికే ముగిసింది. పరీక్ష మే 3న జరగాల్సి ఉంది. ఫలితాలు మే చివరిలో ప్రకటించాలని నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ గతంలో నిర్ణయించింది. ఒక వేళ నీట్ -యూజీ వాయిదా పడితే ఫలితాలు జూన్‌లోనే వెలువడతాయి. జేఎన్‌యూ ప్రవేశపరీక్షలు, ఢిల్లీ యూనివర్శిటీ ప్రవేశపరీక్షలు, ఏఆర్‌పీఐటీ, యూజీసీ నెట్ గడువులను కూడా నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ సవరించింది. పరీక్షల దరఖాస్తు గడువులను సవరించిన , ఎన్‌టీఏ ఇంత వరకూ పరీక్షల నిర్వహణ తేదీల షెడ్యూళ్లను మారుస్తూ ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. రానున్న వారం పరిస్థితిలో మార్పు వచ్చి కొంత అనుకూలంగా ఉంటే యథాతథంగా షెడ్యూలు కొనసాగించనున్నారు. కాగా ఉస్మానియా యూనివర్శిటీ, జేఎన్‌టీయూ హెచ్, ఇంగ్లీషు- విదేశీ భాషల విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఆన్‌లైన్‌లోనే ఎసైన్‌మెంట్లను ఇచ్చి వాటికి అనుగుణంగా మార్కులు కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.
లాక్‌డౌన్‌లో పోలీసుల సేవా నిరతి
హైదరాబాద్, ఏప్రిల్ 13: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ఒక పక్క విధులు నిర్వహిస్తూనే సేవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అపదలో ఉన్న ప్రజలను అదుకొని వారికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరు పోలీసులకు సహకరించాలని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలోని ఎస్పీలు, కమిషనరేట్ పరిధిలో పోలీసులు సేవ కార్యక్రమాలు చేపడుతున్నారు. సోమవారం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సోమవారం ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలకు ఆహార ప్యాకెట్‌లను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అందజేశారు. లంగర్‌హౌస్ ఓలీవ్ ఆసుపత్రి సమీపంలోని జీఎం గార్డెన్ ఫంక్షన్‌హాలులో జరిగిన కార్యక్రమంలో సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చి పనులు నిర్వహిస్తున్న వర్కర్స్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రతి డివిజన్ పరిధిలో ఏసీపీల ఆధ్వర్యంలో పోలీస్టేషన్‌ల వారీగా ఫుడ్ పంపిణీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. లాక్‌డౌన్‌లో ప్రతి ఒక్కరు సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచించారు. ఫుడ్ పంపిణీ కార్యక్రమం ప్రతి రోజు కొనసాగుతుందని సీపీ తెలిపారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ మహ్మద్ ఇక్బాల్ సిద్ధిఖీ, ఏసీపీ శివ మారుతితో పాటు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. అదే విధంగా సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలోని పోలీసులు సోమవారం రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా రక్తదానం సేకరణ కార్యక్రమం జరిగింది. రక్తదానంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ కోరారు. రక్తదానం చేయాలనుకునే వారు పోలీసులను సంప్రదిస్తే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. లాక్‌డౌన్ నేపథ్యంలో మెడికల్ ఎమర్జెన్సీ, తలసేమియా, క్యాన్సర్, వ్యాధిగ్రస్తులకు రక్తం అవసరం ఉందని సజ్జనార్ పేర్కొన్నారు. ఒక్కరుచేసిన రక్తదానం ముగ్గురికి ఉపయోగపడుతుందన్నారు. కోవిడ్ కంట్రోల్ రూం నెంబర్స్ 9490617440, 9490617431ను సంప్రదిస్తే పోలీసుల సహకారం అందిస్తామని చెప్పారు.
13 అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచామని, ఇప్పటి వరకు 250 మందికి మెడికల్ ఎమర్జెన్సీ సేవలు అందించామని, 500 మంది డయాలసిస్ రోగులకు సేవలు అందిస్తున్నామని తెలిపారు.