S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

02/22/2019 - 03:43

జెనీవా, ఫిబ్రవరి 21: భారత దేశంలో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనవని ఓ సర్వేలో స్పష్టమైంది. కార్మికుల ఆరోగ్యానికి సంబంధించినంతవరకు ఇవి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయని, అత్యధిక స్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయని స్పష్టం చేసింది.

02/22/2019 - 03:18

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 21: ముంబయిపై ఉగ్రవాద దాడి సూత్రధారి హఫీజ్ సరుూద్ నేతృత్వంలోని జమాత్ ఉద్ దావా (జేయూడీ)ను పాకిస్తాన్ ప్రభుత్వం గురువారం నిషేధించింది.

02/22/2019 - 01:28

సియోల్, ఫిబ్రవరి 21: ఉగ్రవాదం, పెరుగుతున్న భూతాపం, క్షీణిస్తున్న పర్యావరణ సమతుల్యత మానవ మనుగడకు ముప్పుగా పరిణమించాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మహాత్మాగాంధీ బోధనలు, జీవన విధానం ప్రపంచ ప్రజలకు ఆదర్శమని, మానవాళిని వేధిస్తున్న అనేక జటిల సమస్యలకు గాంధీజీ జీవితం సరైన పరిష్కారం చూపుతుందని అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన ఇక్కడకు గురువారం చేరుకున్నారు.

02/22/2019 - 04:16

ఢాకా, ఫిబ్రవరి 21: బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగరంలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకొని 81 మంది మృతి చెందారు. అనేక మంది కాలిన గాయాలకు గురయ్యారు. దేశంలో ఇటీవలి కాలంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదం ఇదేనని అధికారులు తెలిపారు. ఢాకా నగరంలోని చరిత్రాత్మక ప్రాంతంలో ఉన్న రసాయన గిడ్డంగులు, పక్కనున్న అపార్ట్‌మెంట్ భవనాల మీదుగా మంటలు వేగంగా విస్తరించడం వల్ల మృతుల సంఖ్య బాగా పెరిగింది.

02/21/2019 - 04:19

ఐక్యరాజ్యసమితి, ఫిబ్రవరి 20: దక్షిణాసియాలో ఉద్రిక్తతలు పెరగకుండా భారత్, పాకిస్తాన్ దేశాలు సంయమనం పాటించాలని ఐరాస సెక్రట జనరల్ ఆంటొనియో గెటిరిస్ అన్నారు. పుల్వానా ఉగ్రవాద దాడిని ఆయన ఖండించారు. ఉగ్రవాదం నిర్మూలనకు ఐరాస అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. ఇరు దేశాలు కూడా ఉద్రిక్తతలు హద్దుమీరకుండా చూడాలన్నారు. ఇరుదేశాల మధ్య ఇప్పటికే సంబంధాలు క్షీణించాయన్నారు.

02/20/2019 - 04:40

ది హేగ్, ఫిబ్రవరి 19: భారత నౌకాదళ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ అరెస్టును పాకిస్తాన్ ప్రభుత్వం సమర్ధించుకుంది. బలూచీస్థాన్‌లో జాదవ్‌ను అరెస్టు చేసిన తరువాత మిలటరీ కోర్టులో హాజరుపరిచారు. పాక్ మిలటరీ కోర్టు కులభూషణ్‌కు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. కుల్‌భూషణ్ కేసులో హేగ్ అంతర్జాతీయ న్యాయస్థానంలో పాక్, భారత్ తమతమ వాదనలు వినిపిస్తున్నాయి.

02/20/2019 - 02:44

బీజింగ్: పుల్వానా ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్, పాక్ దేశాలు సంయమనంతో వ్యవహరించాలని, పరస్పరం రెచ్చగొట్టుకునే ప్రకటనలు చేయడం మానుకోవాలని చైనా హితవుపలికింది. వివాదస్పద అంశాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరింది. ఈ నెల 14వ తేదీన పుల్వానాలో ఉగ్రవాద దాడి ఘటనలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి విదితమే. పాకిస్తాన్ దుశ్చర్యలకు నిరసనగా భారత్ ఇప్పటికే పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది.

02/20/2019 - 02:44

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 19: కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్ ప్రతిస్పందనకు పాకిస్తాన్ ఉలిక్కిపడుతోంది. ఎప్పుడు తమదేశంపై భారత్ దాడి చేస్తుందో అన్న భయం ఆ దేశంలో ప్రారంభమైంది. దీంతో భారత్ నుంచి దాడి జరగకుండా శాంతి మంత్రం పఠిస్తోంది.

02/20/2019 - 02:53

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 19: పుల్వానా ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్ హద్దుమీరి తమదేశంపై దాడి చేయడానికి ప్రయత్నిస్తే గట్టి జవాబు ఇస్తామని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. పుల్వానా దాడి వెనక పాక్‌ప్రమేయంపై ఆధారాలు ఉంటే చూపించాలని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

02/19/2019 - 06:16

లండన్, ఫిబ్రవరి 18: యోగా అన్ని వత్తిళ్లను దూరం చేయడమే కాకుండా, మానసికంగా, శారీరకంగా మనిషిని స్వస్థత పరుస్తుందని బ్రిటన్ రాజరిక వారసుడు ప్రిన్స్ చార్లెస్ పేర్కొన్నారు. బ్రిటన్ నిధులతో యూకేలో నడుస్తున్న నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్) జరిగిన కార్యక్రమంలో భారత్‌కు చెందిన ప్రాచీన విధానం యోగా వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని తన రాతపూర్వక సందేశంలో పేర్కొన్నారు.

Pages