అంతర్జాతీయం

కరోనా తీవ్రతను గోప్యంగా ఉంచింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: చైనా కరోనా వైరస్ విషయంలో చాలా గోప్యంగా వ్యవహరించిందని, ఈ సమాచారాన్ని సకాలంలో ప్రపంచ దేశాలతో పంచుకోలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. ఒకవేళ చైనా కరోనా వైరస్ గురించి ముందే హెచ్చరించి ఉంటే, అమెరికా, ప్రపంచం ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఇంకా బాగా సిద్ధమయి ఉండేవని ఆయన పేర్కొన్నారు. అమెరికా ఇంటెలిజెన్స్ నివేదికలు రానున్న కరోనా వైరస్ మహమ్మారి గురించి జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే హెచ్చరించాయని వచ్చిన వార్తలను ట్రంప్ శనివారం నాడిక్కడ విలేఖరులతో మాట్లాడుతూ ఖండించారు. ప్రజలలో దాని ప్రభావం కనిపించేంత వరకు అమెరికాకు కరోనా వైరస్ గురించి తెలియదని ఆయన పేర్కొన్నారు. ‘మీరు అర్థం చేసుకున్నట్టు ఇక్కడ చైనా లబ్ధిదారు కాదు. చైనాలో వేల వేల మంది ప్రజలు ఉన్నారు. ఈ విషయంలో చైనా భయంకరమయిన పరిస్థితిని అనుభవించింది. వారు నరకాన్ని చవిచూశారు. నేను (చైనా) అధ్యక్షుడు జీజిన్‌పింగ్‌తో మాట్లాడాను. వారు ముందుగానే మాకు చెప్పి ఉంటే బాగుండేదని నేను అన్నాను. వాళ్లకు సమస్య ఉందనే విషయం ముందే తెలుసు. ఆ విషయాన్ని ముందే మాకు చెప్పి ఉంటే బాగుండేదని నేను అన్నాను’ అని ట్రంప్ పేర్కొన్నారు. ‘చైనా (కరోనా వైరస్ విషయంలో) చాలా గోప్యంగా వ్యవహరించింది. చాలా చాలా గోప్యత పాటించింది. అది దురదృష్టకరం’ అని ట్రంప్ విలేఖరులతో అన్నారు. తాను చైనాను చాలా గౌరవిస్తానని, చైనా అధ్యక్షుడు జీజిన్‌పింగ్‌తో తనకు సత్సంబంధాలు ఉన్నాయని ఆయన పునరుద్ఘాటించారు.