S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/21/2019 - 00:00

న్యూఢిల్లీ: విమాన యాన సంస్థ ‘ఎయిర్ ఇండియా’లోని 100 శాతం వాటాలను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం వచ్చే నెలలో ప్రాథమిక బిడ్స్ ఆహ్వానించేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందని, దీనిపై ఇప్పటికే కొన్ని సంస్థలు ఆసక్తిని తెలియజేశాయని ఆదివారం నాడిక్కడ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు ఎయిర్ ఇండియాకు రూ. 58 వేల కోట్ల అప్పులున్నాయి.

10/20/2019 - 23:31

ముంబయి, అక్టోబర్ 20: హౌసింగ్ ఫైనాన్స్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ తన వెబ్‌సైట్‌ను ఆరు ప్రధాన భారతీయ భాషల్లోకి మార్చి లోకలైజ్ చేసింది. ఆంగ్ల మాధ్యమానికి ఇది అదనపుసౌకర్యమని, గృహ కొనుగోలు దారులకు అందుకు సంబంధించిన రుణ సదుపాయాలపై సమాచారం అందుబాటులోకి తేవాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని ఆదివారం నాడిక్కడ ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

10/20/2019 - 23:29

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: ఈనెలలో మనదేశ ప్రధాన మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌పీఐలు) రూ. 5,072 కోట్ల మొత్తాన్ని మన దేశీయ కేపిటల్ మార్కెట్లలో మదుపు చేశారు.

10/20/2019 - 04:38

వాషింగ్టన్: భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక రక్షణ పరికరాల వ్యాపారం ఈ సంవత్సరాంతం నాటికి 18 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసినట్టు అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ తెలిపింది. భారత్- అమెరికా డిఫెన్స్ టెక్నాలజీస్ అండ్ ట్రేడ్ ఇనిషియేటివ్ (డీటీటీఐ) గ్రూప్ సమావేశం వచ్చే వారం ఢిల్లీలో జరుగనున్న నేపథ్యంలో పెంటగాన్ శనివారం ఈ విషయం తెలిపింది.

10/20/2019 - 23:33

విజయవాడ: బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా ఈ నెల 22వ తేదీన బ్యాంక్ ఉద్యోగులు చేపట్టిన దేశ వ్యాప్త సమ్మెకు పలు రాజకీయ, ప్రజా, కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే బ్యాంకుల విలీన ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలు, నేతలతో సంప్రదించి నవంబర్ రెండో వారంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.

10/19/2019 - 23:39

ముంబయి, అక్టోబర్ 19: ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొని ఉన్నప్పటికీ భారత్ మాత్రం ఇప్పటికీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగానే కొనసాగుతోందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ అన్నారు.

10/19/2019 - 23:39

వాషింగ్టన్, అక్టోబర్ 19: భారత ప్రభుత్వం కార్పొరేట్ ఆదాయపు పన్నును తగ్గిస్తూ ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) శుక్రవారం సమర్థించింది. ఈ నిర్ణయం పెట్టుబడులపై సానుకూల ప్రభావం చూపుతుందని పేర్కొంది. అయితే, భారత్ ఆర్థిక సంఘటితానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించవలసి ఉందని, దీర్ఘకాలిక స్థిరమయిన ఆర్థిక పరిస్థితులను తీసుకు రావలసి ఉందని ఐఎంఎఫ్ పేర్కొంది.

10/18/2019 - 23:35

హైదరాబాద్, అక్టోబర్ 18: ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్-ఐపాస్ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి పెరగడానికి దోహదం చేసిందన్నారు.

10/18/2019 - 21:59

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) శుక్రవారం తన వాణిజ్య సామ్రాజ్య మకుటంలో మరో విజయ కలికితురాయిని నింపుకుంది. శుక్రవారం ఈ సంస్థ మార్కెట్ విలువ రూ. 9లక్షల కోట్లకు చేరడంతో కేవలం ఒక్కరోజులో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సంస్థగా రికార్డు నెలకొల్పింది. ఇంట్రాడేలో ఒకేరోజు ఈ కంపెనీ మార్కెట్ విలువ బీఎస్‌ఈలో మొత్తం రూ. 9,97,179.47 కోట్లకు పెరిగి చివరికి రూ.

10/18/2019 - 21:58

ఇండోర్, అక్టోబర్ 18: మధ్యప్రదేశ్‌లోని 45ప్రాంతాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ జాతీయ సరఫరా కేంద్రాలు (నేషనల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్) ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఆ కంపెనీ చైర్మన్ ముఖేష్ అంబానీ తెలిపారు. మొత్తం 10 మిలియన్ చదరపుటడుగుల స్థలంలో ఈ కేంద్రాలు ఏర్పాటవుతాయన్నారు.

Pages