S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/06/2019 - 02:35

విజయవాడ, అక్టోబర్ 5: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెతో ఆంధ్ర ప్రయాణికులకు సాధ్యమైనంత మేర ఇబ్బందుల్లేకుండా ఏపీఎస్ ఆర్టీసీ యుద్ధప్రాతిపదికన ప్రత్యేక బస్సులను రోడ్డు పైకి ఎక్కించింది. దసరా పర్వదినం సందర్భంగా హైదరాబాద్ నుంచి వచ్చే వారి కోసం 130 ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని కృష్ణా రీజినల్ మేనేజర్ నాగేంద్ర ప్రసాద్ ఆంధ్రభూమి ప్రతినిధికి చెప్పారు.

10/06/2019 - 02:32

అమరావతి, అక్టోబర్ 5: సింగరేణి కాలరీస్ నుంచి బొగ్గు సరఫరాకు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ఈనాటిది కాదని జెన్‌కో సీఎండీ బీ శ్రీ్ధర్ తెలిపారు. రాష్ట్రంలో థర్మల్ విద్యుదుత్పాదనకు సంబంధించి మహానంది కోల్ ఫీల్డ్స్ నుంచి సేకరణ తగ్గిన నేపథ్యంలో సింగరేణి కోల్ కాలరీస్ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)తో 2014-15లో అప్పటి ప్రభుత్వం అవసరాలకు తగ్గట్టుగా దిగుమతి చేసుకుందన్నారు.

10/06/2019 - 02:11

విజయవాడ (క్రైం), అక్టోబర్ 5: దసరా పండుగ సందర్భంగా సుదీర్ఘ ప్రాంతాల నుంచి వారి స్వస్థలాకు అధిక సంఖ్యలో ప్రజలు కుటుంబ సమేతంగా రాకపోకలు సాగిస్తున్న దృష్టా రవాణా శాఖ ప్రజా రవాణాపై దృష్టి సారించింది. దీనిలో భాగంగా ప్రైవేటు బస్సుల దోపిడీకి కళ్లెం వేసేందుకు జిల్లాలో తనిఖీలు నిర్వహించింది. ప్రైవేటు బస్సుల యాజమాన్యం ప్రయాణికుల నంచి అధిక వసూలుకు పాల్పడకుండా చర్యలు చేపట్టింది.

10/06/2019 - 01:35

హైదరాబాద్, అక్టోబర్ 5: జీఎస్‌టీ వల్ల ధరలు తగ్గాయని, ఈ పన్ను వల్ల దేశంలోని అన్ని అమ్మకం పన్నులను ఏకీకృత వ్యవస్థ పరిధిలోకి తెచ్చామని కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి తెలిపారు. శనివారం ఇక్కడ జరిగిన బ్యాంకుల రుణమేళా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముద్రబ్యాంక్ కింద కోట్ల మంది చిన్న, మధ్య తరగతి వ్యాపపారులకు రుణ సాయం అందుతుందన్నారు.

10/04/2019 - 23:48

హైదరాబాద్, అక్టోబర్ 4: ఐటీ రంగం విస్తరణకు హైదరాబాద్‌కు మించిది మరొటి లేదని, ఇక్కడ ఐటీ మంత్రి కేటీఆర్ మోస్ట్ డైనమిక్ లీడర్ అని, ఆయన పరిశ్రమల స్థాపనకు ఎంతో సహకారం అందిస్తున్నారని నీతి అయోగ్ సీఇఓ అమితాబ్ కాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన మైక్రాన్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో కలిసి అమితాబ్ కాంత్ ప్రారంభించారు.

10/04/2019 - 22:34

ముంబయి, అక్టోబర్ 4: రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) వరుసగా అయిదోసారి శుక్రవారం కీలక వడ్డీ రేట్లను తగ్గించడం వల్ల గృహ, వాహన, ఇతర రుణాలు చవకగా లభించనున్నాయి. ఆరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిన ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును పునరుద్ధరింప చేయడానికి తన దూకుడు చర్యల్లో భాగంగా ఆర్‌బీఐ వరుసగా అయిదోసారి కీలక వడ్డీ రేట్లను తగ్గించి రికార్డు సృష్టించింది.

10/04/2019 - 21:52

ముంబయి, అక్టోబర్ 4: ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకుల మనుగడపై వస్తున్న ఆందోళనకర వార్తలను నమ్మవద్దని, సహకార బ్యాంకుల సహా ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థకు వచ్చిన ప్రమాదమేదీ లేదని రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం నాడిక్కడ భరోసా ఇచ్చారు. బ్యాంకులు ఆర్థికంగా బలోపేతంగా, స్థిరత్వాన్ని కలిగివున్నాయని ఆయన పేర్కొన్నారు.

10/04/2019 - 21:50

ముంబయి, అక్టోబర్ 4: దేశీయ స్టాక్ మార్కెట్లు వాణిజ్య వారం చివరిరోజు సైతం భారీగా నష్టపోయాయి. ప్రధానంగా ఈ ఆర్థిక సంవత్సర వృద్ధిరేటు అంచనాలను ఆర్బీఐ మరింతగా తగ్గించి చూపిస్తూ రెపోరేట్లలో మరో 25 బేసిస్ పాయింట్ల కోత విధించింది. దీంతో బ్యాంకింగ్, శీఘ్రవిక్రయ వినిమయ వస్తువులు (ఎఫ్‌ఎఫ్‌సీజీ) స్టాక్స్ భారీగా నష్టపోయాయి.

10/04/2019 - 21:48

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లను బెంచ్‌మార్క్‌కన్నా మరింత తక్కువ చేస్తూ రిజర్వు బ్యాంకు తీసుకున్న నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి చేయూతనిచ్చేలా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం నాడిక్కడ పేర్కొంది. ఆర్థిక ఉద్దీపన నిమిత్తం కార్పొరేట్ పన్నుల కోత వంటి చర్యలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ బాసటగా నిలుస్తోందని ఆ మంత్రిత్వ శాఖ కితాబిచ్చింది.

10/04/2019 - 21:47

ముంబయి, అక్టోబర్ 4: కార్పొరేట్ పన్నుల కోత, విదేశీ పెట్టుబడులపై సుంకాల వెసులుబాటు వంటి చర్యలతో ఏర్పడిన ఆదాయ లోటును పూడ్చుకునేందుకు కేంద్రం మరోదఫా మధ్యంతర డివిడెండ్‌ను ఆర్బీఐ నుంచి కోరుతుందన్న విషయంపై తనకెలాంటి సమాచారం లేదని ఆ బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు.

Pages