బిజినెస్

ఎల్‌సీఎల్‌టీ ముందు ఆర్‌కామ్ రెజల్యూషన్ ప్లాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 7: రిలయన్స్ కమ్యూనికేషేన్స్ (ఆర్‌కామ్) దివాళా రెజల్యూషన్ ప్రతిపాదన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ (ఎన్‌సీఎల్‌టీ) ముందుకు వచ్చింది. ఆర్‌కామ్ ఆస్తుల అమ్మకాల ద్వారా సుమారు 23,000 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా. ఈనెల రెండో తేదీన ప్రారంభమైన రుణదాతల కమిటీ (సీఓసీ) రెజల్యూషన్ పిటిషన్‌ను ఈ ఓటింగ్‌ను నిర్వహించింది. మే నాలుగున ఓటింగ్ పూర్తికాగా, ఆర్‌కామ్ దివాళా ప్రక్రియను పూర్తి చేయాలన్న ప్రతిపాదనకు అనుకూలంగా అత్యధిక శాతం ఓట్లు వచ్చాయి. దీనితో, యూవీ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ ప్రతిపాదించిన ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్లాన్‌ను ఎన్‌సీఎల్‌టీకి సమర్పించారు. ఆర్‌కామ్‌తోపాటు దానికి అనుబంధంగా ఉన్న రిలయన్స్ టెలికాం లిమిటెడ్, రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ లిమిటెడ్ కూడా ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రక్రియలో చేరతాయి. సీఓసీ తీసుకున్న నిర్ణయాన్ని పరిశీలించిన తర్వాత ఎన్‌సీఎల్‌టీ తన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది.