బిజినెస్

ఉత్పత్తి తగ్గించిన ఓఎన్‌జీసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) తన ఉత్పత్తిలో 15 శాతం కోత విధించింది. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో సప్లయర్లు కొనుగోళ్లను తగ్గించుకోవడంతో ఓఎన్‌జీసీ ఈ నిర్ణయం తీసుకుంది. గత నెల 25వ తేదీన దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించక ముందు ఓఎన్‌జీసీ రోజుకు 64.3 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేసేది. అయితే, గ్యాస్ అమ్మకాలు 40 నుంచి 50 మిలియన్ క్యూబిక్ మీటర్ల మేర తగ్గడంతో, తదనుగుణంగా ఉత్పత్తిని ఓఎన్‌జీసీ తగ్గించింది.