బిజినెస్
కుదేలైన కర్నాటక
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీసిందని కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్డియూరప్ప ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి మార్గాలు అనే్వషిస్తున్నట్టు సోమవారం ఇక్కడ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం విధించిన రెండు వారాల లాక్‌డౌన్ మంగళవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల కోసం తాము వేచిచూస్తున్నట్టు సీఎం చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ప్రకటన తరవాతే రాష్ట్రంలో మద్యం అమ్మకాలు మినహాయించాలా వద్ద అన్నదానిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితిపై సోమవారం ఇక్కడ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. మంత్రులు, వివిధ శాఖల అధిపతులతో సీఎం భేటీ అయ్యారు. ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని ఎలా గట్టెక్కించాలన్న దానిపై సమావేశంలో చర్చించినట్టు యడ్డియూరప్ప వెల్లడించారు. వనరుల సమీకరణపై దృష్టి సారించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రులు, ఉన్నతాధికారులు నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. కోవిడ్-19 పుణ్యమాని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు ఆయన చెప్పారు. నిధుల సేకరణకు సంబంధించి న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న అక్రమ నిర్మాణాల కేసులు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించినట్టు ఆయన ప్రకటించారు. కోర్టులు తీర్పులు త్వరగా వెలువరిస్తే అనేక మందికి హక్కులు సంక్రమిస్తాయని, అలాగే ప్రభుత్వ ఖజానా నిండుతుందని ఆయన స్పష్టం చేశారు. బెంగళూరులోని విలువైన భూములు వేలం వేయడం ద్వారా నిధుల సమీకరించుకోవాలని భావిస్తున్నట్టు యడ్డియూరప్ప తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధీనంలో ఉన్న స్థలాలు వేలం వేయాలని నిర్ణయించినట్టు ఆయన వివరించారు. బెంగళూరు నగరంలో కూడళ్లలో ఉన్న భూమలు వేలం వేయడం ద్వారా 14,000-15,000 కోట్ల రూపాయలు నిధులు సేకరించాలని నిర్ణయించారు.
*చిత్రం...కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్డియూరప్ప