S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

06/26/2019 - 01:08

హైదరాబాద్, జూన్ 25: తెలంగాణలో పురపాలక సంఘాల ఎన్నికల ప్రక్రియకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం ప్రక్రియను ఐదు నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జే శ్రీనివాసగౌడ్ పురపాలక సంఘాలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై జస్టిస్ పి నవీన్‌రావు విచారణ చేపట్టారు.

06/26/2019 - 00:34

విశాఖపట్నం, జూన్ 25: విశాఖ జిల్లా సబ్ డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ ఏసీబీకి చిక్కారు. కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో అవకతవకల్లేవని సర్టిఫై చేసేందుకు 200 గజాల స్థలాన్ని తనకు ఇవ్వాలని విశాఖ వన్‌టౌన్ కోఆపరేటివ్ సొసైటీ అధికారి మోషే డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధితుడు ఆస్తిని మోషే సోదరుడి పేరిట రిజిస్ట్రేషన్ చేస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

06/25/2019 - 23:23

న్యూఢిల్లీ, జూన్ 25: ఢిల్లీ కోర్టు మంగళవారంనాడు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే మనోజ్ కుమార్‌కు మూడు నెలల జైలు శిక్ష విధించింది. 2013 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో తూర్పు ఢిల్లీలోని ఒక పోలింగ్ బూత్‌లో అడ్డంకులు సృష్టించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

06/25/2019 - 23:22

చెన్నై, జూన్ 25: దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళిని శ్రీహరన్‌కు స్వయంగా వాదించుకునేందుకు మద్రాస్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. తన కుమార్తె వివాహం సందర్భంగా తగిన ఏర్పాట్లు చేసుకునేందుకు వీలుగా ఆరు నెలలపాటు సాధారణ సెలవు కావాలని ఆమె చేసిన అభ్యర్థనపై హైకోర్టు స్పందించింది. జూలై 5న కోర్టుకు హాజరై తన వాదనలను స్వయంగా విన్నవించుకోవాలని హైకోర్టు సూచించింది.

06/26/2019 - 01:27

బార్మెర్: జోధ్‌పూర్‌లోని బార్మెర్‌లో ఆదివారం సాయంత్రం పెళ్లి పందిరి కూలిన ఘటనలో మరణించిన 15 మందిలో 10 మంది విద్యుదాఘాతంతోనే మరణించారని బలోత్రాలోని ప్రభుత్వ నహతా ఆసుపత్రి ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బలరామ్ నహ్‌తా తెలిపారు. సంఘటన స్థలంలో 14 మంది మరణించగా, తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తికి జోధ్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించామని ఆయన పేర్కొన్నారు.

06/25/2019 - 04:44

దేవరకొండ, జూన్ 24: నల్లగండ జిల్లా దేవరకొండ పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలో 250 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

06/25/2019 - 04:42

భువనగిరి, జూన్ 24: ఎన్‌కౌంటర్‌లో మరణించిన గ్యాంగ్‌స్టర్ నరుూమొద్దీన్ భూకబ్జాలపై విచారణ కొనసాగిస్తున్న రాచకొండ పోలీసులు పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు నరుూం భార్యతో పాటుగా ఆయన అనుచరులు నలుగురిపై పీడీ యాక్టు నమోదుచేసినట్టు సోమవారం రాచకొండ కమిషనరేట్‌నుండి ప్రకటనవిడుదల చేసింది.

06/25/2019 - 02:07

నాగాయలంక, జూన్ 24: మండలంలోని ఏటిమొగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న ఓ ఉపాధ్యాయుడు, అతని భార్య బ్యాంకు ఖాతాలు నుంచి గుర్తు తెలియని ఓ అగంతకుడు పెద్ద మొత్తంలో నగదును కైంకర్యం చేసినట్లు ఆలస్యంగా తెలిసింది.

06/25/2019 - 02:07

జగ్గయ్యపేట, జూన్ 24: పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద తన అనుచరులతో అనుచితంగా ప్రవర్తించిన మున్సిపల్ చైర్మన్ ఇంటూరి రాజగోపాల్‌పై పట్టణ పోలీస్‌స్టేషన్‌లో రాత్రి కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రౌడీ షీటు నమోదు అయిన వారు ఫోటోలు సేకరించే పనిలో భాగంగా పట్టణ ఎస్‌ఐ ధర్మరాజు చైర్మన్ రాజగోపాల్‌కు ఫోన్ చేసి ఫోటోలు కావాలని అడిగారు.

06/25/2019 - 01:54

కొడంగల్, జూన్ 24: కరెంటు షాక్ తగిలి ఓ మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని పర్సాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ ఐ శేఖర్‌గౌడ్ కథనం ప్రకారం.. కావలి శంకరమ్మ(35) సోమవారం ఉదయం ఇంటిని శుభ్రం చేస్తుండగా ఇంటికి ఉన్న మెట్లకు ఇనుపరాడ్లు ఉండటంతో వాటికి కరెంటు అర్తింగ్ రావడంతో కరెంటు తగిలి ఆపస్మారక స్థితిలోకి వెళ్లింది.

Pages