క్రైమ్/లీగల్
బాలికపై ఆటోడ్రైవర్ అత్యాచారం!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సబ్బవరం, మార్చి 22: విశాఖపట్నం జిల్లా, సబ్బవరం మండలం అమృతపురం గ్రామానికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. శనివారం రాత్రి తన ఆటోలో తీసుకెళ్ళి సూరిరెడ్డిపాలెం శివార్లలో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. స్థానిక సీఐ ఆర్‌వీవీఎస్‌ఎస్ చంద్రశేఖరరావు తెలిపిన వివరాలివి. బాలిక(15) సబ్బవరంలో ఓ షాపింగ్ మాల్‌లో పనిచేస్తోంది. అయితే, శనివారం ఆమె విధులు ముగించుకుని రాత్రి సుమారు ఏడు గంటల ప్రాంతంలో అమృతపురం వైపు వెళ్ళే ఆటోల స్టాండ్ వద్దకు వచ్చింది. అక్కడ ఆగి ఉన్న ఆటోను అమృతపురం వెళ్తుందా? అని అడగ్గా అదేగ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ వెళ్తుందని చెప్పటంతో ఆమె ఎక్కికూర్చుంది. అమృతపురం శివారు సూరిరెడ్డిపాలెం రోడ్డులోకి ఆటోను మళ్ళించి కొండవైపు తీసుకువెళ్ళటం గుర్తించిన ఆ బాలిక కేకలు వేసేందుకు ప్రయత్నించింది. అరిస్తే చంపేస్తానని బెదిరించి, ఊరు చివరి ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం జరిపాడు. ఈ సంగతి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. బాధితురాలిని వైద్యపరీక్షల నిమిత్తం విశాఖ కింగ్‌జార్జి ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు.