S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

08/11/2019 - 21:18

పచ్చని పూలతోట కాలుతున్న కమురుకంపు -
తాతలు, తండ్రులు కట్టుకున్న తాటాకు లోగిలి
తగలడిపోతున్న వాసన!

కట్టుబట్టలతో వీధినపడిన కుటుంబం -
గొంతులో గరగరమంటున్న గరళం!

ఆదర్శాన్ని అపహాస్యం చేస్తోన్న అసహనం-
అడుగడుగునా అంగుష్ఠమాత్రుల వీరవిహారం!

నాగరికత గొందుల్లో నగ్నంగా నర్తిస్తున్న
నడిమితరగతి నలికెల పాములు!

08/11/2019 - 21:18

వాన వెలిసాక
అప్పటివరకూ గదిలో విసిగిన ప్రాణం
కిటికీలోంచి వీచిన తెమ్మర స్పర్శతో
ఉన్నట్టుండి తేలికపడుతుంది
మట్టి మెత్తని పరిమళపు పువ్వై
విచ్చుకుంటుంది
చూరునుండి కారిన నీటిచుక్కల్ని
నేల చప్పుడు చేస్తూ చప్పరిస్తుంది
చిరుగాలి తన అలల చేతులతో
అప్పటికే తడిసిన మొక్క తల నిమురుతుంటే
బుగ్గపై చినుకు ముత్యాన్ని అద్దుకున్న మొగ్గ

08/11/2019 - 21:17

పరిమళిస్తూ పువ్వులు పూస్తున్నాయ
పవన తరంగాలు పలుకరిస్తున్నాయ
పిల్లకాలువ పరుగులు పులకరిస్తున్నాయ
కోకిలమ్మ పాటలు వీనులవిందు చేస్తున్నాయ
కానీ మనసు దోచిన పుత్తడిబొమ్మ కానరాదే?
మమతల కోవెలలోని తలపులు తెరవలేదే?

02/19/2018 - 05:01

ఓ సుందరమగు చయినా
దేశంపు మత్స్య నయనా!
నీ యందము వినుతింపగ
సాధ్యంబ బ్రహ్మ కయినా?

జ్యోత్స్నా ద్రవంపు టలయా,
లేకున్న వింత కలయా,
నీ నవ్వు? నిత్యనూతన
లావణ్య శోభ నిలయా!

02/19/2018 - 04:58

నెమిలీకలు పూచే కాలం
(కవిత్వం)
- కుప్పిలి పద్మ
వెల: రూ.100
ప్రతులకు: ముక్త పబ్లికేషన్స్
201, విజయలక్ష్మి అపార్ట్‌మెంట్స్
మెథడిస్ట్ కాలనీ,
బేగంపేట, హైదరాబాద్-500 016

01/28/2018 - 23:46

పువ్వు పుట్టగానే పరిమళించినట్టు... కుంచె పట్టగానే అనన్యంగా వికసించే కళాకారులు అరుదుగానే ఉంటారు. వృత్తి, ప్రవృత్తి భిన్నమైనవే అయనా నిష్ఠ, దీక్ష, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా అనితర సాధ్యులే కావొచ్చు. చిత్రకారుడు కావడమే అదృష్టం. ఏ కళలోనైనా రాణించి తనదైన ముద్ర వేసుకోవడమన్నది కొంతమందికే సాధ్యం. అలాంటి అరుదైన కోవకు చెందినవారిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గ వ్యక్తి సత్తిరాజు శంకర నారాయణ (శంకర్).

01/28/2018 - 23:45

నలుగుతున్న పద్యంలా
మబ్బులు పట్టిన ఆకాశం
ఒట్టి ఉరుములకూ మెరుపులకూ
నేల దాహం చల్లారదు!

అక్కరకు రాని అక్షరాలు
నిత్యం లక్ష జల్లినా
కాగితం ఒంటికి
కావ్య సుగంధమంటదు!

చెట్టు పిలవనిదే
వానపిట్టయి వాలదు
హృదయమింత ద్రవించనిదే
శోకం శ్లోకంగా మారదు!

01/28/2018 - 23:43

వాళ్లెప్పుడొచ్చినా
నేరుగా ఆది మానవుడి గుహలోంచి వచ్చినట్టు
మాలిమి చేసిన సుదూర అరణ్యాలనుంచి
రాళ్ళు పాతిన కాలం పాత డొంక దారుల్లోంచి
ముళ్ళకంచెల్ని మెత్తటి బంతిలా విసిరేస్తూ వస్తారు

ఎలకపిల్ల తొలుస్తున్న కంప్యూటర్ కొండలున్న
తీరిక లేని గదిలోకి
ఊడలు దిగిన మర్రి వృక్షాల్లా
ఇంకా పత్ర హరితం నిండిన ఆకులు తొడుగుతూ
పచ్చటి కరచాలనం చేద్దామని వస్తారు

01/28/2018 - 23:42

‘ఎలచ్చన్లో మా వూర్కి వచ్చిండు. అందరం తమ పార్టీకే జేకొట్టి ఓటేసి గెలిపిస్తిమి.. డప్పులు కొమ్ములతో ఊరేగిస్తిమి. అయాల్టి ధావతుకు మీరు సార బొట్టు పంపితిరి. నేనొక యాటపిల్లనిస్తిని. ఊరంతా ఓట్ల పండగ సేస్తిమి..’ ఇదీ గొఱ్ఱెల పెంపకందారు వీరప్ప పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ దగ్గర చెప్పుకున్నది. అతను గొఱ్ఱెలు కనుక్కోవటానికి దరఖాస్తు పెట్టుకున్నాడు, అప్పుకోసం. ‘నీకెప్పుడినా పని వుంటే నా దగ్గరకిరా!

01/28/2018 - 23:39

ఎడారి ఉపరితలంమీద అంకురాల సమూహం కవిత్వమైనప్పుడు- నాగరికత శిథిలాల్లో పదాల పరిమళాలను మోసుకొస్తూ, అంతరించిపోయిన నదుల్లోంచి అంతర్వాహినిలో ఉబికి వస్తున్న పురాతన స్పర్శనూ, చారిత్రక జ్ఞాపకాల్ని మోసుకొచ్చి అక్షరీకరించేది మహాకవిగాక మరెవరు?! ఒక కవిత పూర్తిచేశాక, అది ఇచ్చిన కుదుపులాంటి స్థితిలోనే చాలాకాలం- కాకుంటే చాలా సేపటివరకు అలా ఆ కవిత గురించే ఆలోచిస్తూ ఉండిపోయినట్లయితే..

Pages