సాహితి

లైఫ్ సర్టిఫికెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాళ్లెప్పుడొచ్చినా
నేరుగా ఆది మానవుడి గుహలోంచి వచ్చినట్టు
మాలిమి చేసిన సుదూర అరణ్యాలనుంచి
రాళ్ళు పాతిన కాలం పాత డొంక దారుల్లోంచి
ముళ్ళకంచెల్ని మెత్తటి బంతిలా విసిరేస్తూ వస్తారు

ఎలకపిల్ల తొలుస్తున్న కంప్యూటర్ కొండలున్న
తీరిక లేని గదిలోకి
ఊడలు దిగిన మర్రి వృక్షాల్లా
ఇంకా పత్ర హరితం నిండిన ఆకులు తొడుగుతూ
పచ్చటి కరచాలనం చేద్దామని వస్తారు

బండరాళ్ళని కోసి సెలయేళ్ళ ప్రవాహం
పిల్లకాలవ ముందు హాజరు వేయంచుకున్నట్టు
కొడుకులు వేయని కుర్చీ కోసం
అరిగిపోయన మనోధైర్యం మోకాళ్ళ నొప్పితో
కొంచెంసేపు విశ్రాంతిగా కూర్చోవాలని చూస్తారు

వాళ్ళొచ్చినప్పుడు
సారవంతమైన అనుభవాలు మొలుస్తున్నట్టు
మట్టి పాటతో గదిలోని గాలంతా తలాడిస్తుంది
విశాలమైన జ్ఞానం రెక్కలు తొడుక్కున్నట్టు
వెలుతురు పిట్టలు చుట్టూ చీకటినంతా ఎగరేస్తాయ
వాళ్ళు గూళ్ళోని పిల్లల కోసం
వూళ్ళన్నీ తిరిగొచ్చిన జ్ఞాపకాలు చెబుతుంటారు
చిన్నప్పుడు అక్షరాలు దిద్దించిన పలకమీద
బతుకు సాక్షి సంతకం పెట్టలేక
అరిగిపోయన వేలిముద్రల్లా వణికిపోతారు

నాగరికత తపస్సు ఫలించి
వరమిచ్చేందుకు వచ్చిన అరవై యేళ్ళ దేవతామూర్తుల్ని
గుర్తుపట్టలేక నిద్ర చాలని కళ్ళు
జీవన ప్రమాణాలకి కొత్త నిబంధనలు రాస్తున్నంతలోనే
పేదరాసి పెద్దమ్మ కథలు చెప్తానని
గోరుముద్దలు పెట్టి చందమామ నెక్కిస్తానని
చిటికెన వేలు పట్టుకుని వెంట లేవదీసుకెళ్తారు
బోసినవ్వుల చేతి కర్రతో
మళ్ళీ ప్రపంచ యాత్రకు బయల్దేరతారు!
(ప్రతి యేటా లైఫ్ సర్టిఫికెట్
ఇవ్వటానికొచ్చే పెన్షనర్లకి ప్రేమతో)
- శ్రీరాం పుప్పాల, 9963482597