సాహితి
కవన వాంగ్మూలం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 11 August 2019
- మందలపర్తి కిషోర్, 8179691822
పచ్చని పూలతోట కాలుతున్న కమురుకంపు -
తాతలు, తండ్రులు కట్టుకున్న తాటాకు లోగిలి
తగలడిపోతున్న వాసన!
కట్టుబట్టలతో వీధినపడిన కుటుంబం -
గొంతులో గరగరమంటున్న గరళం!
ఆదర్శాన్ని అపహాస్యం చేస్తోన్న అసహనం-
అడుగడుగునా అంగుష్ఠమాత్రుల వీరవిహారం!
నాగరికత గొందుల్లో నగ్నంగా నర్తిస్తున్న
నడిమితరగతి నలికెల పాములు!
సరిహద్దుల్లో సంపాతి ఎదురుచూపులు -
శవపేటికల కోసం తెగిపడుతున్న దేవదారు వనాలు!
కన్నులు కరిగి కురుస్తున్న కరి మబ్బులు-
కారుచీకటిలో నూలుపోగు నెలవంక!
ఎవరో అన్నట్టు,
పగలడానికేగా ఉంది ఈ పాపిష్టి గుండె!
రాయని మాటలే కన్నీటి మూటలు!!
ఏ మాటకామాట -
ఎగసిపడే మంట ఎంతోసేపుండదు!
అనుకుంటాం గానీ,
ఇన్ని దారుణాలు తట్టుకుని
బతికిబయటపడిన హృదయం కన్నా
ఇనుమూ, ఉక్కూ ఇంకేముంటాయి?