S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/20/2019 - 13:19

అమరావతి: ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబుకు పలువురు జన్మదినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ఆయన ఇపుడు 70 వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు.

04/19/2019 - 23:58

విశాఖపట్నం, ఏప్రిల్ 19: రాష్ట్రంలో వివిధ క్యాడర్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీపీఎస్సీ) ఉద్యోగ పరీక్షలను తెలుగులో నిర్వహించాలని లోక్‌నాయక్ ఫౌండేషన్ అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

04/19/2019 - 23:58

విజయవాడ, ఏప్రిల్ 19: నైరుతి, ఈశాన్య రుతుపవనాలు ముఖం చాటేడయంతో, దాని ప్రతికూల ప్రభావం వేసవిలో స్పష్టంగా కనిపిస్తోంది. వర్షాభావంతో రాష్ట్రంలో చాలాచోట్ల భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. సాగు, తాగునీటి అవసరాల కోసం 50శాతం మేర భూగర్భ జలాలపై రాష్ట్ర ప్రజలు ఆధారపడుతుంటారు. ఈ ఏడాది వేసవి ప్రారంభంలోనే భూగర్భ జలాలు అడుగండటంతో నీటి కోసం ప్రజల ఇక్కట్లు పెరిగిపోతున్నాయి.

04/19/2019 - 23:58

గుంటూరు, ఏప్రిల్ 19: ప్రజా సమస్యలపై అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షలు నిర్వహిస్తే తప్పెలా అవుతుందని మంత్రి నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. శుక్రవారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

04/19/2019 - 23:57

తిరుపతి, ఏప్రిల్ 19: ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో మరో మూడు నెలల్లో చిత్రం తీయడానికి సిద్ధమవుతున్నట్లు ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను చెప్పారు. శుక్రవారం ఉదయం విరామ సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.

04/19/2019 - 23:57

గుంటూరు, ఏప్రిల్ 19: బీసీలపై మోదీ కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ విమర్శించారు. గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి కులాలు, మతాలపై రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. బీసీని కాబట్టే తనపై విమర్శలు చేస్తున్నారని మోదీ చెప్పడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.

04/19/2019 - 23:56

అమరావతి, ఏప్రిల్ 19: శిలువ వేసినా విశ్వమానవ శ్రేయస్సుకు పంటి బిగువన బాధలు భరించిన మహిమాన్వితుడు ఏసుక్రీస్తు బోధనలు ప్రపంచ మానవాళికి ఆదర్శప్రాయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. క్రైస్తవ సోదరులందరికీ ఆయన గుడ్‌ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలకు ఏసుక్రీస్తు ప్రతీక అని కీర్తించారు. శాంతిదూతగా లోకానికి వచ్చిన ఆయన శాంతి, అహింసతోనే సమాజాభివృద్ధి సాధ్యమని నిరూపించారన్నారు.

04/19/2019 - 23:56

తిరుపతి, ఏప్రిల్ 19: టీటీడీ పరకామణి విభాగంలో నిల్వ ఉన్న చిల్లర నాణేలను సేకరించేందుకు ఫెడరల్ బ్యాంక్ ముందుకు వచ్చింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని పరకామణిలో శుక్రవారం టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, ఎఫ్‌ఏసీఏఓ బాలాజీ సమక్షంలో పరకామణి డిప్యూటీ ఈఓ దామోదరం నుంచి మొదటి నాణేల సంచిని ఫెడరల్ బ్యాంక్ సీఈఓ, ఎండి శ్యామ్ శ్రీనివాసన్ అందుకున్నారు. రానున్న ఐదారు నెలల్లో సుమారు రూ.

04/19/2019 - 23:55

గుంటూరు, ఏప్రిల్ 19: వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని, ఏం మాట్లాడుతున్నారే వారికే అర్థం కావడం లేదని టీడీపీ శాసనమండలి సభ్యుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ విమర్శించారు. శుక్రవారం ఉండవల్లి ప్రజావేదిక వద్ద ఆయన మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించిందని చెప్పిన వైసీపీ నాయకులు, ఇప్పుడు కుట్రలు జరిగాయని ప్రచారం చేస్తున్నారన్నారు.

04/19/2019 - 22:33

కర్నూలు, ఏప్రిల్ 19: దేశవ్యాప్తంగా ప్రధానమంత్రికి వ్యతిరేకపవనాలు వీస్తున్నాయని, జాతీయస్థాయి పత్రికలతో పాటు అంతర్జాతీయస్థాయిలో కూడా సర్వే నివేదికలు ఇదే స్పష్టం చేస్తుండటంతో నరేంద్ర మోదీ కులం కార్డు వాడుకుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Pages