S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/03/2019 - 01:05

కర్నూలు సిటీ, డిసెంబర్ 2: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అంతరించి పోతుందన్న ప్రచారం జరుగుతోందని, తెలుగుజాతి ఉన్నంత వరకు తమ పార్టీ ఉంటుందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. కర్నూ లు నగరంలో సోమవారం నిర్వహించిన పార్టీ విస్తృత

12/03/2019 - 05:40

విజయవాడ: నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకానికి సంబంధించి అదనంగా కొన్ని మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జారీ చేసింది. పట్టణ ప్రాంతాల్లో ఒక సెంటు భూమిని కేటాయించేందుకు తాజాగా నిర్ణయించింది. రాష్ట్రంలో వచ్చే ఉగాది నాటికి 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం కసరత్తు చేయడం తెలిసిందే. పట్టణ ప్రాంతాల్లో అవకాశం ఉన్న మేరకు ఒక సెంటు భూమిని ఒక్కో లబ్ధిదారునికి కేటాయించనుంది.

12/03/2019 - 05:58

గుంటూరు: బాధితుల ఫిర్యాదులకు సంబంధించి రాష్టవ్య్రాప్తంగా జీరో ఎఫ్‌ఐఆర్ విధానం అమలు చేయాలంటూ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి వారం రోజుల్లో విధి విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఢిల్లీ, ముంబై తరహాలో రాష్ట్రంలో కూడా జీరో ఎఫ్‌ఐఆర్‌ను అమలు చేయాలన్నారు.

12/03/2019 - 00:58

విజయవాడ: విద్యుత్ శాఖలో ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న రీడర్లతో సహా ఏ ఒక్కరినీ తొలగించబోమని, విద్యుత్ కాంట్రాక్టులు, కొనుగోళ్లలో ప్రజాధనాన్ని దుర్వినియోగం కానీయమని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

12/03/2019 - 00:55

గుంటూరు, డిసెంబర్ 2: ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా భయపడేది లేదని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో పొందుపర్చిన అంశాలన్నింటినీ అమలు చేసేందుకు ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ధైర్యంగా ముందడుగు వేస్తామని పేర్కొన్నారు.

12/03/2019 - 00:52

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా నదీతీరాల్లో గత కొద్ది రోజులుగా వరద తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇసుక తవ్వకాలు ఊపందుకున్నాయి. గత నెలాఖరు వరకే 23లక్షల 81వేల 716 మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా అయినట్లు అధికారులు తెలిపారు. నూతన ఇసుక విధానం అమల్లో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నా ఇప్పటి వరకు ప్రభుత్వానికి రూ. 89.31 కోట్ల మేర ఆదాయం లభించింది.

12/02/2019 - 14:12

గుంటూరు: ప్రభుత్వం అందించే మంచి పాలనను కొందరు జీర్ణించుకోలేక పోతున్నారని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన గుంటూరు జీజీహెచ్‌లో వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ ఆసరా పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా శస్త్ర చికిత్సల లబ్ధిదారులకు రోజుకు రూ.225ల చొప్పున నెలకు రూ.5వేల సాయం అందుతుందని, బ్యాంక్‌లో జమ చేస్తారని తెలిపారు. రోగి డిశ్చార్జి అయిన తరువాత 48 గంటల్లోనే రోగి ఖాతాకు సాయం జమ చేస్తారని అన్నారు.

12/02/2019 - 06:47

విజయవాడ, డిసెంబర్ 1: సమాజ భాగస్వామ్యంతో ఎయిడ్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుదామని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్యవిద్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

12/02/2019 - 06:45

గుంటూరు, డిసెంబర్ 1: ప్రపంచంలోనే అగ్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతూ కోట్లాది మంది హిందువుల మనోభావాలకు స్ఫూర్తిగా నిలిచే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను భంగపరిచేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనందసూర్య విమర్శించారు. ఆగమ శాస్త్రం విలువలను మంటగలిపేలా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

12/02/2019 - 06:44

రాజమహేంద్రవరం, డిసెంబర్ 1: కొత్త ప్రభుత్వం కొత్త ఇసుక విధానంలో వినియోగదారులకు ఇసుక ధర సరళంగా ఉంటుందని ఆశిస్తే అందుకు భిన్నంగా కొత్త విధానంలో పాత ధరే నయం అన్నట్టుగా తయారైంది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పక్కదారి పట్టడం వల్లే ధర పెరిగిపోయిందని తెలుస్తోంది.

Pages