ఆంధ్రప్రదేశ్‌

అమిత్ షా దృష్టికి అట్రాసిటీ కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మార్చి 18: రాష్ట్రంలో బీజేపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లినట్టు బీజేపీ రాష్ట్ర కోశాధికారి పాకలపాటి సన్యాసిరాజు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఇక్కడ బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో నెల్లిమర్ల జెడ్పీటీసీగా బీజేపీ అభ్యర్థి అప్పలాచారిని నిలబెట్టగా ఆయన నామినేషన్‌ను ఉపసంహరించాలని వైసీపీ నాయకులు తనపై వత్తిడి తీసుకువచ్చారన్నారు. దానికి తాను తలొగ్గకపోవడంతో తనపై అట్రాసిటీ కేసు నమోదు చేశారని విమర్శించారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కడపలో ఆదినారాయణరెడ్డిపై 307 కేసు నమోదు చేశారని, కాళహస్తి పట్టణ పార్టీ అధ్యక్షునిపైన, అలాగే తిరుపతి పట్టణ పార్టీ అధ్యక్షునిపైన, కావలి జనసేన నేత పసుపులేటి సుధాకర్‌లపై తప్పుడు కేసులు బనాయించారని తెలిపారు. బీజేపీ అభ్యర్థులపై సెక్షన్ 307, అట్రాసిటీ, గంజాయి అమ్మకం వంటి ఆరోపణలతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.