S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

04/14/2020 - 02:59

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వివిధ క్లబ్‌లు మూతపడ్డాయి. ఆటగాళ్లు తమతమ ఇళ్లకు లేదా వసతి గృహాలకే పరిమితమయ్యారు. ఈ పరిస్థితుల్లో ఇబ్రహిమోవిచ్ ప్రాక్టీస్ సెషన్‌కు హాజరుకావడం చర్చనీయాంశమైంది
*చిత్రం... తనకు వాటా ఉన్న హామర్బీ ఫుట్‌బాల్ క్లబ్ ఆటగాళ్లతో కలిసి స్టాక్‌హోమ్స్‌లో ప్రాక్టీస్ సెషన్‌కు హాజరైన సాకర్ లెజెండ్ జ్లాటన్ ఇబ్రహిమోవిచ్.

,
03/23/2020 - 05:50

జపాన్‌లోని మియాకో రైల్వే స్టేషన్ వద్ద ప్రదర్శనకు ఉంచిన ఒలింపిక్ క్రీడా జ్యోతి. నిషేధ ఆజ్ఞలు ఉన్నప్పటికీ, జ్యోతిని తిలకించేందుకు మాస్క్‌లు ధరించి, భారీ సంఖ్యలో హాజరైన క్రీడాభిమానులు

03/23/2020 - 05:47

జెనీవా, మార్చి 22: అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఓసీ) ఇటీవల తీసుకున్న పలు నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షెడ్యూల్ ప్రకారమే ఒలింపిక్ క్రీడా జ్యోతి ప్రజ్వలన, రిలే కార్యక్రమాలను నిర్వహించడాన్ని కొందరు ప్రశంసిస్తుంటే, మరికొందరు విమర్శిస్తున్నారు. నిజానికి రిలే కార్యక్రమాన్ని రద్దు చేయాలని ఐఓసీని టోక్యో ఒలింపిక్ కమిటీ కోరింది.

03/23/2020 - 05:45

మూతపడిన కొలరాడోలోని అమెరికా ఒలింపిక్, పారాలింపిక్ ట్రైనింగ్ సెంటర్. కరోనా వైరస్ కారణంగా స్పోర్ట్స్ ట్రైనింగ్ కాంప్లెక్స్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు కొలరాడో గవర్నర్ జారెడ్ పోల్స్ ప్రకటించాడు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఇక్కడ శిక్షణా కార్యక్రమాలు మొదలుకావని స్పష్టం చేశాడు.

03/23/2020 - 05:43

మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తున్నది. క్రికెట్, రగ్బీ, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, టెన్నిస్, బాడ్మింటన్ వంటి ఎన్నో విభాగాల్లో టోర్నీలు, సిరీస్‌లు రద్దవుతున్నాయి. ఐరోపా దేశాల్లో అ త్యంత ఆదరణ ఉన్న ఫుట్‌బాల్ ఇప్పుడు కరోనా బారిన పడి విలవిల్లాడుతున్నది. ఫస్ట్, సెకండ్ డివిజన్ క్లబ్‌లకు భా రీ నష్టాలు తప్పడం లేదు.

03/23/2020 - 05:43

న్యూఢిల్లీ, మార్చి 22: కరోనా వైరస్ ప్రభావం క్రీడా రంగాన్ని కూడా పట్టి పీడిస్తున్నది. వివిధ దేశాల్లో జరగాల్సిన ఎన్నో ప్రాంతీయ, అంతర్జాతీయ టోర్నీలు, క్వాలిఫయింగ్ ఈవెంట్లు, ఇతరత్రా పోటీలు రద్దవుతున్నాయి. సైప్రస్‌లోని నికొసియాలో మార్చి 4 నుంచి 13వ తేదీ వరకు జరగాల్సిన షూటింగ్ వరల్డ్ కప్ నుంచి భారత్ వైదొలగింది.

03/22/2020 - 04:09

కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ఒలింపిక్ క్రీడా జ్యోతి రిలేను అధికారులు అతి కొద్దిమందికి మాత్రమే పరిమితం చేసినప్పటికీ జపాన్ ప్రజల్లో ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. ఈ క్రీడా జ్యోతిని తీసుకువెళ్తున్న రైలును తిలకించేందుకు సెండాయ్ రైల్వే స్టేషన్ వద్ద ముఖాలకు మాస్క్‌లు ధరించి మరీ వచ్చిన క్రీడాభిమానులు

03/22/2020 - 04:07

శాండియాగో (కాలిఫోర్నియా)లోని పెట్కో పార్క్‌లో బేస్ బాల్ గ్రౌండ్‌ను శుభ్రం చేస్తున్న సిబ్బంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మేజర్ లీగ్ బేస్ బాల్ పోటీలన్నీ రద్దయ్యాయి. అయితే, ఏ క్షణంలోనైనా పోటీలు ప్రారంభమవుతాయన్న
ఉద్దేశ్యంతో గ్రౌండ్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు

03/22/2020 - 04:04

బెంగళూరు, మార్చి 21: భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) కేంద్రంలో ప్రారంభమైన శిక్షణా శిబిరంలో అన్నివిధాలా భద్రత ఉందని జాతీయ పురుషులు, మహిళల హాకీ జట్లు ధీమా వ్యక్తం చేశాయి. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ పలు టోర్నీలు, ఇతరత్రా కార్యక్రమాలను రద్దు చేసిన విషయం తెలిసిందే.

03/22/2020 - 04:03

న్యూఢిల్లీ, మార్చి 21: కరోనా వైరస్ కారణంగా ఎంతోమందికి ఊహించని విరామం లభించింది. ఎప్పుడూ ఏదో ఒక టోర్నీ లేదా సిరీస్‌లో ఆడుతూ తీరిక లేకుండా ఉండే క్రికెటర్లు కూడా కరోనా వైరస్ కారణంగా తమ తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న భారత బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్ మెజీషియన్ అవతారం ఎత్తాడు.

Pages