S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/10/2019 - 21:44

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: భారత్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికైన విండీస్ జట్టులో చోటు దక్కించుకున్న రఖీమ్ కార్న్‌వాల్‌ను పర్వతాకారుడిగా అభివర్ణిస్తున్నారు. 6 అడుగుల, 6 అంగుళాల పొడవు, 140 కిలోల బరువుతో కార్న్‌వాల్ ప్రత్యేకంగా కనిపిస్తాడు. 2014లో మొదటి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడిన అతను ఆల్‌రౌండర్. ఇంత వరకూ 55 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 260 వికెట్లు పడగొట్టాడు. 2,224 పరుగులు సాధించాడు.

08/10/2019 - 21:42

న్యూఢిల్లీ, ఆగస్టు 10: భారత ఆర్చరీ రంగానికి మంచి రోజులు వచ్చినట్టే కనిపిస్తున్నది. అంతర్గత కుమ్ములాటల కారణంగా సస్పెన్షన్‌కు గురైన భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ) పాలనా వ్యవహారాలను చూసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు తీర్పునివ్వడంతో సానుకూల వాతావరణం ఏర్పడింది. ఈ ఆదేశాలను దృష్టిలో ఉంచుకొని ఏఏఐపై నిషేధాన్ని వరల్డ్ ఆర్చరీ ఎత్తివేయడానికి మార్గం సుగమమైంది.

08/09/2019 - 22:24

న్యూఢిల్లీ, ఆగస్టు 9: భారత క్రికెటర్లు ఇక నాడా (నేషనల్ యాంటి డోపింగ్ జెన్సీ) డోపిం గ్ టెస్టుల్లో పాల్గొనాల్సిందేనని క్రీడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆటగాళ్లంతా సమానమేన ని, ఈ విషయంలో క్రికెటర్లకు ఎలాంటి మినహాయంపులు ఉండవని, చట్టానికి లోబడి తప్ప బీసీసీఐ కూడా ప్రత్యామ్నాయ మార్గం లే దని క్రీడా శాఖ కార్యదర్శి ఆర్‌ఎస్ జులానియా వెల్లడించాడు.

08/09/2019 - 22:22

ట్రినిడాడ్, ఆగస్టు 9: వెస్టిండీస్ ఏ జట్టుతో జరుగుతున్న మూడో అనధికార టెస్టులో భారత్ ఏ జట్టు చెలరేగి ఆడుతోంది. మొదటి ముగ్గురు బ్యాట్స్‌మెన్లు నిరాశ పరిచినా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ, కెప్టెన్ హనుమ విహారి సెంచరీతో రాణించారు. దీంతో ప్రత్యర్థి జట్టు ముందే భారీ లక్ష్యాన్ని నిర్దేశిం చింది.

08/09/2019 - 22:20

న్యూఢిల్లీ, ఆగస్టు 9: న్యూజిలాం డ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లామ్ ఐపీఎల్‌లో (ఇండియన్ ప్రీమియర్ లీగ్) కోల్‌కతా నైట్ రైడర్స్ అసిస్టెంట్ కోచ్‌గా పనిచేయనున్నారని ఆ జట్టు యాజమాన్యం ప్రకటించింది. ఇందు కు సంబంధించి ఒప్పందం కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఈ మధ్యే మెకల్లామ్ అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగాడు. ఇప్పటికే కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరించా డు.

08/09/2019 - 22:19

కొలొంబో, ఆగస్టు 9: మాజీ కెప్టెన్ దినేష్ చండీమల్‌కు శ్రీలంక క్రికెట్ జట్టు మళ్లీ పిలుపిచ్చింది. న్యూజిలాండ్‌తో జరిగే మొదటి టెస్ట్‌లో భాగంగా 15మందితో కూడిన సభ్యు ల్లో చండీమల్ పేరును ఎంపిక చేసింది. దీంతో ఈ మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఆరు నెలల తర్వాత తిరిగి మైదానంలో అడుగు పెట్టబోతున్నాడు.

08/09/2019 - 22:17

గయానా, ఆగస్టు 9: వెస్టిండీస్- భారత్ మధ్య గురువారం జరిగిన మొదటి వనే్డ వర్షార్పణం అయంది. మ్యాచ్‌ను రెండుసార్లు వరుణుడు అడ్డుకోవడంతో అంపైర్లు నిలిపివేశా రు. అంతకుముందు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విండీస్‌కు బ్యా టింగ్ అప్పగించాడు. దీంతో క్రిస్ గేల్, ఎవిన్ లూయస్ ఇన్నింగ్స్‌ను ఆ రంభించారు.

08/08/2019 - 22:21

టరౌబ, ఆగస్టు 8: వెస్టిండీస్ ఏ జట్టుతో జరిగిన మూడో అనధికార టెస్టులో టీమిండియా ఏ జట్టుకు చెందిన ఆఫ్ స్పిన్నర్ క్రిష్ణప్ప గౌతమ్ 6 వికెట్లతో చెలరేగాడు. దీంతో వెస్టిండీస్ ఏ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత ఏ జట్టు 3 వికెట్లను కోల్పోయ 23 పరుగులు చేసింది.

08/08/2019 - 22:19

లండన్, ఆగస్టు 8: దక్షిణాఫ్రికాకు చెందిన స్పిన్నర్ కొలిన్ అకర్‌మన్ టీ20 మ్యాచ్‌లో సరికొత్త రికార్డు నెల కొల్పాడు. ఒకే మ్యాచ్‌లో 18 పరు గులిచ్చి 7 వికెట్లను తీశాడు.

08/08/2019 - 22:18

కరాచీ, ఆగస్టు 8: పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్లు షోయాబ్ మాలిక్, హఫీజ్‌లకు పీసీబీ (పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) మొండిచేయ చూపింది. గురువారం 2019-20 సీజన్‌కు సెంట్రల్ కాంట్రాక్టులను ప్రకటిం చిన పీసీబీ వీరిద్దరి పక్కనబెట్టింది. కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ , బాబర్ ఆజమ్‌తో పాటు లెగ్ స్పిన్నర్ యాసిర్ షాకు ఏ కేటగిరి కేటాయంచింది.

Pages