S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

10/04/2019 - 21:58

రష్యాలోని ఉలాన్ ఉడేలో జరుగుతున్న ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌లో శుక్రవారం జరిగిన 54 కేజీల విభాగంలో మంగోలియా బాక్సర్ మిచిడ్మా ఎర్డెనెదలైపై విజయం సాధించిన భారత బాక్సర్ జమునా బోరో.

10/04/2019 - 21:57

భారత హాకీ టీమ్ గోల్ కీపర్ సవిత పూనియా శుక్రవారం గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌తో 200 అంతర్జాతీయ మ్యాచ్‌లను పూర్తి చేసుకోడంతో ఆమె పేరుతో 200 నెంబర్ ఉన్న జెర్సీని ప్రదర్శిస్తున్న భారత హకీ మహిళా జట్టు. ఇంగ్లాండ్‌లోని మార్లోలో బ్రిటన్‌తో జరిగిన ఈ సిరీస్‌ను భారత్ 1-1తేడాతో డ్రా చేసుకుంది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరుజట్టు చెరో మ్యాచ్ గెలవగా, మూడు డ్రాగా ముగిసాయ.

10/03/2019 - 23:30

విశాఖపట్నం : దక్షిణాఫ్రికాతో విశాఖపట్నం వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మెన్లు అదరగొట్టారు. ఓవర్ నైట్ స్కోర్ 202 పరుగులతో రెండో రోజు గురువారం బ్యాటింగ్ ఆరంభించిన భారత్ ప్రత్యర్థి జట్టు బౌలర్లకు ఎలాంటి అవకాశమివ్వకుండా ఆడింది. ఈ క్రమంలో టెస్టులో యువ బ్యాట్స్‌మన్ మాయాంక్ అగర్వాల్ 69వ ఓవర్లో 2 బంతికి సింగిల్ తీసి టెస్టుల్లో తొలి సెంచరీని సాధించాడు.

10/03/2019 - 23:27

విశాఖపట్నం (స్పోర్ట్స్), అక్టోబర్ 3: విశాఖ టెస్ట్‌లో తన డబుల్ సెంచరీ ఇన్నింగ్స్ మరచిపోలేని అనుభూతిని కలిగిస్తోందని టీమిండియా ఓపెనర్ మాయాంక్ అగర్వాల్ అన్నాడు. బ్యాటింగ్‌లో రాణించి జట్టుకు భారీ స్కోరు అందించడంలో తాను భాగస్వామి అయినందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నాడు.

10/03/2019 - 23:26

ప్రొఫెషనల్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) ప్లేయర్ ఆఫ్ ది ఈయర్ అవార్డును దక్కించుకున్న ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్. అతనితో పాటు పీసీఏ సమ్మర్ వనే్డ ప్లేయర్‌గా క్రిస్ వోక్స్, టెస్ట్ ప్లేయర్‌గా స్టువర్ట్ బ్రాడ్, కౌంటీ చాంపియన్ ప్లేయర్‌గా హార్మర్, ఉమెన్ ఆఫ్ ది ప్లేయర్‌గా సోఫీ ఎక్లెస్టన్, యంగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా టామ్ బంటన్‌లు అవార్డులు అందుకున్నారు.

10/03/2019 - 23:30

*చిత్రం... న్యూఢిల్లీలో గురువారం జరిగిన ఎకనామిక్ సమ్మిట్ 2019లో భాగంగా గురువారం జరిగిన ప్రారంభ ప్లీనరీలో మాట్లాడుతున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా

10/03/2019 - 23:21

ప్రపంచ చాంపియన్స్ బెల్జీయంపై గోల్ చేసిన ఆనందంలో భారత హాకీ ఆటగాళ్లు. గురువారం జరిగిన చివరి మ్యాచ్‌లో భారత జట్టు 5-1 తేడాతో విజయం సాధించింది.

10/03/2019 - 06:35

విశాఖపట్నం: అందరి అంచనాలు తలకిందులు చేస్తూ టెస్టుల్లో ఓపెనర్‌గా రో‘హిట్’ శర్మ అదరగొట్టాడు. దక్షిణాఫ్రికాతో బుధవారం నుంచి విశాఖ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టులో మొదటి రోజే సెంచరీ సాధించి రెడ్ బాల్ క్రికెట్‌లోనూ తనేంత ప్రమాదకరమైన ఆటగాడో ప్రత్యర్థి జట్టుకు రుచి చూపించాడు. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్‌కు దిగింది.

10/02/2019 - 23:41

విశాఖపట్నం (స్పోర్ట్స్), అక్టోబర్ 2: గత రెండేళ్ళుగా టెస్ట్ మ్యాచ్ ఓపెనర్‌గా వెళ్ళాలని ఎదురు చూస్తున్నానని, ఇన్నాళ్ళకు తన కోరిక నెరవేరిందని రోహిత్ శర్మ అన్నాడు.

10/02/2019 - 23:37

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ క్రికెట్ సలహా మండలి (సీఏసీ) నుంచి కపిల్ దేవ్ తప్పుకున్నారు. ముగ్గురు సభ్యులతో కూడిన క్రికెట్ సలహా మండలి నుంచి శాంత రంగస్వామి ఇప్పటికే రాజీనా మా చేసిన విషయం తెలిసిందే. బుధ వారం కపిల్‌దేవ్ సీఏసీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. అయతే కపిల్ త న రాజీనామాకు గల కారణాన్ని మా త్రం వెల్లడించలేదు.

Pages