S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

10/14/2019 - 04:28

సుజుకా (జపాన్) ఫార్ములా వన్ గ్రాండ్ ప్రీ రేస్‌ను గెల్చుకున్న మెర్సిడిజ్ డ్రైవర్ వెల్టెరీ బొటాస్. లక్ష్యాన్ని అతను గంటా, 21 నిమిషాల, 46.755 సెకన్లలో చేరుకున్నాడు. అతని కంటే 13.348 సెకన్లు వెనుకగా రేస్‌ను పూర్తి చేసిన ఫెరారీ డ్రైవర్, ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్‌కు రెండో స్థానం దక్కింది.

10/14/2019 - 04:26

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: గతంలో మరే ప్రభుత్వం చేయని రీతిలో కేంద్ర సర్కారు అసాధారణ నిర్ణయాన్ని తీసుకుంది. ఏకంగా నాలుగు స్టేడియాలను ఉచితంగా వాడుకునేందుకు అథ్లెట్లకు, వివిధ క్రీడా సమాఖ్యలకు అనుమతిచ్చింది. నవంబర్ ఒకటో తేదీ నుంచి నాలుగు స్టేడియాలు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘ ఫిట్ ఇండియా’ను ప్రోత్సహించేందుకు కేంద్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.

10/13/2019 - 06:31

పూణె : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్‌కు 376 పరుగుల ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ స్కోరు 36/3తో శనివారం మూడో రోజు బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 275 పరుగులకు ఆలౌటైంది. సఫారీ బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ ఫఫ్ డుప్లెసిస్ (64)తో పాటు కేశవ్ మహారాజ్ (72) అర్ధ సెంచరీ సాధించగా, క్వింటన్ డికాక్ (31), వెర్నర్ ఫిలాండర్ (44, నాటౌట్) రాణించారు.

10/13/2019 - 06:33

ఉలన్‌ఉడే (రష్యా), అక్టోబర్ 12: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ సెమీస్ లో పరాజయం పాలైంది. దీంతో కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. శనివారం నిర్వహించిన సెమీస్‌లో 51 కేజీల విభాగంలో టర్కీ బాక్సర్ బుసెనాజ్ క్యాకిరోగ్లు చేతిలో మేరీ 1-4 తేడాతో ఓడిపోయంది.

10/13/2019 - 06:28

ఉలన్‌ఉడే (రష్యా), అక్టోబర్ 12: హరియాణాకు చెందిన మంజు రాణి 48 కేజీల విభాగంలో ఫైనల్ కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో థాయ్‌లాండ్ క్రీడాకారిణి రాక్షత్‌ను 4-1 తేడాతో మట్టికరిపించింది. ఈ భారత బాక్సర్ క్వార్టర్స్ ఫైనల్‌లో ఉత్తరకొరియా బాక్సర్‌ను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది. ఈ విజ యంతో మంజూరాణి 18 తర్వాత ఫైనల్‌కి చేరిన భారత క్రీడాకారిణిగా ఘనత సాధించింది.

10/13/2019 - 06:27

ఆలూర్, అక్టోబర్ 12: దేశవాళి ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా శనివారం జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్రా జట్టు ఓడిపోయంది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్రా బ్యాట్స్‌మెన్లలో క్రాంతి కుమార్ (72), ప్రసన్న కుమార్ (56), కెప్టెన్, వికెట్ కీపర్ రికీ భూయ్ (59), కరణ్ షిండే (32) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయ 265 పరుగులు చేసింది.

10/13/2019 - 06:26

*చిత్రం...యూరో 2020లో భాగంగా లక్సెంబర్గ్‌తో జరిగిన గ్రూప్ బీ క్వాలిఫయర్ సాకర్ మ్యాచ్‌లో గోల్ చేసిన ఆనందంలో పోర్చుగల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనార్డో.

10/13/2019 - 06:25

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో ఓ అభిమాని మైదానంలోకి దూసుకొచ్చాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ వద్దకు వెళ్లి అతడి కాళ్లను ముద్దాడాడు. ఈ క్రమంలో వెనక్కి జరిగిన హిట్‌మ్యాన్ ఒక్కసారిగా అదుపుతప్పి అభిమానిపై పడ్డాడు. వెంటనే పక్కనే ఉన్న వైస్ కెప్టెన్ అజింక్యా రహానే రోహిత్ శర్మతో కలిసి నవ్వుతూనే అభిమానిని మైదానం వదలి వెళ్లమని వారించారు.

10/11/2019 - 23:56

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు లో డబుల్ సెంచరీ సాధించి పలు రికార్డులు సొంతం చేసుకున్న
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ

10/11/2019 - 22:20

పూణె, అక్టోబర్ 11: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు రెండోరోజు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెచ్చిపోయాడు. సఫారీ బౌలింగ్‌ను చిత్తుచేసి డబుల్ సెంచరీ సాధించాడు. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 273/3 శుక్రవారం రెండో రోజు బ్యాటింగ్‌కు దిగిన భారత్ ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.

Pages