S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/17/2020 - 06:04

న్యూఢిల్లీ, మార్చి 16: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌తో క్రీడాకారులు ఏమాత్రం కుంగిపోకుండా, తమ ప్రాక్టీస్‌ను కొనసాగిస్తూ ముందుకెళ్లాలని కేంద్ర క్రీడ ల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. కరోనా నివారణకు ప్రభుత్వం ప్రయాణాలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో జాతీయ ఫెడరేషన్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖల సూచనలు పాటించాలన్నారు.

03/17/2020 - 06:02

బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భాగంగా ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన తైవాన్ క్రీడాకారిణి తై జు యంగ్, పక్కనే (ఎడమ) చెన్ యు ఫెయ (చైనా). ఈ మ్యాచ్‌లో తై జు యంగ్ 2-0 తేడాతో విజయం సాధించింది.

03/17/2020 - 06:00

బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భాగంగా పురుషుల డబుల్స్ ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించిన అనంతరం జపాన్ క్రీడాకారుడు యుటా వతనాబే (ఎడమ) , హీరోయుకి ఎండో ట్రోఫీలతో ఇలా ఫొజులిచ్చారు.

03/16/2020 - 06:04

న్యూఢిల్లీ: మ్యాచ్ ఫిక్సింగ్ కేసును మొట్టమొదటిసారి తెరపైకి తీసుకొచ్చిన ఘనత ఢిల్లీ పోలీసులకే దక్కుతుంది. హన్సీ క్రానే నాయకత్వంలో దక్షిణాఫ్రికా జట్టు 2000 సంవత్సరంలో భారత్ పర్యటనకు వచ్చింది. అప్పుడు, అనుమానాస్పదంగా కనిపించిన బుకీలను గుర్తించి, క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతాన్ని ప్రపంచానికి తెలియచేశారు.

03/16/2020 - 06:01

బర్మింహామ్, మార్చి 15: టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు చౌ తియేన్ చెన్‌కు ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఎదురుదెబ్బ తగిలింది. హాట్ ఫేవరిట్, రెండో ర్యాంక్ ఆటగాడు విక్టర్ ఎక్సెల్సెన్ టైటిల్ పోరులో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచి, 21-13, 21-14 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించాడు. టైటిల్ అందుకున్నాడు.

03/16/2020 - 05:59

*లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో, ఖాళీ సీట్లు దర్శనమిస్తుండగా, ముల్తాన్ సుల్తాన్స్ ఆటగాడు దావీద్ వీస్ వికెట్‌ను పడగొట్టిన లాహోర్ కలందర్స్ బౌలర్ షాన్ మసూద్. కరోనా వైరస్ కారణంగా పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) టీ-20 క్రికెట్ టోర్నమెంట్‌ను ఖాళీ స్టేడియాల్లో నిర్వహిస్తున్నారు.

03/16/2020 - 05:57

*లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో, ఖాళీ సీట్లు దర్శనమిస్తుండగా, ముల్తాన్ సుల్తాన్స్ ఆటగాడు దావీద్ వీస్ వికెట్‌ను పడగొట్టిన లాహోర్ కలందర్స్ బౌలర్ షాన్ మసూద్. కరోనా వైరస్ కారణంగా పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) టీ-20 క్రికెట్ టోర్నమెంట్‌ను ఖాళీ స్టేడియాల్లో నిర్వహిస్తున్నారు.

03/15/2020 - 05:44

ముంబయి: కోట్లకు కోట్లు సంపాదించిపెట్టే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వాహణపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) మల్లగుల్లాలు పడుతున్నది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ టోర్నమెంట్‌గా గుర్తింపు పొందిన ఐపీఎల్‌లోని ఎనిమిది ఫ్రాంచైజీల యజమానులతో బీసీసీఐ శనివారం భేటీ అయింది. సమావేశంలో చర్చించిన అంశాలు, ఇతరత్రా వివరాలు ఇవ్వకుండా బీసీసీఐ గోప్యతను పాటించింది.

03/15/2020 - 05:38

నిర్మానుష్యంగా కనిపిస్తున్న టోక్యో ఒలింపిక్ విలేజ్ ప్రాంగణం. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఈసారి ఒలింపిక్ క్రీడలు సజావుగా సాగుతాయా అన్న అనుమానం సర్వత్రా వ్యక్తమవుతున్నది

03/15/2020 - 05:35

ముంబయి, మార్చి 14: కరోనా వైరస్ వ్యాప్తి, తత్ఫలితంగా వివిధ దేశాలు చేపడుతున్న ముందు జాగ్రత్త చర్యల కారణంగా మిగతా రంగాలతోపాటు క్రీడా రంగం కూడా కుదేలవుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను ఇప్పటికే వచ్చేనెల 15వ తేదీ వరకూ వాయిదా వేసిన భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) తాజాగా దేశవాళీ పోటీలన్నింటినీ నిరవధికంగా వాయిదా వేసింది.

Pages