-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
టోక్యో: ఒలింపిక్స్‌పైన కూడా కరోనా వైరస్ పంజా విసురుతుందా? అత్యంత భయంకరమైన ఈ వైరస్ వ్యాప్తి కారణంగా ఈ ఏడాది టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్ వాయిదా పడతాయా? ఈ అనుమానాలు ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఒలింపిక్స్ జూలై 24 నుంచి, పారాలింపిక్స్ ఆగస్టు 25 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.
కోల్‌కతా, మార్చి 3: ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్ మైదానంలో మంగళవారం ముగిసిన రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్లో కర్నాటకను 174 పరుగుల తేడాతో చిత్తుచేసిన బెంగాల్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. 2006-07 సీజన్ తర్వాత ఈ జట్టు ఫైనల్లోకి అడుగుపెట్టడం ఇదే మొదటిసారి.
రాజ్‌కోట్, మార్చి 3: రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో సౌరాష్టన్రు ఢీకొంటున్న గుజరాత్ కష్టాల్లో పడింది. కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించిన సౌరాష్ట్ర మ్యాచ్‌పై పట్టు బిగించగా, నాలుగో రోజు, మంగళవారం ఆట ముగిసే సమయానికి గుజరాత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 9 పరుగులకే ఒక వికెట్ కోల్పోయింది.
*చిత్రం...గౌహతి పర్యటనకు వచ్చి, మహర్షి విద్యా మందిర్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో మంగళవారం విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడుతున్న ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్
సిడ్నీ, మార్చి 3: మహిళల టీ-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భాగంగా మంగళవారం పాకిస్తాన్, థాయిలాండ్ జట్ల మధ్య గ్రూప్ ‘బీ’ చివరి గ్రూప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఉదయం వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు, తొలుత బ్యాటింగ్ చేసిన థాయిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. నటాకన్ చాంతమ్ 56 పరుగులతో రాణించింది. నటాయా బూచాథామ్ 44 పరుగులు సాధించింది.
ముంబయి, మార్చి 3: భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ సెట్స్‌లో బ్యాటింగ్ చేసి, వాంఖడే స్టేడియంలో స్టార్ అట్రాక్షన్‌గా నిలిచాడు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన క్రికెట్ సిరీస్‌లో ఆడేందుకు అతను సమాయత్తమవుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత సచిన్ ప్రత్యక్షంగా ఒక సిరీస్‌లో ఆడడం ఇదే మొదటిసారి.
అమ్మాన్ (జోర్డాన్), మార్చి 3: భారత బాక్సర్, కామనె్వల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత గౌరవ్ సోలంకీ ఇక్కడ జరుగుతున్న ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ పురుషుల 57 కిలోల విభాగంలో ప్రీ క్వార్టర్ ఫైన ల్స్ చేరాడు. మంగళవారం నాటి మొదటి రౌండ్‌లో అతను కిర్గిస్తాన్ కు చెందిన అకిల్బెక్ ఎసెనె్బక్ ఉలూ ను 5-0 తేడాతో చిత్తుచేశాడు.
క్రిస్ట్‌చర్చ్: మొన్నటి వరకు టెస్టుల్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయంచిన కోహ్లీసేనకు న్యూజిలాండ్ గడ్డపై ఘోర పరాభవం ఎదురైంది. ఊహించని విధంగా వైట్‌వాష్‌కు గురైంది. నెంబర్ వన్ జట్టు కనీసం పోరాట పటిమ కూడా చూపించకుండా అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమైంది. దీంతో ఐదు రోజుల టెస్టును కాస్త మూడు రోజుల్లోనే ముగించింది.
మెల్‌బోర్న్, మార్చి 2: సొంత గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా మహిళలు తమ విజయ పరంపరను కొనసాగిస్తున్నారు. తొలి మ్యాచ్‌లో భారత జట్టుతో ఓడినా మిగిలిన అన్నింట్లోనూ విజయం సాధించింది. తాజాగా సోమవారం న్యూజిలాం డ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో విజయం సాధించి, సెమీస్‌కు చేరింది.
*చిత్రం... బెంగళూరులో సోమవారం జరిగిన ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో భారత రెజ్లర్లు భజరంగ్ పూనియా, సాక్షి మాలిక్.