క్రీడాభూమి

సెమీస్‌కు ఆస్ట్రేలియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, మార్చి 2: సొంత గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా మహిళలు తమ విజయ పరంపరను కొనసాగిస్తున్నారు. తొలి మ్యాచ్‌లో భారత జట్టుతో ఓడినా మిగిలిన అన్నింట్లోనూ విజయం సాధించింది. తాజాగా సోమవారం న్యూజిలాం డ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో విజయం సాధించి, సెమీస్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందు బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయ 155 పరుగులు చేసింది. ఓపెనర్ బేత్ మూనీ (60) అర్ధ సెంచరీతో రాణించగా, కెప్టెన్ మెగ్ లన్నింగ్ (21), ఎలిస్సే పెర్రీ (21), అష్లే గార్డ్‌నర్ (20) ఆకట్టుకున్నారు. కివీస్ బౌలర్లలో అన్నా పీటర్‌సన్ 2 వికెట్లు తీయగా, లే కాస్పర్క్, హెలీ జెనె్సన్, అమేలియా కేర్ ఒక్కో వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయ 151 పరుగులు మాత్రమే చేసింది. కాటే మార్టిన్ (37, నాటౌట్), కెప్టెన్ సోఫీ డివైన్ (31), మ్యాడీ గ్రీన్ (28) రాణించారు. మెగ న్ షుట్, జార్జియా వేర్‌హామ్‌లు మూడేసి వికెట్లు తీసుకోగా, జెస్ జొనసేన్ 1 వికెట్ పడగొట్టింది. దీంతో ప్రపంచకప్ గ్రూప్ ఏ నుంచి భారత్, ఆస్ట్రేలియా సెమీస్‌కు చేరుకోగా, గ్రూప్ బీ నుంచి దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు సెమీస్‌కు వెళ్లాయ. నేడు వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లో ఓడిన జట్టుతో భారత్ సెమీస్‌లో తలపడనుంది.
బంగ్లాపై లంక..
మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడిన శ్రీలంక జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత ఓవర్రలలో 8 వికెట్లు కోల్పోయ కేవలం 91 పరుగులు మాత్రమే చేసింది. వికెట్ కీపర్ నిగర్ సుల్తానా (39) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది.
లంక బౌలర్లలో శశికళ సిరివర్ధనే 4 వికెట్లు తీయగా, అచిని కలసురియా 2, కవిషా దిల్హారి 1 వికెట్ పడగొట్టారు. అనంతరం శ్రీలంక 15.3 ఓవర్లలో 1 వికెట్ నష్టపోయ లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు హాసిని పెరీరా (39, నాటౌట్), చమరి ఆటపట్టు (30), అనుష్క సంజీవని (16, నాటౌట్) ఆ కట్టుకున్నారు.

*చిత్రాలు..విజయం సాధించిన అనంతరం ఆస్ట్రేలియా జట్టు
* (ఇన్‌సెట్లో) అర్ధ సెంచరీ సాధించిన మూనీ