S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

02/22/2019 - 20:12

నలభై సంవత్సరాలు దాటిన ప్రతి స్ర్తిలో మోకాళ్ల నొప్పుల సమస్య మొదలవుతుంది. కారణం విటమిన్-డి లోపం.. మనం ఏ పనిచేసినా మోకాలిపై భారం పడుతుంటుంది. ఇటీవల పెరుగుతున్న స్థూలకాయం, బహుళ అంతస్తుల్లో నివాసం, ఎగుడుదిగుడు ప్రాంతాల్లో నడక వంటి కారణాలతో మోకాలిలో నొప్పి సమస్య పెరుగుతోంది. అయితే వయసును బట్టి మోకాలినొప్పి బట్టి కూడా వస్తూ ఉంటుంది. సాధారణంగా 40 సంవత్సరాలు పైబడిన వారిలో మోకాళ్లనొప్పులు రావడం సాధారణం.

02/21/2019 - 18:22

సన్ టాన్ నుంచి రక్షణ పొందేందుకు కాస్మొటిక్ ప్రొడక్ట్స్, బ్లీచింగ్ వంటి విధానాలు మార్కెట్లోకి వచ్చాయి. కానీ ఇలాంటివి వాడటం చర్మానికి హానికరం. కాబట్టి సహజమైన చిట్కాలను వాడటంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది, సన్ టాన్ కూడా తొలగిపోతుంది. సన్ టాన్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. రసాయనాలు ఎక్కువగా వాడటం వల్ల, ఎండలో తిరగడం వల్ల, కాలుష్యం వల్ల కూడా సన్ టాన్ వస్తుంది.

02/20/2019 - 19:00

ఒత్తిడిని అదుపు చేసుకునేందుకు బోలెడు మార్గాలున్నాయి. అందులో పుస్తకాలు చదవడం, సంగీతం వినడం అందరికీ తెలిసినవే.. కానీ స్నానం కూడా ఒత్తిడిని తగ్గిస్తుందని మీకు తెలుసా! స్నానం చేయడం వల్ల శరీరంతో పాటు మెదడుకూడా తేలికపడి హాయిగా అనిపిస్తుంది. అందుకే కాస్త చికాగ్గా అనిపించినా చాలామంది వేడి నీటితో స్నానం చేస్తుంటారు. అలాంటి రకరకాల స్నానాల గురించి చూద్దాం..

02/19/2019 - 18:39

మారుతున్న కాలానికి అనుగుణంగా మన చర్మానికి అదనపు జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా పొడి, జిడ్డు చర్మం గలవారు జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మాన్ని హైడ్రేటెడ్‌గా, శుభ్రంగా ఉంచుకోవాలి. చర్మానికి కావలసిన తేమను అందించే సహజ, సురక్షిత మార్గాలు చాలానే ఉన్నాయి. వీటిలో బీట్‌రూట్ కూడా ఒకటని చెప్పవచ్చు. బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. బీట్‌రూట్ అభిరంజన గుణాన్ని కలిగి ఉంటుంది.

02/15/2019 - 18:47

కాలేజీకి వెళ్లే అమ్మాయిలు గోళ్ల అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. గోర్ల రంగును ఉపయోగించడంలో మెలకువలు తెలుసుకోగలిగితే మరింత చక్కగా వాటిని ఉపయోగించుకోవచ్చు.
* కొందరు గోళ్ల రంగు వేసుకుంటే అది చర్మంపై కూడా అంటుకుంటుంది. అలాంటప్పుడు వాడేసిన లిప్ బ్రష్‌ను నెయిల్ పాలిష్ రిమూవర్‌లో ముంచి చర్మంపై పడిన రంగును అద్దితే అది పోతుంది.

02/14/2019 - 18:39

నేటి కాలుష్య ప్రపంచంలో చాలామందికి చిన్న వయసులోనే జుట్టు విపరీతంగా రాలిపోతుంటుంది. జీవనశైలిలో మార్పులు, పోషకాహారంలోపం.. ఇలా కారణం ఏదైనా ఆ సమస్యను దూరం చేసుకోవాలంటే ఇంట్లోని ఈ నియమాలు పాటిస్తే మంచిది.

02/12/2019 - 18:18

సాధారణంగా పిల్లలు అయిదు సంవత్సరాలు వచ్చేంతవరకు పక్క తడుపుతుంటారు. ఐదు సంవత్సరాల తర్వాత వారికి మూత్రాన్ని నియంత్రించే పట్టు వస్తుంది. కొంతమంది పిల్లల్లో అయితే అయిదు సంవత్సరాలు దాటినా పక్క తడిపే అలవాటు ఉంటుంది. అలాంటి పిల్లల్లో మూత్రాశయం, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్ ఉందేమో చూడాలి. లేదా పిల్లల వైద్య నిపుణుడినే కాదు, యూరాలజిస్ట్‌ను కూడా సంప్రదించాలి.

02/11/2019 - 23:09

వాతావరణం మారింది. ఫలితంగా పిల్లల్లో జలుబుతో ముక్కులు కారడం మొదలైపోయాయి. జలుబు, ముక్కు కారణం, ముక్కు బ్లాక్ అవ్వడం వంటివి తరచూ చూస్తుంటాం. జలుబు పిల్లలను ఆడుకోనివ్వకుండా, అలసిపోయేలా చేస్తుంది. జలుబుకు మందులకంటే సహజ పద్ధతులను అనుసరించడం ద్వారా త్వరగా ఉపశమనం లభిస్తుంది. పిల్లలకు ముక్కు బ్లాక్ అయి ఊపిరి అందనప్పుడు వారు పడే ఇబ్బందిని మనం చూడలేం.

02/11/2019 - 19:26

నవ్వినా, మాట్లాడినా దంతాలు తెల్లగా, అందంగా కనిపిస్తే ముఖ సౌందర్యం మరింత ఇనుమడిస్తుంది. అందుకని దంతాలను ఎప్పుడూ తెల్లగా, ఎటువంటి మచ్చలు లేకుండా చూసుకోవాలి. దంతాలను తెల్లగా, ముత్యాల్లా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలు..

02/08/2019 - 19:29

ఇంట్లో ఏదైనా వేడుక ఉంటేనో, ఏదైనా పెళ్లికి వెళ్లాల్సి వస్తేనో మనకు అందంపై, సింగారంపై మోజు కలుగుతుంది. మనకు కావాల్సినప్పుడు అందం కావాలి అనుకుంటే వెంటనే వచ్చేయదు. అందంపై అప్పుడప్పుడూ శ్రద్ధ తీసుకోవడం కాకుండా నిత్యం అందంపై శ్రద్ధ తీసుకుంటేనే నిత్యం యవ్వనంగా కనిపించడానికి సాధ్యం అవుతుంది. అంత సమయం ఎక్కడుందండీ.. అంటారా.. ప్రతిరోజూ దినచర్యలో భాగంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు అందంగా ఉండచ్చు..

Pages