S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

08/26/2019 - 19:52

వానాకాలంలో, చలికాలంలో ఎవరికీ నీళ్లు తాగాలనిపించదు. వేడివేడిగా కాఫీనో, టీనో తాగాలనిపిస్తుంది కానీ మంచినీళ్లు తాగరు. కానీ చలికాలంలో కూడా సరైన మోతాదులో మంచినీళ్లు తాగాలి. శరీరానికి తగినంత మంచినీరు అందకపోతే కడుపులో అంతా గందరగోళంగా ఉంటుంది. ఆహారం సరిగా అరగదు. ఈ సమయంలో ఒక గ్లాసు మంచినీళ్లు తాగితే తెలుస్తుంది.. అది ఆకలి వచ్చిన గందరగోళమో.. లేక శరీరానికి నీళ్లు అందక, డీహైడ్రేషన్ వచ్చిన గందరగోళమో అని..

08/22/2019 - 18:55

పులిపిరి కాయల సమస్య ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. వీటిని ఉలిపిరి కాయలు అని కూడా అంటారు. ఆంగ్లంలో వీటిని వార్ట్స్ అంటారు. హ్యూమన్ పాపిలోమా అనే వైరస్ వల్ల ఈ పులిపిరులు ఏర్పడతాయి. ఇవి ఎక్కువగా ముఖం, మెడ, చేతులు, పాదాలపై వస్తుంటాయి. చర్మంతో కలిసిపోయే కొన్ని పులిపిర్లు పెద్దగా నొప్పిరావు. కొన్ని పులిపిర్లు మాత్రం దురద పెడుతుంటాయి.
రకాలు

08/21/2019 - 18:35

* ఆధునిక కాలంలో అధిక బరువుకు ఓట్స్ పరమ ఔషధంలా మారాయి. ఉదయం పూట పాలల్లో ఓట్స్ వేసుకుని తినడం వల్ల బరువు పెరగరు. అలాగే మిగతా ఆహారపదార్థాల్లో కూడా ఓట్స్ శాతాన్ని పెంచాలి.
* నిద లేచిన గంటలోపలే అల్పాహారాన్ని తినాలి.
* చికెన్, మాంసాలను తక్కువగా, చేపలను ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది.
* వారానికి మూడుసార్లు తప్పనిసరిగా గుడ్డును తినాలి.

,
08/20/2019 - 18:41

శరీరానికి పడని ఆహారపదార్థాలు, మందులూ, సౌందర్యసాధనాలు వాడినా ఇలా దద్దుర్లు వస్తుంటాయి. ఇలాంటివారు వారికి ఏ కారణం వల్ల ఎలర్జీ వస్తుందో గమనించుకోవాలి. వీలైనంతవరకు అలాంటివాటిని దూరంగా ఉంచాలి. కొన్నిసార్లు ఆహారపదార్థాల్లో కలిపే రసాయనాలు కూడా కారణం కావచ్చు. కాబట్టి ఏ పదార్థం తింటే ఎలర్జీ వస్తుందో గమనించాలి. అలాంటి వాటిని తినడం మానేయాలి.

08/16/2019 - 18:51

ముఖం అందంగా, నునుపుగా ఉండాలని అనుకోవటం సహజం. ముఖచర్మంపై ఉన్న స్వేదరంధ్రాలపై దుమ్ము, ధూళి అంటుకోవడంతో పాటు ముఖం జిడ్డుగా తయారై వెంటనే మార్కెట్లో దొరికే సౌందర్య సాధనాల్ని కొని ఉపయోగిస్తుంటారు. దీనివల్ల స్వేదరంధ్రాలు మూసుకుపోయి ముఖం అందాన్ని కోల్పోతుంది. ఇలా కాకుండా అందమైన ముఖం కోసం ఇంట్లోనే సులభమైన చికిత్సలను నిర్భయంగా వాడుకోవచ్చు.

08/16/2019 - 18:50

* గసగసాలను పాలతో నూరి, తలకు లేపనంగా వేస్తే చుండ్రు తగ్గుతుంది.
* మందార పూల రసానికి సమంగా నువ్వుల నూనెను చేర్చి, నూనె మాత్రమే మిగిలేంత వరకు కాచాలి. ఆ నూనెను తలకు పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది.
* మామిడి జీడి, కరక పలుపు ఈ రెండింటినీ సమాన భాగాలుగా తీసుకుని పాలతో నూరి తలపై లేపనం వేస్తే చాలా త్వరితంగా చుండ్రు సమస్య తొలగిపోతుంది.

08/13/2019 - 18:30

శుభకార్యాల వేళ పట్టు బట్టలు ధరించడం మన సాంప్రదాయం. అయితే.. సాధారణంగా పట్టుబట్టలపై మరకలు పడితే ఓ పట్టాన వదిలిపోవు. అలాగని వీటిని నూలు దుస్తుల్లా ఎడాపెడా ఉతకనూ లేము. అందుకే ఎంతో డబ్బు పోసి కొన్న పట్టు బట్టలు ఉతికేటప్పుడు, ఆరేసేటప్పుడు, లోపల దాచే విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే అవి పది కాలాల పాటు మన్నికగా ఉంటాయి.
జాగ్రత్తలు
* పట్టుచీరలను చెరువు, నది నీటితోనే ఉతకాలి.

,
08/11/2019 - 19:14

శరీర భారాన్ని మోసే పాదాలు వర్షాకాలం బాగా ఇబ్బందులకు గురవుతాయి. ఈ సమస్య కేవలం ఆడవాళ్ళలోనే కాదు మగవాళ్ళలో కూడా కనిపిస్తుంది. మొదట్లో ఇది పెద్ద సమస్యగా అనిపించకపోయినా తరువాత తరువాత ఇది పెనుసమస్యగా మారే అవకాశముంది. అందుకే ముందస్తుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పగుళ్ళను నివారించుకుంటే మంచిది. ఇంట్లోని వస్తువుల ద్వారానే పగుళ్ళను చక్కగా తగ్గించుకోవచ్చు.

08/09/2019 - 18:40

వర్షాకాలంలో ఇల్లంతా తడితడిగా మారిపోతుంటుంది. దాన్ని నిర్లక్ష్యం చేస్తే మరికొన్ని సమస్యలు ఎదురవుతాయి. అలాకాకుండా చినుకుల కాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

08/06/2019 - 20:30

ఎన్ని క్రీములు వాడుతున్నా చర్మాన్ని సహజంగా మెరిపిస్తేనే అందం. అలాంటి మెరుపు సొంతం కావాలంటే చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాలి.

Pages