ఐడియా

చలికాలంలో మేకప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శీతాకాలంలో ముఖ చర్మాన్ని అతి జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే పగిలిన చర్మంపై ఎటువంటి మేకప్ అయినా ముఖంపై సరిగ్గా అమరదు. అందుకే ముఖంపై క్రమం తప్పకుండా మాయిశ్చరైజర్ పూస్తుంటే చర్మం పగుళ్లు లేకుండా అందంగా ఉంటుంది.
* మేకప్‌కు ముందు ముఖాన్ని మృదువైన లిక్విడ్ సోప్‌తో శుభ్రం చేసుకోవాలి. లేదంటే సున్నిపిండితో ముఖాన్ని కడుక్కోవాలి. తరువాత చర్మం తడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
* ఆరాక చర్మపురంగుకి, తత్త్వానికీ నప్పే షేడ్‌లో ఫౌండేషన్‌ను వేసుకోవాలి. పదినిముషాలు పాటు పూర్తిగా ఆరిన తరువాత మేకప్‌ను మొదలుపెట్టాలి.
* శీతాకాలంలో కనురెప్పలపై స్మోకీ లుక్ చాలా బాగుంటుంది. కనురెప్పలపైన స్మోకీ లుక్ కోసం ముదురురంగులో పెన్సిల్ లైనింగ్ వేసుకోవాలి.
* ముందుగా పెదాలపై ముదురు వర్ణంలో ఉన్న లిప్‌స్టిక్‌ను బేస్‌గా వేసుకోవాలి. దానిపై మీరు ఏ రంగు వేసుకోవాలనుకున్నారో ఆ రంగును వాడాలి. అప్పుడే పెదాలు అందంగా, తీర్చిదిద్దినట్లుంటాయి. అదీకాక లిప్‌స్టిక్ చాలాసేపటివరకు తాజాగా ఉంటుంది.
* ఈ కాలంలో ముఖానికి బేస్‌గా న్యూట్రల్ షేడ్స్‌ను మాత్రమే వాడాలి. ముదురు వర్ణాలు వాడినట్లైతే ముఖం పొడిబారినట్లుగా కనిపిస్తుంది. ఈ వాతావరణంలో వీలైనంత ఆయిలీగా ఉంటేనే ముఖం మెరుస్తున్నట్లుంది.