ఐడియా
అసిడిటీ తగ్గించడానికి చిట్కాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అజీర్తి, అసిడిటీ, కడుపునొప్పితో బాధపడేవారు చాలామంది ఉంటారు. అసిడిటీ కారణంగా గుండెలో మంట కూడా వస్తుంది. ఆహారం జీర్ణం కాకపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. అవి మనం తీసుకునే ఆహారం, సమయంపై ఆధారపడి ఉంటాయి. వేళ తప్పించి భోజనం చేయడం, మద్యపానం, ధూమపానం, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు తదితర కారణాల వల్ల కూడా కొందరిలో అజీర్ణ సమస్య వస్తుంటుంది. మనం జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఒకవేళ మీరు ఆహారం జీర్ణం కాక ఇబ్బంది పడుతుంటే ఈ చిట్కాలను పాటించాలి. వెంటనే ఉపశమనం పొందవచ్చు.
* అల్లం అజీర్ణ సమస్యకు చక్కటి మందు. ఒక గ్లాసు నీళ్లలో తురిమిన అల్లం ముక్కలు వేసి బాగా వేడిచేయాలి. ఆ తర్వాత వడపోసి నీటిని చల్లారక ముందే తాగేయాలి. అప్పుడు ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.
* అల్లం ముక్కలను దంచి ఆ రసాన్ని సేకరించి కొద్దిగా నీళ్లు కలుపుకుని తాగినా మంచి ప్రయోజనం ఉంటుంది.
* ఒక గ్లాసు నీళ్లలో కొద్దిగా బేకింగ్ సోడా వేసి తాగితే కూడా తక్షణ ఉపశమనం పొందవచ్చు. నీటికి బదులుగా తేనె, నిమ్మరసాన్ని కూడా ఉపయోగించవచ్చు.
*