S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

03/16/2020 - 23:33

ఆధునిక తెలుగు కవిత్వంలో వచన కవితది అగ్రస్థానం. అది గురజాడ నుండి, శ్రీనుండి, శేషేంద్ర నండి, తిలక్ నుండి, సినారె నుండి, ఆరుద్ర నండి, కుందూర్తి నుండి నేటి ఆధునిక కవి వరకు కాలముతోపాటు ముందుకు సాగుతూ సుసంపన్నమవుతూ వచ్చింది. కాలక్రమంలో నవ్యతను, నాణ్యతను, గాఢతను, క్లుప్తతను సంతరించుకొని కూడా ముందుకు నడిచింది. తన రూప నిర్మాణాన్ని కూడా మార్పు చేసుకుంటూ వచ్చింది.

03/09/2020 - 23:19

రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ అనగానే చాలామందికి ఆయన రాసిన ‘రాయలనాటి రసికత, నిగమశర్మ అక్కడ, త్యాగయ్యగారి నాధా సుధారసము’ మొదలైన వ్యాసాలు స్ఫురణకు వస్తాయి. ఆయన స్వాతంత్య్ర పూర్వం నాటి మైసూరు జీవితంలోని సుఖ సంతోషాలు, కవి పండిత గాయకుల దివ్యజ్ఞాపకాలు గుర్తుకువస్తాయి. అనంతకృష్ణులను పాఠకులు ఒక రస ఋషిగా భావించడం పరిపాటి.

03/02/2020 - 23:05

ఆంధ్ర పురాణ కర్త, ప్రముఖ కవి పండితులు కీ.శే.మధునాపంతుల సత్యనారాయణ శాస్ర్తీగారి శత జయంతి సమాపనోత్సవ సభ మార్చి 5న,కాకినాడ దగ్గర పల్లిపాలెము గ్రామంలో జరుగనుంది. ఈ సందర్భంగా వారు సంపాదకునిగా 1939లో వెలువడిన ‘ఆంధ్రి’ సారస్వత పత్రికా విశేషాలతో కూడిన
వ్యాసం పాఠకులకు ప్రత్యేకం.
*

02/24/2020 - 23:57

ఆయన ఓ మహామనిషి, సౌజన్యమూర్తి. తెలుగు సాహితీ గగనంలో మెరుపులు చిందించిన అభ్యుదయ ధృవతార అగ్రశ్రేణి విమర్శకుడిగా సాధికార విమర్శలు చేస్తూ, రాస్తూ ఆధునిక తెలుగు సాహిత్య పత్రంపై తనదైన సంతకం చేసిన మహోన్నత సాహితీవేత్త. ప్రగతిశీల మార్గంలో పయనించిన గొప్ప మేధావి, సాహితీ సంచారయోధుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి. గజళ్ళకు ఆద్యుడు, పూజ్యుడు.

02/17/2020 - 22:54

బహుముఖ ప్రజ్ఞావంతులకు తెలుగునాట కొదవలేదనే మాట నిజమే! తెలుగునాట సంఘ సంస్కరణ ఉద్యమానికి ఒరవడి దిద్దిన ‘గద్య తిక్కన’ కందుకూరి వీరేశలింగం కవి- నవలాకారుడు- ప్రహసనకర్త- పత్రికా సంపాదకుడు- విద్యాలయాల నిర్మాత, నిర్వాహకుడూనూ.

02/10/2020 - 23:49

తెలుగు సాహిత్య రంగం విభిన్న ప్రక్రియల సమాహారం. కవిత్వాన్ని తీసుకున్నట్లయితే- జనరంజకమై, నిరంతర ప్రవాహంలో సాగిపోయే ప్రక్రియ వచన కవిత్వం. వర్తమానంలో కవుల కలాల ద్వారా కాంతులు వెదజల్లుతున్న మినీ కవిత, నానీ, నానో, వ్యంజకాలు వంటి ప్రక్రియలన్నింటికి పెద్ద దిక్కు వచన కవిత్వం. ఈ కవితా ప్రక్రియలన్నీ గోదావరి నుండి విడివిడి ప్రవహిస్తున్న పాయలు వంటివి.

02/03/2020 - 22:42

ఒక్క సంగీతమేదో పాడునట్లు
భాషించినపుడును విన్పించు భాష
విస్పష్టముగ నెల్ల విన్పించునట్లు
స్పష్టోచ్చారణంబున నొనరు భాష
రసభావముల సమర్ణ శక్తియందున
నమర భాషకు దీటైన భాష
జీవులలోనున్న చేవయంతయు చమ
త్కృతి పల్కులన్ సమర్పించు భాష
భాషలొక పది తెలిసిన ప్రభువు చూచి
భాషయన నిద్దియని చెప్పబడిన భాష
తనర ఛందస్సులోని యందమ్ము నడక

01/27/2020 - 23:31

పునర్జీవిత శ్రీనాథః అపరాంధ్రీ సరస్వతీ
రాశీ భూతాత్మ విశ్వాసః కృష్ణ శాస్ర్తీర్మహాకవిః

01/20/2020 - 22:16

తెలుగదేలయన్నదేశంబుతెలుగేను
దెలుగువల్లభుండదెలుగుకండ
యెల్లనృపులుగొలువనెరుగవేబాసాడి
దేశభాషలందు దెలుగు లెస్స.
ఆముక్తమాల్యద. ఆ.1. ప. 1
1. వేంకటేశ్వరస్తుతి. చిదంబరకవి.
(క్రీ. శ. 1586- 1614)
200శ్లోకాలు. లఘుకావ్యం.

01/13/2020 - 22:22

70వ దశకంలో ‘మహాస్థ్రానానికి’ సరిజోడైన ‘డమరుధ్వని’ గీతాలతో తెలుగు సాహి త్య లోకాన ప్రభంజనం సృష్టించిన ప్రముఖ ఉత్తరాంధ్ర అభ్యుదయ కవి ‘సీరపాణి’ని ఇటీవల వారి స్వగృహంలో నేను కలవడం జరిగింది. అతనితో నేను మాట్లాడిన సందర్భంలో, గతంలో కొనే్నళ్లపాటు చాగంటి సోమయాజులు (చా.సో)గారు, మీరు కలిసి ‘అరసం’ (అభ్యుదయ రచయితల సంఘం) విజయనగరంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు కదా! వారితో మీ పరిచయం, అనుభవం ఎలాంటిది?

Pages