మెయిన్ ఫీచర్

అపర శ్రీనాథులు.. కవి సార్వభౌములు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పునర్జీవిత శ్రీనాథః అపరాంధ్రీ సరస్వతీ
రాశీ భూతాత్మ విశ్వాసః కృష్ణ శాస్ర్తీర్మహాకవిః
శ్రీనాథుని వలె కవి సార్వభౌమ, తిక్కన వలె కవి బ్రహ్మ, రామాయణ మూలాంధ్రీకరణతో ప్రసన్న వాల్మీకి, భారత భాగవతాంధ్రీకరణలతో అభినవ వ్యాస, వేదవేదాంగాల ఔపాసనతో వేద విద్యా విశారద వంటి సార్థక బిరుదాంకితులైన శ్రీశ్రీ పాద కృష్ణమూర్తి శాస్ర్తీగారు ప్రాచీనాంధ్ర కవులల్లో ఒకరు. ద్విశతాధిక గ్రంథ కర్తగానే కాక వ్యవసాయం, అశ్వచాలనం, చతురంగం, యజ్ఞ్ధ్వార్యణ, అవధాన ప్రక్రియల్లో మరియు పలు పత్రికా సంపాదకునిగా ప్రచురణకర్తగా నిష్ణాతులనిపించుకున్న వీరు, నాటి కవి పుంగవుల అందరిలో తనదైన ముద్ర ప్రదర్శించి, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేర్గాంచి, నాటి బ్రిటీష్ ప్రభుత్వంచే మహా మహోపాధ్యాయ బిరుదాంకితులైన ఏకైక కవిరాజు.
శ్రీకృష్ణ వరప్రసాదిగా 1899, అక్టోబరు 29న జన్మించి రాజమహేంద్రవరంలో స్థిర నివాసం ఏర్పరుచుకుని నిరాటంకంగా తమ 94వ ఏట స్వర్గస్తులయ్యేంత వరకు స్వహస్తాలతో రచనలు సాగించి సంస్కృతాంధ్ర పండితులైన శ్రీశ్రీ పాద రామాయణ, మహాభారత, భాగవతాది కావ్యైతిహాసాలను మూలానుసారం తెనుగించిన ఏకైక కవి వర్యులు. వారి ప్రముఖ గ్రంథాలలో నాడు శ్రీహర్ష/ శ్రీనాథ ప్రణీత నైషదీయం వంటి ప్రబంధములు, నాటకములు, విమర్శనములు మున్నగునవి ఎన్నో ఉన్నాయి. వారు రచించిన పద్య, గద్య నాటకం బొబ్బిలి యుద్ధం బహుళ ప్రజాదరణ పొంది అనేక వేల మార్లు ఆంధ్రేతర ప్రదేశాల్లో కూడా ప్రదర్శించబడింది.
వారి సుదర్శన భవనమునకు విచ్చేసిన అనేకమంది ప్రముఖులల్లో డా. రాధాకృష్ణన్, శ్రీ భీమసేన్ సచార్, శ్రీ శృంగేరి పీఠాధిపతి మొదలైనవారిని నా చిన్ననాట చూసిన జ్ఞాపకాలు మరుపురానివి. ప్రఖ్యాత తిరుపతి వేంకట కవులల్లో ప్రముఖులైన శ్రీ చెళ్లపిళ్ళ వేంకట శాస్ర్తీగారికి కూడా గురువర్యులై కవితాలోకానికి ఆదర్శంగా నిలిచిన శ్రీ శ్రీపాద, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆజన్మాంత ఆస్థాన కవిగా గౌరవం పొందిన ఏకైక కవీశ్వరులు. అల్లసారి పెద్దన తరువాత సువర్ణ గండపెండేర సత్కారం పొందిన శ్రీ పాద కాలికి 1933 సం॥ నాటి సభలో దానిని అలంకరింపచేస్తూ శ్రీచెళ్ళపిళ్ళ ఆశువుగా
‘అనితర సాధ్యమయిన భారతాన్వయ పుణ్య చరిత్ర తెల్గుమా
సనువెలయించి నార్ముగురు సత్కవులీ కవి సార్వభౌముడో!
తన యొక చేతిమీదిగనే తత్కృతి నిర్వహణంబొనర్చె మిం
చెను గని గండపెండేరమొనర్చి చేతికొసంగుదు మొక్కొ ! కాలికో! ’
అని ప్రస్తుతించారు.
తదుపరి వారి అసమాన కవితా విజయభేరితో మణికిరీట ప్రదానం, గజారోహణం, సువర్ణ పుష్పారాధన వంటి అనేక సత్కారాలను, బిరుదులను, ప్రశంసలను ప్రజల, ప్రభుత్వ మరియు రాజాస్థానాల నుండి పొందిన శ్రీ శాస్ర్తీగారు ఇంతవరకు ఏ కవి వర్యులూ చేయనివిధంగా తమకు లభించిన అమూల్యములైన మహా మహోపాధ్యాయ ఆస్థాకవ్యాది పతకములతో సహా గౌరవ పురస్కారాలన్నింటినీ ఆంధ్ర విశ్వవిద్యాలయమునకు సమర్పించాలని ఆశువుగా ఆదేశించిన ఏకైక కవి పుంగవులు. తదనుగుణంగా వారి మనుమలు మరియువారసులు అయిన శ్రీ కల్లూరి సత్యనారాయణ మూర్తి, వారి సతీమణి శ్రీమతి సీతామహాలక్ష్మి అవిశ్రాంతంగా శ్రీపాద జీవిత కవితా విశేషాలను అనేక జయంతి సభల ద్వారా కవి పండితుల ప్రోత్సాహంతో వ్యాప్తి చేయడానికి కృషి చేసి శ్రీపాద గౌరవ పురస్కారాలన్నింటిని ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సమర్పించారు. ప్రస్తుతం ఇవన్నీ విశాఖ మ్యూజియంలో నిక్షిప్తమై శ్రీపాద జన్మదినాల్లో ప్రజలు సందర్శనార్థం ప్రదర్శించబడుతున్నాయి.
‘‘గడియకు నూరు పద్యములు కల్పన చేయగా జాలినెంతయో
గడు నవధానముల్ సలుపు వాడనయై కవిరాజ నామమునే బడసితి’’ అని ఘోషించి
‘‘నేనె కాని కవిత్వ మెవ్వరును సంధింపంగ లేరన్న చందానంతఒతత’’ అని అపర శ్రీనాథులై
‘‘రాజై రాజుల నెల్లరంగెల్చి రాష్ట్రం బేలి బ్రహ్మర్షియై... వేంకటాధ్వరి సుతుండప్పు కవిబ్రహ్మయై’’ అని శాసించి
‘‘ఒక నన్నయ్యయు ఒక తిక్కన యమాత్యుండొక యెఱ్ఱన తా
తానొక శ్రీనాథుడు నొక్క పోతనయు నీయుర్విం బెడంబాసి
సకలంకంబుగ గృష్ణమూర్త మహనీయాకారము దాల్చి యాం
ధ్రికి సేవల్ పొనరించు రంచు దలతున్ శ్రీపాద వంశోన్నతున్’’
అని ప్రస్తుతించడిన శ్రీశ్రీ పాద కవితాఝరిని ప్రత్యక్షముగా అనుభవించిన శ్రీపాద అభిమానులు, శిష్యులు కనుమరుగవుట వలన వారి జీవిత కవితా విశేషాలను వారి జన్మదిన గ్రంథ విశే్లషణా కార్యక్రమముల ద్వారా వ్యాప్తి చేయడానికి గత నాలుగేండ్లుగా సాహితీవేత్తలతో అణువంత కృషి జరుగతోంది. శ్రీపాద ప్రదౌహిత్రుడనైనా సమర్థతతో పండిత పుత్రః నానుడి ననుసరించి నేను మన సహాధ్యాయులకు, వారి మితృబృందాలకు మన ఆంధ్ర విశ్వవిద్యాలయ కళాప్రపూర్ణ బిరుదాంకితులైన శ్రీ శ్రీపాద కవిసార్వ భౌముల సూక్ష్మ పరిచయ ప్రయాసే ఈ వ్యాస రచనా ధ్యేయం.

- కల్లూరి శ్రీరామ్