S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/22/2019 - 17:19

హైదరాబాద్: టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులను సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. మహమూద్‌ అలీ, ఎగ్గె మల్లేశం, శేరి సుభాష్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌ టీఆర్ఎస్ నుంచి కాగా.. మరో సీటు మిత్రపక్షమైన ఎంఐఎంకు కేటాయించారు.

02/22/2019 - 17:04

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ శుక్రవారంనాడు కన్నుమూశారు. గురువారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురికాగా కుటుంబ సభ్యులు ఆయనను గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఈ రోజు కన్నుమూశారు. 30 సంవత్సరాలకు పైగా చిత్రపరిశ్రమకు సేవలందించిన ఆయన ఎన్నో విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించారు. తొలి చిత్రం ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని సాధించింది.

02/22/2019 - 13:17

హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావు శుక్రవారం శాసనసభలో 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తాత్కాలిక బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఓ ముఖ్యమంత్రి బడ్జెట్‌ ప్రవేశపెట్టనుండటం తెలంగాణలో ఇదే తొలిసారి. ఆర్థిక శాఖ కూడా కేసీఆర్‌ వద్ద ఉండటంతో ఆయనే సభలో 2018-19 వ్యయానికి సంబంధించి అనుబంధ పద్దులను, 2019-20 సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

02/22/2019 - 12:48

హైదరాబాద్: పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఎర్రబెల్లి దయాకరరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తనకు పెద్ద బాధ్యత అప్పజెప్పారని, తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన పంచాయతీరాజ్ చట్టంతో గ్రామాల రూపురేఖలు మారునున్నాయని అన్నారు.

02/22/2019 - 12:41

హైదరాబాద్: జమ్మూకాశ్మీర్‌లోని పూల్వామా ఉగ్రదాడిలో అమరులైన ప్రతి జవాను కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.25 లక్షల సాయం ప్రకటించింది. శాసనసభళో జవాన్ల మృతికి నివాళులర్పిస్తూ సంతాప తీర్మాణాన్ని ప్రవేశపెట్టిన కేసీఆర్ మాట్లాడుతూ ఈ దాడి అత్యంత హేయమైనదని, ఇది దేశం మీద జరిగిన దాడిగా భావిస్తున్నట్లు తెలిపారు.

02/22/2019 - 12:40

హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు శుక్రవారంనాడు ప్రారంభమయ్యాయి. సభను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించిన వెంటనే పూల్వామా దాడిలో అమరులైన జవాన్లకు నివాళులర్పిస్తూ సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. జీఎస్టీ చట్టానికి తీసుకువచ్చిన సవరణ బిల్లును ప్రవేశపెట్టారు.

02/22/2019 - 04:27

ఖమ్మం, ఫిబ్రవరి 21: ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి కేంద్రాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తున్నారు. గత ఎన్నికలకు ముందు నేతల హమీతో ఆందోళనలకు విరామం ఇచ్చిన ఆ ప్రాంత వాసులు ఈ నెల 22వ తేది నుండి ఆందోళనలను ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా 22వ తేదిన సత్తుపల్లి బంద్‌కు పిలుపునివ్వటంతో పాటు 23న ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

02/22/2019 - 04:02

ఆత్మకూరు(ఎం), ఫిబ్రవరి 21: ఆమెరికాలోని ఫ్లొరిడాలో దుండగుడి తుపాకీ కాల్పులకు యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని ఆత్మకూర్ (ఎం) మండలం రహీంఖాన్‌పేట గ్రామానికి చెందిన కొత్త గోవర్ధన్‌రెడ్డి (42) మృత్యువాత పడ్డాడు.

02/22/2019 - 03:59

హైదరాబాద్, ఫిబ్రవరి 21: తెలంగాణ శాసనమండలికి ఐదుగురు ఎమ్మెల్సీలను ఎన్నుకునేందుకు గురువారం నోటిఫికేషన్ జారీ అయింది. ఎన్నికల కమిషన్ ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా పనిచేస్తున్న పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మహ్మద్ అలీ షబ్బీర్, టి. సంతోష్‌కుమార్, మహమ్మద్ సలీం, మహమూద్ అలీల పదవీ కాలం 2019 మార్చి 29 వరకు ముగుస్తుంది. ఈలోగా ఎన్నికలు జరిగితే కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు.

02/21/2019 - 17:35

హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ భేటీ జరిగింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తొలి మంత్రివర్గ సమావేశం ఇది. ఈ భేటీలో బడ్జెట్‌కు, పంచాయతీ రాజ్ సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలుపనున్నది.

Pages