తెలంగాణ

కరోనాను మించిన వైరస్ పీడిస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఏప్రిల్ 13: విరుగుడు లేని మహమ్మారి కరోనాను కట్టడి చేసేందుకు యావత్ ప్రపంచం ఏకమై పని చేస్తుంటే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు పనికట్టుని చేస్తున్న విమర్శలను చూస్తుంటే కరోనాను మించిన వైరస్ ఏదో ఆవహించేదేమో అన్న అనుమానం కలుగుతుందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు ఎద్దేవా చేశారు. సోమవారం సాయంత్రం సంగారెడ్డి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బీజేపీ, కాంగ్రెస్‌లు చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూ విపత్కర పరిస్థితుల్లో విమర్శలకు దిగడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా నివారణకు తీసుకునే చర్యల మాదిరిగానే ప్రతిపక్ష పార్టీలను ప్రజలు ఐసోలేషన్, క్వారంటైన్‌లకు పంపించారని, ఆ పార్టీల భవిషత్తును ప్రజలే నిర్ణయిస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 6 లక్షల మంది వలస కార్మికులకు సహాయం అందిస్తుందని, ఆయా పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చేపట్టిన చర్యలు ఏమిటని నిలదీశారు. ఇప్పటి వరకు 87 శాతం మంది రేషన్ దుకాణాల్లో బియ్యం తీసుకున్నారని వెల్లడించారు. డిమాండ్ ఉన్న చోట్లకు అదనపు కోటాను పంపిస్తూ లోటురాకుండా చర్యలు చేపట్టామన్నారు. రూ.1500 జమ చేసేందుకు 87.55 లక్షల మంది బ్యాంకు ఖాతాల నంబర్లు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 95 శాతం మేరకు నంబర్ల సేకరణ పూర్తయిందని వివరించారు. కోవిడ్-19ను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.3147 కోట్లు ఖర్చు పెట్టినట్లు స్పష్టం చేశారు. ప్రాణాలను పణంగా పెట్టి నిరంతరం పని చేస్తున్న వైద్య, పారిశుద్ధ్య రంగాల సిబ్బందికి ప్రోత్సాహకాలను అందిస్తామని మంత్రి హరీష్ పునరుద్ఘాటించారు. సమావేశంలో ఎంపీలు ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.