S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/16/2019 - 23:00

హైదరాబాద్, ఆగస్టు 16: తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది జూలై నెలలో సాధారణ వర్షపాతం 373.4 మి.మీకు 302.3 మి.మీ వర్షపాతం నమోదైనట్లు భూగర్భ జల శాఖ ప్రకటించింది. దాదాపు 19 శాతం తక్కువగా వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. మొత్తం 33 జిల్లాల్లో 16 జిల్లాల్లో సాధారణ వర్షపాతం ప్లస్ 19శాతం నుంచి మైనస్ 19 శాతం వరకు నమోదైంది. ఈ జిల్లాల్లో 236 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.

08/16/2019 - 23:00

హైదరాబాద్, ఆగస్టు 16: ఆరోగ్య శ్రీ కింద వెంటనే ఆసుపత్రి యాజమాన్యాలకు రాష్ట్రప్రభుత్వం బకాయిలను చెల్లించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చెశారు. ఆసుపత్రుల యాజమాన్యాలు రూ.1500 కోట్లు బకాయిలు ఉన్నాయని చెబుతుంటే, రాష్ట్రప్రభుత్వం తరఫున ఉన్న ఆరోగ్యశ్రీ ట్రస్టు మాత్రం రూ.800 కోట్లు బకాయిలని చెబుతోందన్నారు. ఈ వ్యత్యాసం రూ.700 కోట్లు ఉందన్నారు.

08/16/2019 - 22:59

హైదరాబాద్, ఆగస్టు 16: నల్గొండ జిల్లా లంబాపూర్‌లో యురోనియం తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డిలు వేర్వేరు ప్రకటనల్లో తీవ్రంగా ఖండించారు.

08/16/2019 - 22:59

హైదరాబాద్, ఆగస్టు 16: తెలంగాణలో పర్యావరణ విధ్వంసానికి తోడ్పడే యురేనియం నిక్షేపాల తవ్వకాలకు అనుమతులు నిలిపివేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. యురేనియం తవ్వకాల వల్ల చెంచుల జీవితాలను చిన్నాభిన్నం చేసినట్లవుతుందన్నారు.

08/16/2019 - 22:58

హైదరాబాద్, ఆగస్టు 16: తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో జలాశయాల్లోకి భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది. దీంతో రాష్ట్ర మొత్తంగా ఉన్న జలాశయాల్లోకి చేప పిల్లలను వదిలే కార్యక్రమానికి జిల్లా మంత్రులు హాజరయ్యారు. తెలంగాణకు అవసరమైన చేపల పెంపకాలు సొంత రాష్ట్రంలో ఉండాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కోరిక నేరవేరుతోంది.

08/16/2019 - 22:58

హైదరాబాద్, ఆగస్టు 16: ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో గందరగోళం కారణంగా 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు దారితీసిన అంశంపై బీజేపీ సహా పలు రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై రాష్టప్రతి భవన్ కేంద్ర హోం శాఖ వివరణ కోరింది. భవ్య అనే విద్యార్థిని పరీక్షల్లో పాసైనా ఆమె ఫెయిలైనట్టు ఫలితాలు ప్రకటించడంతో మొదలైన ఇంటర్ పరీక్ష ఫలితాల గందరగోళం అనేక వివాదాలకు దారితీసింది.

08/16/2019 - 22:56

హైదరాబాద్, ఆగస్టు 16: దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 20వ తేదీన భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు టీపీసీసీ ప్రణాళికను ఖరారు చేసింది. ఈ మేరకు ఎఐసీసీ కూడా ఆదేశాలు జారీ చేసింది.

08/16/2019 - 22:56

హైదరాబాద్, ఆగస్టు 16: తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో 3,86,864 సీట్లకు గానూ 1,89,500 సీట్లు భర్తీ అయ్యాయి. 87,645 మంది అబ్బాయిలు, 1,01,855 మంది అమ్మాయిలు డిగ్రీ కోర్సులో చేరారు.దాంతో సుమారు రెండు లక్షల సీట్లు భర్తీ కాలేదు. తాజాగా స్పెషల్ డ్రైవ్‌లో సీట్లు పొందిన వారికి మరో రెండు రోజుల పాటు గడువు పొడిగించినట్టు కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు.

08/16/2019 - 05:46

నల్లగొండ, ఆగస్టు 15: నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి కృష్ణమ్మ పరవళ్ల జోరు గురువారం కూడా కొనసాగింది. వరుసగా నాల్గవ రోజు కూడా సాగర్ ప్రాజెక్టు మొత్తం 26 క్రస్ట్‌గేట్ల నుంచి నీటి విడుదల కొనసాగించగా దిగువన పులిచింతల, ప్రకాశం బ్యారేజ్‌ల నుంచి కృష్ణమ్మ సముద్రంలో కలుస్తోంది.

08/16/2019 - 05:44

మేళ్లచెర్వు : నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి పులిచింతల ప్రాజెక్టుకు నాల్గవ రోజు కూడా ఉద్ధృతంగా వరద నీరు వచ్చి చేరుతోంది. గురువారం సాయంత్రం నాటికి 39 టీఎంసీల నీరు నిలువ ఉంది. 175 అడుగులకు గాను 169 అడుగుల మేర నీటిని నిల్వచేశారు. ఇన్‌ఫ్లోగా 5.86 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా ఔట్‌ఫ్లోగా 6.41 లక్షల క్యూసెక్కుల నీటిని 22 గేట్లద్వారా దిగువ భాగానికి విడుదల చేస్తున్నారు.

Pages