S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/15/2019 - 06:43

హైదరాబాద్, ఆగస్టు 14: తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకుందని, ఇష్టం వచ్చినట్లు అప్పులు తెస్తూ రాష్ట్ర ఖజనానా దివాళా తీశారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన ఇక్కడ సచివాలయంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును కలిశారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ అవినీతి రాజ్యమేలుతోందని, సంక్షేమాన్ని అటకెక్కించారన్నారు.

08/15/2019 - 06:42

హైదరాబాద్, ఆగస్టు 14: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు జ్వరాల బారినపడి, విపరీతమైన బాధలుపడుతున్నారని, ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సదుపాయాలు శిథిలావస్థకు చేరుకున్నాయని సీఎల్‌పీ నేత భట్టివిక్రమార్క విమర్శించారు.

08/15/2019 - 06:41

హైదరాబాద్, ఆగస్టు 14: భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సమరయోధుల త్యాగం వల్లనే భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని గుర్తు చేశారు. త్యాగమూర్తులను స్మరించుకుంటూ, దేశాభివృద్ధికి బాటలు వేసుకుందామని పిలుపు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు.

08/15/2019 - 06:40

హైదరాబాద్, ఆగస్టు 14: తెలంగాణలో దోస్త్ ద్వారా మరో 16911 మందికి డిగ్రీ సీట్లు కేటాయించినట్టు కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు. స్పెషల్ డ్రైవ్ లో 17490 మంది రిజిస్టర్ చేసుకున్నారని, అందులో 16076 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారని అన్నారు. గతంలో కన్ఫర్మ్ చేసుకున్న వారు 1414 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారని, వీరందిరలో 16911 మందికి డిగ్రీ కాలేజీల్లో సీట్లు కేటాయించామని అన్నారు.

08/15/2019 - 06:39

హైదరాబాద్, ఆగస్టు 14: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మానవత్వంతో చూపిన చొరవకు సాయిరామ్ అనే నాలుగవ తరగతి చదివే బాలుడు అంగవైకల్యాన్ని జయించాడు. గోదావరిఖని చెందిన సాయిరామ్ అనే బాలుడికి చిన్నప్పుడై పోలియో వల్ల కాళ్లు వంకరపోయి నడవలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు.

08/15/2019 - 06:35

హైదరాబాద్, ఆగస్టు 14: తెలంగాణ గురుకులాల్లో 16 సబ్జెక్టుల్లో 465 మంది డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినట్టు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. 16 సబ్జెక్టుల్లో గత ఏడాది ఆగస్టు 2న ఇచ్చిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఈ ఎంపిక జరిగిందని చెప్పారు. ఎంపికైన అభ్యర్ధుల వివరాలను రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్ పోర్టల్‌లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.

08/15/2019 - 06:34

హైదరాబాద్, ఆగస్టు 14: కరీంనగర్ జిల్లా స్వాతంత్య్ర సమరయోధుల ట్రస్టు ఆధ్వర్యంలో తిమ్మాపూర్‌లో నిర్వహిస్తున్న మానసిక వికలాంగుల కేంద్రానికి సరిపడా నిధులను మంజూరు చేయాలని ట్రస్టు చైర్మన్, సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెతడ్డిని కోరారు . ఈ మేరకు ఆయన ఒక విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.

08/14/2019 - 06:30

హైదరాబాద్, ఆగస్టు 13: హార్వర్డు మోడల్ ఐక్యరాజ్యసమితి 9 వ సదస్సును హైదరాబాద్‌లో ఈ నెల 15వ తేదీ నుండి 18వ తేదీ వరకూ నిర్వహించనున్నారు.వరల్డ్ వ్యూ ఎడ్యుకేషన్, హార్వర్డు ఇంటర్నేషనల్ రిలేషన్స్ కౌన్సిల్ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. భారత్‌తో పాటు పలు దేశాలకు చెందిన బాలలు ఈ సదస్సులో పాల్గొంటారు.

08/14/2019 - 06:30

హైదరాబాద్, ఆగస్టు 13: సీబీఎస్‌ఈ విద్యార్థుల పరీక్ష ఫీజులు తగ్గించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎల్‌మూర్తి, రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు డిమాండ్ చేశారు.

08/14/2019 - 06:29

హైదరాబాద్, ఆగస్టు 13: ఆంధ్రప్రదేశ్ విభజన కాంగ్రెస్ నాయకత్వం చేసిన చారిత్రాత్మక తప్పిదమని కాంగ్రెస్ సీనియర్ నేత మణి శంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తెలంగాణ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు ఖండించారు. మణి శంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు స్పందించాలన్నారు.

Pages