తెలంగాణ

‘ఎన్‌పీఆర్‌పై జీవో ఇవ్వండి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 17: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ఆమోదించడాన్ని రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక, అలయెన్స్ అగనెస్ట్ సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీలు స్వాగతించాయి. కేవలం తీర్మానంతో సరిపోదని ఎన్‌పీఆర్‌ను రాష్ట్రంలో అమలు చేయబోమని కేరళ తరహాలు ప్రభుత్వం జీవో జారీ చేయాలని అధికారులకు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంగళవారం నాడు మఖ్దూం భవన్‌లో సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఐ నేత సయ్యద్ అజీజ్ పాషా, సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, న్యూ డెముక్రసీ నేత రమాదేవి, ప్రొఫెసర్ పిఎల్ విశే్వశ్వరరావు, అబ్దుల్ జబ్బార్, గోవర్థన్, డాక్టర్ సుధాకర్ తదితరులు పాత్రికేయులతో మాట్లాడారు. ఏప్రిల్‌లో జరిగే జనగణనలో ఎన్‌పీఆర్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వరాదని ఇంటింటి ప్రచారం నిర్వహించనున్నట్టు వారు చెప్పారు. మార్చి 23న భగత్‌సింగ్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లో సభ నిర్వహించనున్నట్టు చెప్పారు. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే ఈ సభ నిర్వహిస్తామని చెప్పారు. దేశంలో గత 76 సంవత్సరాలుగా కొనసాగిన లౌకిక వ్యవస్థను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దెబ్బతీస్తోందని , తమ చిచ్చుతో దేశం రగిలిపోతోందని అన్నారు.
కుల మతాలకు ఇబ్బంది కలగని రీతిలో ఎన్‌పీఆర్ ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానంలో పేర్కొందని అన్నారు. కేరళ తరహాలో ఎన్‌పీఆర్‌ను అమలు చేయబోమని ప్రకటించాలని అన్నారు.