S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/17/2019 - 13:09

హైదరాబాద్:యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాదాద్రి చేరుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. తొలుత బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొండచుట్టూ రింగ్‌రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు.

08/17/2019 - 00:27

బోయినపల్లి, ఆగస్టు 16 : తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టు లకు గుండెకాయ లాంటిది మిడ్ మానేరు ప్రాజెక్ట్ అని దీని నిర్మాణంలో ముంపునకు గురైన నిర్వాసితులకు న్యాయంగా రావాల్సిన పరిహారం బాధితులకు అందేవిధంగా తగు చర్యలు తీసుకుంటానని, ముఖ్యమంత్రి కేసీఆర్ బాధితులకు హామీనిచ్చారు.

08/17/2019 - 00:27

హైదరాబాద్, ఆగస్టు 16: మహానగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందాలంటే నగరంలోని ప్రతి బస్తీలోనూ అన్ని రకాల వౌలిక వసతులు కల్పిస్తేనే విశ్వనగరం సాధ్యమవుతోందని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. శుక్రవారం సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ ఆడిటోరియంలో కార్పెడ్ ఆధ్వర్యంలో ‘అప్పా హైదరాబాద్-నీరు,పారిశుద్ధ్యం, పరిశుభ్రత’ అనే అంశంపై నిర్వహించిన వర్క్‌షాప్‌కు ఆయన ముఖ్య అతిధిగా విచ్చేశారు.

08/17/2019 - 00:04

నల్లగొండ, ఆగస్టు 16: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శనానికి, ఆలయ పునర్ నిర్మాణ పనులను పరిశీలించేందుకు శనివారం యాదాద్రికి రానున్నారు. ఉదయం 10 గంటలకు సీఎం కేసీఆర్ యాదాద్రికి చేరుకోనుండగా ఆయన వెంట దేవాదాయశాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి కూడా రానున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.

08/17/2019 - 00:04

గద్వాల, ఆగస్టు 16: ఎగువ ప్రాంతంలోని ఆల్మటి, నారాయణపూర్ జలాశయాల నుంచి జూరాలకు వస్తున్న వరద నిలకడగా కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం నాటికి జూరాల జలాశయంలో 317.26 మీటర్లు, 7.20 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకోగా ఎగువ ప్రాంతం నుంచి జూరాల ప్రాజెక్టుకు 6.85 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.

08/17/2019 - 00:03

శ్రీరంగాపురం, ఆగస్టు 16: మత్య్సకారులు ఆర్థికంగా ఎదగాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేప పిల్లలను పంపిణీ చేయనున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం కలెక్టర్ శే్వతామహంతితో కలిసి వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండల కేంద్రంలోని రంగసముద్రం రిజర్వాయర్‌లో లక్షా 50 వేల చేప పిల్లలను వదిలారు.

08/17/2019 - 00:03

మేళ్లచెర్వు, ఆగస్టు 16: సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల పరిధిలోని పులిచింతల ప్రాజెక్టుకు భారీస్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది. శుక్రవారం సాయంత్రం నాటికి 45.77 టీఎంసీలకు గాను 39 టీఎంసీలకు నీరు నిల్వ చేరింది. ఔట్‌ఫ్లోగా 7.97 లక్షల క్యూసెక్కులు వస్తుండగా ఇన్‌ఫ్లోగా 7.33 లక్షల క్యూసెక్కులను 14 గేట్ల ద్వారా దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజ్‌కు నీటిని విడుదల చేస్తున్నారు.

08/17/2019 - 00:02

మహబూబ్‌నగర్, ఆగస్టు 16: కృష్ణానదికి భారీగా వరద వస్తున్నా కోయిల్‌సాగర్ ప్రాజెక్టును మాత్రం నింపడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయకట్టు రైతులతో కలిసి ఆందోళనకు దిగారు. ఆయకట్టు రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం హైదరాబాద్, రాయిచూర్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు.

08/17/2019 - 00:01

పటాన్‌చెరు, ఆగస్టు 16: తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన అంతం కావాలంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. తెలుగు రాష్ట్రాలలో బీజేపీ అధికారంలోకి వచ్చే వరకు ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

08/16/2019 - 23:59

వరంగల్, ఆగస్టు 16: ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. శుక్రవారం కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి చేప పిల్లలను గోదావరిలో వదిలారు.

Pages