తెలంగాణ

మహారాష్ట్ర సరిహద్దులు మూసేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులను ఐదారు రోజుల్లో మూసివేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రగతి భవన్‌లో శనివారం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, మహారాష్టల్రో కరోనా ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. మహారాష్టల్రోని ధర్మాబాద్, చంద్రాపూర్ తదితర ప్రాంతాల్లోని ప్రజలతో ఆదిలాబాద్, నిజామాబాద్ తదితర తెలంగాణ జిల్లాల ప్రజలకు బంధుత్వాలున్నాయని ఆయన గుర్తు చేశారు. ఈ కారణంగానే ప్రజల రాకపోకలు రెండు రాష్ట్రాల మధ్య ఎక్కువగా ఉంటాయన్నారు. కరోనా సోకిన వారు ఎవరైనా తమ బంధువులతో కలిసేందుకు రాష్ట్రంలోకి వస్తే కరోనా దిగుమతి అవుతుందన్నారు. అందువల్ల మహారాష్టల్రో కరోనా తీవ్రతను బట్టి తెలంగాణ-మహారాష్ట సరిహద్దులను మూసివేసే అంశంపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు.