తెలంగాణ
వరంగల్‌లో గన్నీ బ్యాగుల తయారీ కేంద్రం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మడికొండ లేదా ఏనుమాముల మార్కెట్ సమీపంలో ఈ పరిశ్రమ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. సోమవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఉమ్మడి ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డులో మిర్చి రైతులకు రైతు బంధు పథకం ద్వారా వడ్డీ రహిత రుణాలను పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఆ తరువాత వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం సింగారం, ధర్మసాగర్ మండలం మల్లక్కపెల్లి గ్రామాల్లో ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ధాన్యం, మొక్కజొన్న ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు అవసరమైన బ్యాగులను సిద్ధం చేసేందుకు బెంగాల్ ముఖ్యమంత్రితో గన్నీ బ్యాగుల అవసరం మేరకు సరఫరా చేయాలని కోరినట్టు చెప్పారు. ప్రతిసారి ఆ రాష్ట్రం మీద ఆధారపడడం ఎందుకు అని ముఖ్యమంత్రి కేసీఆర్ మన రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. వరంగల్ జిల్లాకు గన్నీ బ్యాగుల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరిన వెంటనే సీఎం కేసీఆర్ ఒప్పుకున్నట్టు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. లాక్‌డౌన్ సందర్భంగా వ్యవసాయ మార్కెట్‌ను బంద్ చేసిన నేపథ్యంలో జిల్లాలో మిర్చి రైతులు ఇబ్బందులను తొలగించేందుకు ఏనుమాముల మార్కెట్ మంచి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మిర్చి రైతులకు ఆర్ధిక ఇబ్బందులు తొలగించేందుకు రైతు బంధు పథకం ద్వారా 75 శాతం వడ్డీలేని రుణ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు. అందులో భాగంగా ఏనుమాముల మార్కెట్ చైర్మన్ ముందుకు రావడం అభినందనీయం అని అన్నారు. ఈ పథకం ద్వారా 6 నెలల్లో రైతు అమ్ముకోని పక్షంలో తిరిగి ఒప్పందం పొడిగించూకోవచ్చునని అన్నారు. ప్రభుత్వ ధాన్యం మొక్కజొన్న పంటను గిట్టు బాటు ధరకు కొనుగోలు చేస్తుందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 853 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, 265 మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వివరించారు. ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. నిధులకు కొరత లేదని ధాన్యం కొనుగోలు చేసిన 3 రోజుల్లో రైతు ఖాతాకు జమ చేస్తారని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ చింతల సదానందం పాల్గొన్నారు.
పాస్ పుస్తకం లేకున్నా పంట కొనుగోలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాలు లేని రైతులు పండించిన మొక్కజొన్న, వరి పంటను కొనుగోలు చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం వరంగల్ నగరంలోని నందన గార్డెన్‌లో వరంగల్ అర్బన్ జిల్లాలో మొక్కజొన్న పంట, వరి పంట కొనుగోలు, కరోనా నియంత్రణకు చేపట్టిన చర్యలు, గిడ్డంగులు గుర్తింపుపై రాష్ట్ర రైతు సమన్వయ చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే సతీష్‌కుమార్, జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరితతో కలిసి సమీక్షించారు. రైతులు ఒక్కసారిగా గుంపులుగా రావొద్దని, టోకెన్లు జారీ చేసిన వారే క్రమ పద్ధతిలో వచ్చిన్నట్లైతే ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు. రైతులు సొంత గన్నీ బ్యాగుల్లో పంట తెచ్చుకుంటే ప్రభుత్వం నిర్దేశించిన ధర ప్రకారం ధర చెల్తిస్తామన్నారు.
*చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు