తెలంగాణ

జనగణను తక్షణమే నిలిపివేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: దేశ వ్యాప్తంగా జరిగే జనగణనలో బీసీ కులాల లెక్కలు తీయాల్సిందేనని డిమాండ్ చేస్తూ ఈనెల 23న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేలాది మందితో జరుగబోయే బీసీల జనగణన గర్జన మహాసభను కరోన వైరస్ వ్యాప్తి దృష్ట్యా తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.
రోజురోజుకు వివిధ రాష్ట్రాల్లో ప్రబలుతున్న కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఏప్రిల్ ఒకటొవ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణనను కూడా వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.