S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/19/2019 - 13:55

హైదరాబాద్: ఆర్టీసీ బంద్ సందర్భంగా విపక్షనేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. సిద్ధిపేటలో కాంగ్రెస్, బీజేపీ నేతలను అదుపులోనికి తీసుకున్నారు. ప్రజాసంఘాల నేతలను సైతం అరెస్టు చేశారు. తెజస అధ్యక్షుడు కోదండరామ్, టీడీపీ నాయకులు ఎల్. రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్శింహులు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తదితరులను అరెస్టు చేసి లాలాగూడ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

10/19/2019 - 13:54

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బంద్ జరుగుతుంది. నిరసనకారులు పెద్ద ఎత్తున చేరి ఆందోళన చేస్తున్నారు. అఖిలపక్ష మద్దతు తెలపటంతో అన్ని పార్టీల నాయకులు ఈ బంద్‌లో పాల్గొన్నారు. ఎక్కడి బస్సులు అక్కడ నిలిచిపోయాయి. పోలీసులు భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు.

10/19/2019 - 00:37

నేరేడుచర్ల, అక్టోబర్ 18: హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డికి ఓటు వేస్తే.. అభివృద్ధి చేసి చూపెట్టే బాధ్యత తనదని రాష్ట్ర గిరిజన, స్ర్తి శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ఆమె శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో భాగంగా నేరేడుచర్ల మండలంలోని బావోజితండా, రోళ్లవారిగూడెం, నేరేడుచర్లలో ప్రచారం నిర్వహించారు.

10/19/2019 - 00:37

హుజూర్‌నగర్, అక్టోబర్ 18 : తెలంగాణ రాష్ట్రంలో గత 14 రోజులుగా చేస్తున్న సమ్మెకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నదని మరణించిన డ్రైవర్, కండక్టర్ కుటుంబాలకు వెంటనే నష్ట పరిహారం ఇవ్వాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి డాక్టర్ రామచంద్ర కుంతియా అన్నారు.

10/19/2019 - 00:37

సిద్దిపేట, అక్టోబర్ 18 : నూతనంగా పోలీసు ఉద్యోగాలు పొందిన ప్రతి ఒక్కరు మంచి సమాజాన్ని నిర్మించేందుకు ఆదర్శంగా నిలువాలని మేము ఇచ్చిన శిక్షణ మీ శ్రమ, పట్టుదలతోనే పోలీసు ఉద్యోగాలు లభించాయని రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీష్‌రావు అన్నా రు.

10/19/2019 - 00:36

చౌటుప్పల్, అక్టోబర్ 18: ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఈ నెల 19న తలపెట్టిన తెలంగాణ బంద్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ దిమ్మతిరగాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి సమ్మెను విరమింపజేయకుండా అణచివేసేందుకు కుట్రలు చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు.

10/19/2019 - 00:35

హైదరాబాద్, అక్టోబర్ 18: ముఖ్యమంత్రి కేసీఆర్ తన తీరును మార్చుకోకుంటే ప్రజలే ఆయనను మార్చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన తాజాగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ, ఆ వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవని అన్నారు.

10/19/2019 - 00:35

కల్వకుర్తి, అక్టోబర్ 18: ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలిచి వెంటనే వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కారించాలని శుక్రవారం ఆఖిల పక్షం, ఆర్టీసీ జేఎసీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ఇంటి ముట్టడించారు.

10/19/2019 - 00:34

సూర్యాపేట, అక్టోబర్ 18: ఆర్టీసీ సమ్మెపై ఇప్పటికైనా సీఎం కేసీఆర్ తన వైఖరిని మార్చుకొని స్పందించకుంటే సమ్మె ఉధృతమై సకల జనుల సమ్మెగా రూపాంతరం చెందుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా 14వ రోజు సూర్యాపేట జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ డిపో ముందు జరుగుతున్న ఆందోళనలో పాల్గొని మద్దతు తెలిపారు.

10/18/2019 - 23:42

హైదరాబాద్ తాజ్‌కృష్ణలో శుక్రవారం సాయంత్రం జరిగిన మెదక్ ఎస్పీ చందన దీప్తి-బల్‌రామ్
పెళ్లి రిపెప్షన్‌కు హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్. అంతకుముందు ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా ఈ వివాహానికి వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు.

Pages